– మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
హైదరాబాద్ : పవన్ వ్యాఖ్యల పై లేటుగా స్పందిస్తున్న కాంగ్రెస్ నేతల పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒక ప్రాంత మనోభావాలు దెబ్బతిన్నాయని అనిపిస్తే వెంటనే ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్లు చెప్పాల్సి ఉంది. వారాంతం తెలంగాణకు ఎక్కువగా వచ్చే పవన్ కి ఇక్కడే ఎక్కువ ఆస్తులున్నాయి.
ఎక్కువ సమయం తెలంగాణాలోనే ఉన్న పవన్ ఇక్కడి ప్రాంతాన్ని కూడా ప్రేమించాలి. పవన్ పరిణతి చెందిన నాయకుడిగా ఇప్పటికే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సి ఉంది. ఉద్యమం తరవాత అంతా ఎక్కడా క్రాస్ టాక్ మా వైపు నుండి రాలేదు. మంచి కాంక్షించి అందరిని కడుపులో పెట్టి చూసుకున్నాం. పది రోజుల తరువాత పవన్ మాటలపై కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. కాంగ్రెస్ కమీషన్లు పంచుకునే పనిలో ఉండి పవన్ వ్యాఖ్యలు పట్టించుకోలేదా?
కాంగ్రెస్ ఇప్పుడు స్పందించడం పై ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా లేక మ్యాచ్ ఫిక్సింగా? బహుశా వాటర్లో నీళ్ళు కలుపుకొనే మంత్రులు స్పృహలో లేనట్టుంది. ఇలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడిపడం కష్టమే. కాంగ్రెస్ నేతలకు తెలంగాణ హక్కులు , ఆకాంక్షల పట్ల బాధ్యత లేనట్లు కనిపిస్తుంది. దందాలు చేస్తూ రాష్ట్రాన్ని మరచిపోతున్నారు.
పవన్ సినిమాలు ఎలా ఆగుతాయి ఎవరి అభిమానులు వారికి ఉంటారు? కాంగ్రెస్ మంత్రులు పవన్ సినిమాలు చూడొద్దంటే జనాలు ఆగుతారా…? సెన్సేషన్ కోసం డైలాగులు మాట్లాడొద్దు. ఎవరు మాట్లాడినా ప్రజాస్వామిక పద్ధతి పాటించాలి. పవన్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిదని సలహా.