– రూ.7800 కోట్లు విద్యార్ధులకు బకాయిలు పెట్టిన ప్రభుత్వం
– 18 నెలల కూటమి పాలనలో 8 త్రైమాసికాల ఫీజులు బకాయి :- వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ప్రకటన
తాడేపల్లి: అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా.. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్స్ చెల్లించని కూటమి ప్రభుత్వ తీరుపై వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యార్థి విభాగం ప్రెసిడెంట్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి చైతన్య, రవిచంద్రలు.. తక్షణమే ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రూ.5,600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో విద్యార్ధులతో కలిసి దశలవారీ ఆందోళన చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల నుంచి, సీఎం సహా మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన, వసతిదీవెన కింద రూ.18,663 కోట్లు ఖర్చు చేసి, 55 లక్షల మంది విద్యార్ధులకు లబ్ది చేకూర్చితే.. 2014–19 మధ్య చంద్రబాబు కేవలం 16 లక్షల మందికి మాత్రమే ఫీజు రీయింబర్స్ చేశారు. 8 త్రైమాసికాలకు గానూ రూ.5,600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ ఖర్చుల కింద ఏటా రూ.1100 కోట్ల చొప్పున మరో రూ.2,200 కోట్లు.. వెరసి మొత్తం రూ.7,800 కోట్లు ప్రభుత్వం పిల్లలకు బకాయి పడింది.
: