తిరుపతి: ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి విల్సన్ తిరుపతి పట్టణం లోని వివిధ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇతర ఉన్నత అధికారులతో భేటీ అయ్యారు.ఈ సందర్బంగా మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వి.ఉమా ని కలిసి తెలుగు అకాడమీ అభివృద్ధి కి సహకరించాలని కోరారు.యూనివర్సిటీ ప్రింటింగ్ వర్క్స్ ఇస్తానని ఉమ హామీ ఇచ్చారు. సమావేశం లో యూనివర్సిటీ రిజిస్టార్ రజని పాల్గొన్నారు. తదుపరి ఎస్ వి. యూనివర్సిటీ రిజిస్టార్ భూపతి నాయుడు,రెక్టర్ అప్పారావ్ లతో విల్సన్ బేటీ వేశారు.
రిజిస్టార్ యూనివర్సిటీ సమస్యలు ఏకరువు పెట్టారు. కోర్టులో వచ్చిన తీర్పుల వల్ల రిక్రూట్మెంట్ ఆలస్యమవుతుందన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకొచ్చామని పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాం అన్నారు. ఇందుకు తన వంతు సహకారం అందిస్తానని విల్సన్ హామీ ఇచ్చారు.అనంతరం జాతీయ సంస్కృత యూనివర్సిటీ ని సoదర్శించారు. యూనివర్సిటీ రిజిస్టర్ కడియం వెంకట నారాయణ, డిన్ ఎకడమిక్స్ రజనీకాంత్ శుక్ల తదితర ఆహ్వానం పలికి శాలువా కప్పి సన్మానించారు