అమరావతి: దోమల నివారణకు వాడే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకరమైన మేపర్‌ఫ్లూథ్రిన్ అనే పురుగుమందు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల విజయవాడలోని ఒక షాపులో తనిఖీలు చేసి సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్కు పంపగా.. ఈ అగరబత్తీల్లో ప్రాణాంతక రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనివల్ల శ్వాసకోశ, నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఈ అగరబత్తీలను వాడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.