– పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు
– పేదవాళ్లకు మంచి జరుగుతుంటే వైసీపీకి ఎందుకింత బాధ?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మంగళగిరి : మీ పిల్లలు చెక్క బల్లల మీద చదవాలా? లేక కుషన్ సీట్లమీద హాయిగా కూర్చుని చదవాలా? అని ప్రజల్ని ఉద్దేశిస్తూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. నేడు ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే, ప్రజలు జగన్ రెడ్డిని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోవడం ఆయన పాలనకు ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు. నేను మాటిమాటికీ జగన్ గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఆయన పాలసీలు, ఆయన ఆలోచన – పేదవాడు పేదగానే ఉండాలి, ధనవంతుడు మరింత ధనవంతుడు కావాలి అనేదే స్పష్టంగా కనిపిస్తోంది” అని అన్నారు.
“నాకు సైకాలజీ బ్యాక్గ్రౌండ్ ఉంది. మనిషి ముఖమే చాలూ – అతడి మనసు తెలుస్తుంది. చంద్రబాబు గారిలాంటి విజనరీ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేద్దాం అంటే… దానికి జగన్ అడ్డుపడటం ఏ న్యాయం? ఏ ధర్మం? పేదవారికి ఉపయోగం అయ్యే పనిని అడ్డుకోవడం జగన్ రెడ్డి గారి స్వభావమని ప్రజలు తెలుసుకోవాలి” అని పేర్కొన్నారు. ప్రజల్లో జగన్ చేస్తున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ.. “పీపీపీ అంటే పేదలకు నష్టం కాదు, భారీ ఉపయోగం. రాజకీయం కోసం పేదల భవిష్యత్తును అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం?” అని ప్రశ్నించారు.
పీపీపీ మెడికల్ కాలేజీలు – వాస్తవాలు, లాభాలు
– అదనంగా 220 మెడికల్ సీట్లు
– పేదలకు శుభవార్త
పీపీపీతో రాష్ట్రానికి 220 అదనపు మెడికల్ సీట్లు లభిస్తాయి. పేద పిల్లలకు చదువు అవకాశాలు పెరగడం మీకు ఎందుకండీ ఇబ్బంది జగన్ గారూ?” అని ప్రశ్నించారు.
– కాలేజీ పేరు తప్పనిసరిగా ‘ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి’ కార్పొరేట్ స్థాయి సేవలు
– కానీ పేదలకు అందుబాటులో. ‘ఇది ఏ ప్రైవేటు వ్యక్తుల పేర్లు పెట్టే వ్యవహారం కాదు. ప్రభుత్వ పేరు, ప్రభుత్వ నిబంధనలే. ఇప్పటికైనా అర్థం చేసుకోండి రాజా’ అని వ్యాఖ్యానించారు.
– కేటాయించిన భూముల్లో వాణిజ్య కార్యకలాపాలకు పూర్తిగా నిషేధం. ‘చంద్రబాబు స్వయంగా కండిషన్ పెట్టి చెప్పారు
– వైద్యేతర ఉపయోగాలు అసలు జరగకూడదు. స్పష్టమైన నియమాలు పెట్టినప్పుడు కూడా జగన్ కి ఇబ్బంది ఎందుకు?’ అని ప్రశ్నించారు.
– 625 పడకల ఆసుపత్రి + 150 మెడికల్ యూజీ సీట్లు + 24 పీజీ సీట్లు – రెండేళ్లలో సిద్ధం. కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి – కానీ పేదలకు ఉచిత/తక్కువ ఖర్చుతో చంద్రబాబు విజన్ ప్రకారం. ‘జగన్ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మించాలంటే 15 ఏళ్ళు పడుతాయి. అంతవరకూ పేదవాళ్లు బతకకూడదా?’ అని అడిగారు.
– భవిష్యత్లో దంత, నర్సింగ్, టెలీమెడిసిన్ కేంద్రాలు – పేదలకు పూర్తి లాభం. ‘పీపీపీ వల్ల భవిష్యత్లో ప్రతి ఇంటికీ వైద్యం చేరుతుంది. ఇది పేదలను పైకి లాగే పాలసీ’ అని తెలిపారు.
– అదనపు అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయంలో 3% ప్రభుత్వం పొందుతుంది. “పీపీపీ అనేది ప్రభుత్వానికి నష్టం చేసే మోడల్ కాదు. ప్రజలకు మేలు జరిగేదని.. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి” అని అన్నారు.
జగన్ గారి అడ్డంకులు – పేదల భవిష్యత్తుకు బారికేడ్లు
“రెండేళ్లపాటు నిర్మాణ సమయంలో కూడా ఉద్యోగుల జీతాలు ప్రభుత్వం భరిస్తోంది. ఇది ప్రజాసేవ కోసం రూపొందించిన విధానం. పేదల విద్య, వైద్యాన్ని మెరుగుపరచేందుకు జరుగుతున్న మహా యజ్ఞాన్ని జగన్ గారు అడ్డుకోవద్దని గౌరవంగా కోరుతున్నాం” అని పేర్కొన్నారు.
చివరిగా ప్రజలను ఉద్దేశించి..
“జగన్ దుష్ప్రచారాలు విని మోసపోవద్దు. మీ పిల్లలు చెక్క బల్లల మీద చదవాలా? లేక కుషన్ సీట్లమీద హాయిగా కూర్చుని చదవాలా? మీరే ఆలోచించండి. పేదల సంక్షేమం మా సంకల్పం. పీపీపీ విధానం ప్రజల కోసమే వచ్చింది” అని స్పష్టం చేశారు