– భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్ లో బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్: దేశానికి ఎప్పుడైనా సంక్షోభం వచ్చినా, ఆ సంక్షోభాన్ని పరిష్కరించే జవాబు మన రాజ్యాంగమే..1949 నవంబర్ 26న భారత రాజ్యాంగానికి ఆమోదం లభించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాణం జరిగింది. రాజ్యాంగాన్ని రచించే సమయంలో ఆరుగురు తెలుగువారు ముఖ్య పాత్ర పోషించారు. ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, వాటి మంచి గుణాలను తీసుకొని మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఎందుకు చదవాలి, ఎందుకు గౌరవించాలి అనేది తెలుసుకోవాలి.
మనకు వాక్ స్వేచ్ఛ ఉంది, దాంతో పాటు రాజ్యాంగాన్ని గౌరవించుకునే బాధ్యత కూడా మనపై ఉంది. హక్కులను అనుభవించే సమయంలో బాధ్యతగా ఉండాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా, స్వేచ్ఛ పేరుతో అనవసరంగా మాట్లాడకూడదు.. కొంతమంది సోషల్ మీడియాలో లేదా ఇతర ఫ్లాట్ ఫారమ్‌లలో వాక్ స్వాతంత్ర్యం పేరుతో అడ్డంగా మాట్లాడుతూ, భరతమాతను కూడా కించపరుస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని అనేకసార్లు ఉల్లంఘించారు. రాహుల్ గాంధీ వంటి వారు చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టి తిరుగుతుంటారు. కాని రాజ్యాంగంలోని ఆర్టికల్స్, చాప్టర్స్, నిబంధనలను ఆయనకు తెలియవు.
నాడు తన ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని హైకోర్టు నిర్ణయం ప్రకారం డిస్క్వాలిఫై చేయబడినప్పటికీ, అన్యాయంగా ఎమర్జెన్సీ విధించి, అనేక వ్యక్తులను, చిన్నారులు సహా జైల్లో పెట్టారు.యూపీఏ హయాంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను డిస్మిస్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దేశంలో రాజ్యాంగబద్ధంగా పాలన జరుగుతోంది. రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారి జ్ఞాపకార్థం, గౌరవార్థంగా ఐదు ప్రదేశాలను “పంచతీర్థం”గా అభివృద్ధి చేశారు.
“ప్రధాని నరేంద్ర మోదీ డాక్టర్ అంబేద్కర్ గౌరవార్థం ఆయన నడయాడిన ఐదు ముఖ్య ప్రదేశాలను – మధ్యప్రదేశ్ (జన్మ స్థలం), UK, లండన్ (విద్యాభాసం సమయంలో నివాసం), నాగ్‌పూర్ (దీక్షా భూమి), ఢిల్లీ (మహాపరినిర్వాణ స్థలం), ముంబై (చైత్య భూమి) – ‘పంచ తీర్థాలు’గా తీర్చిదిద్ది, న్యూఢిల్లీ లో డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ భవనాన్ని కూడా నిర్మించి, ఆయనకు భారతదేశ చరిత్రలో సముచిత గౌరవాన్ని కల్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర సేవాపురస్కారం “భారత రత్న” గౌరవాన్ని సమర్పించింది. గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బిజెపిపై తప్పుడు ప్రచారం చేసింది.
రిజర్వేషన్ల పేరుతో బిజెపిపై అబద్ధాలు సృష్టించారు. బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ మార్ఫింగ్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసింది. ఆ క్రిమినల్ కేసు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నడుస్తోంది. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ పుస్తకం చేతిలో పట్టుకుని అబద్ధాల ప్రచారం చేయడం కాదు.. గౌరవించడం నేర్చుకోవాలి.
కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు రాజ్యాంగాన్ని అవహేళన చేసింది.. ఇప్పుడు కూడా చేస్తోంది. ఎలక్షన్ కమిషన్ సభ్యులపై బెదిరింపులు, తప్పుడు ప్రచారం – ఇవి కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడితే బిజెపి మీద ఈవీఎం ట్యాంపరింగ్ అని దుష్ప్రచారం చేసింది. కానీ హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంలు ఎలా పనిచేశాయి? మొన్న బిహార్ లో బిజెపి గెలిస్తే.. ఓటు చోరీ అంటూ రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ నాయకులు మరోసారి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు. ఇది కాంగ్రెస్ నైజం. యూపీఏ పాలనలో దేశంలో అనేక స్కాంలు, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పాలన కొనసాగిస్తోంది.
భారతీయ జనతా పార్టీలో అత్యధిక ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.. బీసీలకు సముచిత స్థానం కల్పించబడింది. దేశంలో ఎన్నికల ఖర్చును తగ్గించేలా, దేశ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గేలా.. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ప్రజలందరు దీనికి మద్దతు తెలిపాలని కోరుతున్నా. దేశంలో భిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉన్నా భిన్నత్వంలో ఏకత్వం – భారత రాజ్యాంగ గొప్పతనం. గత కొన్ని దశాబ్ధాలుగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్ను వ్యవస్థల కారణంగా ప్రజలందరికీ ఇబ్బందులు ఎదురయ్యాయి.
దీంతో NDA ప్రభుత్వం వన్ నేషన్ – వన్ ట్యాక్స్ కోసం జీఎస్టీ ప్రవేశపెట్టింది. ఇటీవల జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం తగ్గించింది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంట్లో నారీ శక్తి వందన్ అధినియమ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది..తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే హామీని కాంగ్రెస్ కేవలం 17%కి పరిమితం చేసింది. రాష్ట్రంలో దళితులు, ఎస్టీ మహిళలపై అత్యాచారాలు, అన్యాయాలు కొనసాగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఐటీడీఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ ప్రాంతాలకు నిధులు అందిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణలో గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ – ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం విస్మరించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రాజ్యాంగం ముఖ్యం కాదు, రాజకీయ లబ్ధి మాత్రమే ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని హననం చేయడానికి కుట్ర చేస్తోంది.. బిజెపి మాత్రమే రాజ్యాంగాన్ని రక్షిస్తుంది.