నటసింహం నందమూరి బాలకృష్ణ
– మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘అఖండ 2’…
దేశవ్యాప్తంగా అఖండమైన ప్రమోషన్స్‌తో దూసుకెళ్తోంది. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, పాటలతో రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే, ‘అఖండ 2’ బృందం సినిమాను ఉత్తరాది ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేందుకు వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మూవీ టీమ్ మర్యాదపూర్వకంగా కలిసింది.
శివుడి త్రిశూలం… సీఎం చేతికి!
ఈ భేటీలో హైలైట్ ఏంటంటే… ‘అఖండ 2’ చిత్రంలో ఉపయోగించిన త్రిశూలాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చిత్ర బృందం ప్రత్యేకంగా అందించింది. హిందూ ధర్మం, ఆధ్యాత్మికత నేపథ్యాలు ఉన్న యోగికి ఈ త్రిశూలం ఇవ్వడం చర్చనీయాంశమైంది. త్రిశూలాన్ని స్వీకరించిన సీఎం యోగి ఆదిత్యనాథ్, ‘అఖండ 2’ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. బాలయ్య-బోయపాటిల ఈ శక్తివంతమైన సీక్వెల్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య బాబు నట విశ్వరూపం ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ సినిమాకు మరింత హైప్ పెంచింది!