– ప్రతి వారం చర్చి ప్రార్థనలో పాల్గొంటూ ఎస్సీ ఎస్టీ అట్రాస్టి కేసులు పెట్టేసుకుంటారా?
– గిల్లితే గిల్లించుకోవాలా?.. కొడితే కొట్టించుకోవాలా?
– అంబేద్కర్ గారిలా సూట్ వేసుకున్నంత మాత్రాన అందరూ అంబేద్కర్లు అయిపోరు
– క్రిస్టియన్ స్మశాన వాటికలో పూడ్చిపెడితే ఏమవుతారు? ముస్లిమ్స్ అవుతారా? హిందూస్ అవుతారా శ్రవణ్ కుమార్ గారు!
– మాజీ మెజిస్ట్రేట్ జడా శ్రవణ్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఘాటు వ్యంగ్యాస్త్రాలు
హైదరాబాద్: తనపై విమర్శలు చేసిన మాజీ మెజిస్ట్రేట్ జడా శ్రవణ్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు సుతిమెత్తగా చురకలు అంటిస్తూ.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రఘురామ రాజు ఏమన్నారంటే.. మాజీ మెజిస్ట్రేట్ జడా శ్రావణ్ కుమార్ గారు వెబ్ ఛానల్ లో చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది. మొత్తం నా గురించే మాట్లాడటం జరిగింది. కొన్ని మెచ్చుకున్నారు కూడా. ఒకప్పుడు ఆయన నన్ను చాలా సపోర్ట్ చేశారని, ఆయన సపోర్ట్ వల్ల నేను నిలబడగలిగానని. ఓకే. రెండు నిజాలు ఉన్నాయి. .సపోర్ట్ చేసిన మాట నిజం. నా సపోర్ట్ వల్లనే నేను నిలబడ్డానా లేదా అన్నది నాకు పెద్దగా తెలియదు. కానీ సపోర్ట్ చేసిన మాట నిజం.
ఏదో మెచ్చుకున్నారు.. నాకు కొంచెం లా తెలుసు. అది ఇది అని కూడా అన్నారు. ఆ తర్వాత ఇంకొన్ని మాటలు మాట్లాడారు. ఏమి తెలియదు అన్నట్టుగా.. అన్ని ఆయనకే తెలుసు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. నాకు తెలియంది ఏంటి? ఆయనకి తెలిసింది ఏంటి అనేది కొంచెం డీటెయిల్డ్ గా చర్చించవలసిన అవసరం ఉంది. ఆయన ఒక మాట అన్నట్టున్నారు. నాకంత సమయం అక్కర్లేదు. సాధ్యమైనంత తక్కువ సమయంలోనే కొంచెం ఎక్కువ అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తా.. ముందుగా ఒక ప్రధానమైన అభియోగం ఏమిటంటే, సరే ఇదంతా ఎందుకు వచ్చిందంటే.. పివి సునీల్ కుమార్ ఎక్కడో చోడవరంలో మాట్లాడారు. కాపులు – దళితులు మనం కలవాలి. మీరు సీఎం తీసుకోండి. జనరల్ గా ఉప ముఖ్యమంత్రి చేస్తామన్నప్పుడు ..జనరల్ ఓకే. ఇట్స్ ఫెయిర్ ఆన్ హిస్ పార్ట్ టు సపోర్ట్ పివి సునీల్ కుమార్ . శ్రవణ్ కుమార్ తలుచుకుంటే అసలు మీరు బయటికి రాగలరా అని కూడా అన్నారు.
సో అందుచేత ఆయన తలుచుకోకముందే కొన్ని నిజాలు చెబుదాం. వాళ్ళ ఒక ప్రధాన అభియోగం ఏమిటంటే ఇంత తెలుసు కదా.. ఇంత లీగల్ నాలెడ్జ్ ఉంది కదా. టెన్త్ షెడ్యూల్ గురించి చదువుకోలేదా? రాజ్యాంగంలో టెన్త్ షెడ్యూల్ లో పాయింట్ నెంబర్ ఫైవ్ లో ఏముందో చూడలేదా? ఆ మాత్రం అర్థం కాదా? యు మస్ట్ రిజైన్. ఫ్రమ్ యువర్ మెంబర్షిప్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ రాజీనామా చేయాలి. అంత స్పష్టంగా ఉంటే మీకు అర్థం కాలేదా? ఎందుకని రాజీనామా చేయలేదు? సో ఇప్పటికైనా చేయకపోతే, నేను ఈరోజు సాయంత్రం ఐదు గంటలకో ఏదో టైం కూడా చెప్పినట్టు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఒక లేఖ రాస్తారట. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకూ ఒక లేఖ రాస్తారట. వెంటనే తీసేయండి. రాజీనామా లేకపోతే మీరు ఓటింగ్ పెట్టినా సరే తీసేయమని చెప్తాను. ఊరుకునేదే లేదు. తగ్గేదేలే అన్న స్టైల్లో ఆయన నా మీద నిప్పులు చెరిగారు. ఓకే. అందులో మనం జడ్జ్ అని పిలుచుకుంటాం. బట్ హి వాస్ ఏ మెజిస్ట్రేట్. ఫైన్. కానీ ఆయన ఒక మెజిస్ట్రేట్ గా కూడా డెఫినెట్ గా నాలెడ్జ్ ఉంటుంది.
మరి ఆటెన్త్ షెడ్యూల్ గురించి తెలుసా అని నన్ను అడిగారు. ప్రజలతో నేను పంచుకోవాలనుకునేది ఏంటంటే.. చాలా మంది ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు గూగుల్ సెర్చ్ చేయండి. టెన్త్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని. 1985వ రాజ్యాంగ సవర ప్రకారం.. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కింద ఉండగా, యాంటీ డిఫెక్షన్ చట్టం అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి దాని కోసం పొందుపరిచిన షెడ్యూల్ అండి 10 షెడ్యూల్. ఆటెన్త్ షెడ్యూల్ లో సరే ఫస్ట్ డెఫినిషన్ అయిన తర్వాత సెకండ్ పాయింట్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. ఇది నేను రాజ్యాంగం ప్రింట్ తీసి, అందులో ఉన్నదే చదువుతున్నా. శ్రావణ్ కుమార్ గారు.. ఒకవేళ మీరు చూస్తూ ఉండుంటే, అదే చదువుతున్నా. ఎవరైనా ఒక పార్టీ తరపున ఎన్నికైన వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేస్తే అతని సభ్యత్వం పోతుంది అనేది.
ఇదేమిటంటే కుమార్ గారు.. అందులో స్పష్టంగా ఒకవేళ నీవు రాజీనామా చేయాలి అనుకొని రాజీనామా చేస్తే, పాయింట్ నెంబర్ టూ లో ఉన్న డిఫెక్షన్నీకు అప్లై కాదు అని చెప్పారు. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మాండేటరీ. ఇట్ ఇస్ ద డిస్క్రీషన్ గివెన్. మీరు చెప్పిన నీలం సంజీవరెడ్డి ఎగ్జాంపుల్ . ఆయన లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైనప్పుడు ఆయన రాజీనామా చేయటం జరిగింది. ఇక్కడ ఈ యాంటీ డిఫెక్షన్ వచ్చినప్పుడు ఈ బిల్లు వచ్చిన తర్వాత.. ఒకవేళ ఎవరైనా ఇలా రాజీనామా చేస్తే , సంజీవ రెడ్డి గారి లాగా ఆయన ఈ చట్టం ప్రకారం డిస్ క్వాలిఫై అవుతాడు కదా? స్పీకర్ – డిప్యూటీ స్పీకర్ ఒకవేళ కౌన్సిల్ ఉంటే గనుక, ఆ రాష్ట్రంలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు వారి వారి పార్టీలకి రాజీనామా చేస్తే డిస్క్వాలిఫికేషన్ రాదు. ఆ టర్మ్అయిన తర్వాత, వారు ఆ ముందు పార్టీలో గాని, వేరే ఇతర పార్టీలో గాని జాయిన్అ యినప్పటికీ కూడా, ఈ డిస్క్వాలిఫికేషన్ అప్లై అవ్వదు. మీరే ఒకవేళ మొన్న మంగళగిరిలో నెగ్గి మీరే డిప్యూటీ స్పీకర్ అయ్యి , ఆ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చిన్న పోస్ట్ స్పీకర్ అయుండి, అలా మీరు ఒకవేళ రాజీనామా చేసి ఉంటే, మీరు ఆ తర్వాత వేరే ఏ పార్టీలో అయినా చేరవచ్చు.
మీరు విలువలు కలిగి రాజీనామా చేస్తే, డిస్క్వాలిఫై అయ్యే రిస్క్ లేకుండా ఈ ప్రొవిజన్ ని ఇవ్వడం జరిగింది. దీన్ని ఎం కార్పొరేట్ చేశారు. సో ఇట్ ఇస్ డిస్క్రిషనరీ ఇట్ ఇస్ నాట్ మాండేటరీ. అంచేత మీరు తప్పకుండా రాసుకోండి. ఇబ్బంది లేదు. ఇందులో ఉన్నదయతే ఇది డిస్క్రిషన్ే . ఇక ఇంకో పాయింట్ మీరు ఏమన్నారంటే. అసలు పార్టీలకే అతీతంగా ఉండాలి. ఎస్. మీరు ఎప్పుడు మీరు సూట్లు వేసుకుంటారు. బాగుంటారు. ఫైన్ . బ్రిటన్ రాజ్యాంగంలో ఎవరైనా స్పీకర్ గా ఎలెక్ట్ అయితే, దే హావ్ టు రిజైన్. బట్ ఇండియన్ రాజ్యాంగంలో రెసిగ్నేషన్ హస్ నాట్బి మాండేటరీ. ఎట్ ఆల్ ఓన్లీ క్లోజన్ ఇచ్చారని ఇందాకే చెప్పుకున్నాం కదా ? సో బట్ ఆ సీట్ లో ఉన్నప్పుడు పార్లమెంట్ లో గాని, అసెంబ్లీలో గాని ఉన్నప్పుడు కచ్చితంగా మోరల్స్ పాటించాలి. అలాగే మా స్పీకర్ గారైనా ఉంటారు.
నేనైనా ఉంటారు. నా స్పీకర్ గారైనా ఎందుకంటున్నాను అంటే.. మీరు ఆయన పేరు కూడా ఉచ్చరించారు. మీరు ఇచ్చిన ఆ ప్రెస్ రిలీజ్ లో, ఆ వీడియోలో ఇచ్చారు. కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. ఆ మధ్య రెండు సార్లు జరిగిన అమరావతి పార్టీ ఆఫీస్ లో జరిగిన మీటింగ్ గాని, ఎస్పెషల్లీ మా అసెంబ్లీ జరిగేటప్పుడు కొన్ని పార్టీ మీటింగ్స్ జరిగితే ఆ పార్టీ మీటింగ్స్ ఎటువంటి పార్టీ మీటింగ్లో నేను పార్టిసిపేట్ చేయట్లేదా? నా నియోజక వర్గంలో కూడా నేను ఏ నా అఫీషియల్ కార్యక్రమాలకు వెళ్ళినా, ఇంకా ఆ గత ఎలక్షన్స్ లో పంచాయతీలు ఎక్కువ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు. కాబట్టి ఆ సర్పంచులు కూడా వస్తారు. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిని. సో ఇన్ ఏ వే ఇట్ ఇస్ నాన్ పొలిటికల్ ఆర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ హ ఆర్ ఇన్వాల్వడ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ దే కెన్ అసెంబుల్. ఇంకొకటి ఆ వెనకాల చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఫోటోలు పెట్టు కూర్చున్నారని అన్నారు.
నా నియోజక వర్గంలో నా వెనకాల ఉన్న ఫోటోలో, నేను ఆ సీట్ లో నన్ను చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైతే నన్ను ఆ పోస్ట్ కి ఎంపిక చేశారో, ఆ ఎంపిక చేసిన ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి నన్ను చైర్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఆ చిత్రపటాన్ని నేను నా ఆఫీస్ లో పెట్టుకున్నాను. నేను కూర్చుని ఉండగా ఒక పక్క బాబుగారు, ఇంకో పక్క కళ్యాణ్ గారు నా పక్కన ఉన్న ఆ ఫోటోని నేను పెట్టుకున్నా. నేను సపరేట్ గా ఫోటోలు పెట్టుకున్నా కూడా తప్పులేదు. కుమార్ గారు.. నేను ఎప్పుడూ కూడా ఆ సీటు ఉన్న గౌరవాన్ని తగ్గించను. ఎలివేటే చేస్తాను తప్ప తగ్గించను. విలువలు గల వ్యక్తిగా విలువలు పాటించవలసిన ఈ పదవిలో ఉన్నప్పుడు, విలువలు పాటించవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి, నేను పార్టీని ఎప్పుడు రిప్రజెంట్ చేయలేను. ఎప్పుడు మాట్లాడినా కూడా స్పష్టంగా చెప్పా. పివి సునీల్ కుమార్ ఇష్యూలో అతను చేయరాని తప్పు చేశాడు.
నన్ను దారుణంగా హింసించాడు. చంపే ప్రయత్నం చేశాడు. హాస్పిటల్ రికార్డులు తారుమారు చేశాడు. కేవలం అతని ప్రమోషన్ కోసమో, ఇంకెందుకోసమో చేయకూడని తప్పులన్నీ చేశాడు. అతని గురించి నేను మాట్లాడతాను మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉంది. అతని మీద ఇంకా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అనేదే నేను అప్పుడు మాట్లాడాను. హౌస్ కి రాలేరు కాబట్టి ఒకసారి తెలియాలని లేదు. అందరూ ఎమ్మెల్యే అయితేనే ఇన్ని రూల్స్ తెలియాలని లేదు. మీరు రాలేదు కాబట్టి తెలియకపోవడానికి అవకాశం ఉంది. తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి. నేను మాట్లాడింది ఆ సమయం గురించి. . గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారు 94 లో మెజారిటీ వచ్చినప్పుడు కూడా అక్కడ ప్రతిపక్ష నాయకుడు వాదా ఇవ్వలేదు. 2014 లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఇవ్వలేదు. సో.. డిప్యూటీ స్పీకర్.. నీకు రూల్స్ తెలియదా? అతనికే రూల్స్ చెప్తావా? ఏ హక్కు ఉంది. అతనికి రూల్స్ చెప్పడానికి? సర్వీస్ రూల్స్ ఉన్నాయా?..రూల్స్ ఉన్నాయి అని చెప్పాను. మీరు ఏదో పార్టీ పెట్టుకున్నారు మీరే అంటా ఉంటారు. సో తలుచుకుంటే..ఏమన్నారు? అసలు తిరగగలరా అన్నారు.
మీకున్న బలం తెలుసు. మంగళగిరిలో మీరు పోటీ చేశారు. మంగళగిరిలో మీకు మద్దతుగా 451 మంది ఉన్నారు అలా చూసుకుంటే రాష్ట్రం మొత్తం ఒకవేళ మీకు 175 సీట్లో మీరు పోటీ చేసినా, అత్యధిక పాపులేషన్ మంగళగిరిలో వచ్చిన ఓట్లు మీకు అన్ని చోట్లలో వచ్చినా కూడా.. నాకు వచ్చినంత మెజారిటీ కూడా మీకు లేదు. నన్ను దారుణంగా చిత్రహింసలకు గురిచేసిన ఒక వ్యక్తి , అదుపు తప్పి ప్రవర్తిస్తూ ఉంటే కావాలంటే రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవచ్చు. సరే ఇంకొక దానికి కూడా సమాధానం చెప్పాలి. జోసెఫ్ హోనా జోసెఫ్ మీరు ఆ దాని గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పెద్దవారిని ఇచ్చారు చర్చికి వెళ్తేనే సర్టిఫికెట్ రద్దు చేస్తావా? అక్కడక్కడ సింగులర్ టెన్స్ కూడా వాడారు.
ఫైన్. అది నీ సంస్కారం. డిప్యూటీ స్పీకర్ అంటూ ఇంటెన్షనరీ ప్రయోగం కూడా చేశారు. ఫైన్. కోనా జోసెఫ్ కేస్ మీరు టేక్ అప్ చేశారు ఆ మధ్య వచ్చిన నోటీస్ లో కోనా జోసెఫ్ హాబిట్ వల్ ఎస్సీ ఎస్టి అట్రాసిటీస్ కంప్లైంట్ మీ మీద పెట్టారా? మీకు కావాల్సిన వాళ్ళ మీద పెట్టాడా అని అడిగారు. ఎస్ మాకు కావాల్సిన వాళ్ళ మీద పెట్టాడు. కోనా జోసెఫ్ స్కూల్ సర్టిఫికెట్ వెరిఫై చేస్తే , క్రిస్టియన్ అని ఉంది. కాలేజ్ సర్టిఫికెట్ వెరిఫై చేస్తే క్రిస్టియన్ అని ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రుల్ని ఆ క్రిస్టియన్ స్మశాన వాటికలో పూడ్చిపెడితే క్రిస్టియన్స్ అయిపోతారా అని అడిగారు. ఏమవుతారు? ముస్లిమ్స్ అవుతారా? హిందూస్ అవుతారా శ్రవణ్ కుమార్ గారు! క్రిస్టియన్ స్మశాన వాటికలో పూడ్చిపెట్టి సిలువ వేసి సమాధి కడితే, క్రిస్టియన్ కాడా? హిందూ అవుతాడా ముసల్మాన్ అవుతాడా? వాడండి! సో అతను చర్చి నిర్మాణంలో కీ రోల్ చేశాడు. చర్చిలో పెద్ద అక్షరాలతో ఆయన పేరు ఉంది.
సర్టిఫికెట్స్ అన్ని క్రిస్టియన్ అనే ఉన్నాయి. మీరు ఏదో సలహా ఇచ్చి ఉంటున్నారు. బాప్టిజం సర్టిఫికేట్ లేకుండా మేనేజ్ చేసుకోండి. కుదరదు. అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి. ఎస్. ఈ సర్టిఫికెట్ హస్ బీన్ కాన్సల్. కోర్టులో మీ ప్రయత్నం మీరు చేసుకుంటున్నారు. చేసుకోండి. మీరు ప్రూవ్ చేయండి. అతను క్రిస్టియన్ కాదు అని. క్రిస్టియన్స్ స్మశాన వాటికలో పూడ్చి పెట్టినంత మాత్రాన క్రిస్టియన్ అవ్వాలని ఎక్కడ ఉందో ఏదో జడ్జ్మెంట్ తీశారు కదా? 1969 లో జడ్జిమెంట్, లేటెస్ట్ జడ్జిమెంట్లు నా దగ్గర ఉన్నాయి. .అన్నీ చదివి ఇప్పుడు వినిపించే ఓపిక లేదు నాకు. బ్రీఫ్ గా సమాధానం చెప్తున్నా. ఎస్. ఇట్స్ వెరీ క్లియర్ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మీరు మాట్లాడుతున్న వెనకాల ఫోటో ఉంది కదా? నేను ఫోటో పెట్టుకోకపోయినా అంబేద్కర్ అంటే మీకన్నా ఎక్కువ గౌరవం మాకు ఉంది. అంబేద్కర్ అందరి వాడు.
అంబేద్కర్ గారిలా సూట్ వేసుకున్నంత మాత్రాన అందరూ అంబేద్కర్లు అయిపోరు. అంబేద్కర్ గారి భావాలు గౌరవిస్తారు. మీరు డ్రెస్సులు కూడా గౌరవిస్తారు ఫైన్. గుడ్. ఇప్పుడు చాలా స్పష్టంగా మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు. అని రాజ్యాంగంలో రాశారా ? మతం మారితే అనే ఉంది. ఓకే. మీ పారామీటర్స్ మీకు ఉండొచ్చు. . సో. ఒరిజినల్ సర్టిఫికేట్ క్రిస్టియన్ అని ఉంది. వారి తల్లిదండ్రులని కూడా ఆ మతం ప్రకారంగా పూడ్చి బెడుతూ, వారు చర్చి కూడా కడుతూ, డైలీ- ప్రతి వారం చర్చి ప్రార్థనలో పాల్గొంటూ, ఎస్సీ ఎస్టీ అట్రాస్టి కేసులు పెట్టేసుకుంటారా? అలా చర్చికి వెళ్ళేవాళ్ళు .. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడానికి వీలు లేదని చెప్పి ఇచ్చారు కదా జస్టిస్ జడ్జిమెంట్.
మీరేమో ఊరి కో ఫేక్ కేసులు పెట్టుకుంటే వెళ్ళిపోతారా? చూస్తూ ఊరుకోవాలా? పైగా నన్ను అంటారా? గిల్లితే గిల్లించుకోవాలా? కొడితే కొట్టించుకోవాలా? నన్ను అంటారా? అర్హత లేని వ్యక్తులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాస్ట్ కేసు పెడితే కొట్టించుకోవాలా? మేము మాట్లాడగలం. గట్టిగానే మాట్లాడగలం. సో. ఇలాంటి వితండవాదం వద్దు. మనం కలిసినప్పుడు చక్కగా ఇదివరకు ఎలా ఢిల్లీ వచ్చినప్పుడు కూడా మా ఇంట్లో మనం కలిసి భోజనం చేశాం.
నన్ను ఏదో మీరు నిలబెట్టేసారని చెప్పుకుంటున్నారు. ఫైన్. చెప్పుకుంటే తప్పులేదు. ఇప్పుడు మమ్మల్ని ముఖ ఉపముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసిన వ్యక్తి , గతంలో అంత దారుణంగా కొట్టిన వ్యక్తి నన్ను చంపాలని ప్రయత్నించిన వ్యక్తి అతను సర్వీస్ రూల్స్ వైలెట్ చేశాడని చెప్పి నేను అతని గురించి రాస్తే.. డిప్యూటీ స్పీకర్ గా ఎలా కంప్లైంట్ ఇస్తారని, ఏం. డిప్యూటీ స్పీకర్ కంప్లైంట్ ఇవ్వకూడదని రూల్ ఉందా? రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా? ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ ఏం చేయకూడదో రాసి ఉంది. అక్కడ ఎంపి స్పీకర్ అయితే నేను ఒక తప్పు చేస్తున్న వ్యక్తి గురించి కంప్లైంట్ ఇచ్చే హక్కు కూడా నాకు ఉండదా? నేను మాట్లాడినంత ధైర్యంగా భారతదేశంలో ఇప్పటిదాకా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నవాడు ఎవడు మాట్లాడతాడు? నేను ధైర్యంగా మాట్లాడాను. ఎందుకు? రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి.

