– 3.50 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు పంపిణి
– అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఘనంగా నిర్వహించాలి
– మంత్రులు, ఎమ్మెల్యేలకు ముందస్తుగా సమాచారం అందించి సమన్వయం చేసుకోవాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ కు డిప్యూటీ సీఎం ఆదేశం
– జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జరిగే వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి మండల సమాఖ్య తో పాటు గ్రామ సమాఖ్యలో ముఖ్యులందరూ హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని వదిలేసింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందనీ తెలిపారు.
ఈ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఒక నమ్మకం, ధైర్యం వచ్చిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెండు మూడు దఫాలుగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశాం. ఈనెల 25న మరో మారు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు పంచబోతున్నామని వివరించారు. రాష్ట్రంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్లు అద్భుతంగా నిర్వహించారు. ప్రతి మండలం నుంచి సమాచారం అందింది అని డిప్యూటీ సీఎం తెలిపారు.
నాణ్యతతో కూడిన మంచి డిజైన్లు కలిగిన చీరలను పంపిణీ చేశారని మహిళా మణులు ఆనందం వ్యక్తం చేశారని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతి గ్రామానికి ఇందిరమ్మ చీరలు చేరవేయడంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విజయవంతం చేసినందుకు కలెక్టర్లు అందరిని అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా,సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.
