– పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ కృష్ణయ్య గురించి అవాకులు చవాకులు పేలిన జగన్ ఆయనకు కూడా క్షమాపణలు చెప్పాలి
– పరకామణి కేసులో లోక్ అదాలత్ లో రాజీ చేసిన న్యాయమూర్తిపై ఒత్తిడి తెచ్చిన జడ్జి ఎవరో దర్యాప్తు చేయమని సీఐడీ ఛీప్ ను నేను అడిగితే నీకేంటి బాధ జగన్?
– పరకామణి కేసులో టీటీడీ ఛైర్మన్లుగా నీ హయాంలో పనిచేసినా భూమన, వైవీ సుబ్బారెడ్డిలపై దర్యాప్తు జరుగుతుంటే మీకెందుకు కంగారు జగన్?
– జగన్ ప్రెస్ మీట్ అంతా ఆడ లేక మద్దిల ఓడు అన్నట్టుగా ఉంది
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శ
మంగళగిరి: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రెస్ మీట్ లో తనపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. తాను టెన్త్, ఇంటర్, డిగ్రీలో ఫస్ట్ వచ్చానని ప్రగల్భాలు పలికే జగన్ ఏ స్కూల్లో, కాలేజీలో చదివాడో మాత్రం ఎవరికీ చెప్పడం లేదని విమర్శించారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసిన తర్వాత ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 సీట్లకు పరిమితం కావడం ఆయన వైఫల్యానికి నిదర్శనమన్నారు.
తాను చదువుకోలేదని జగన్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ చదువుకోనివాడు మాత్రమే నా మాటలను అర్థం చేసుకోలేక అవగాహన లేకుండా మాట్లాడుతారు. చదువుకున్నవాడు అయితే నా మాటల్లో తప్పు లేదని ఒప్పుకుంటాడు. పరకామణి కేసులో ఎవరో జడ్జి =ఇన్వాల్వ్ అయ్యారు, జడ్జిగారిపై ఒత్తిడి తెచ్చిన జడ్జి ఎవరో విచారించమని సీఐడీ చీఫ్‌ను కోరితే తప్పేంటి? అని జగన్‌ను ప్రశ్నించారు.
ఇంత పెద్ద కేసును లోక్ అదాలత్‌లోకి తీసుకోవడమే ఆ జడ్జి గారు చేసిన తప్పు అని, ఆయన్ను ఇప్పటికే హైకోర్టు కోర్టు వ్యవహారాల నుంచి తప్పించిందని గుర్తు చేశారు. ఈ కేసును రాజీ చేసిన న్యాయమూర్తిపై ఒత్తిడి వచ్చిందని తిరుపతి ప్రజలు అంటున్నారు. దానిపై దర్యాప్తు చేయమన్నాను. ఇందులో చంద్రబాబు గారికి, నాకూ సంబంధం ఏముందన్నారు. జగన్ తన అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని పరకామణి కేసులో తప్పు లేకపోతే హైకోర్టు సీఐడీ విచారణకు ఎందుకు ఆదేశించిందని ప్రశ్నించారు.
మీ తండ్రి వయస్సున్న నన్ను ఏకవచనంతో ‘వర్ల రామయ్య’ అని మాట్లాడతావా? అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. “పెద్దల గురించి ఎలా మాట్లాడాలో మీ తల్లిదండ్రులు చెప్పలేదా? జగన్మోహన్ రెడ్డిని పెంచడంలో వారి తల్లిదండ్రులు పూర్తిగా విఫలమయ్యారు. తనను తప్పుగా మాట్లాడినందుకు ఏకవచనంతో సంబోధించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దొంగిలించిన డబ్బును స్వామివారికి తిరిగి ఇచ్చేయడం గొప్పకార్యం అని జగన్ అనడంపై మండిపడ్డారు. “రూ. 14.5 కోట్లు విలువైన దొంగతనం ద్వారా దక్కించుకున్న ఆస్తులు రవికుమార్ అనే దొంగ తిరిగి ఇస్తే అది గొప్పకార్యం అంటున్నావు. నీలాంటి వాడిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర ప్రజలు ఎంత తప్పు చేశారో అని ఆశ్చర్యమేసింది. అంటే పరకామణిలో డబ్బులు కొట్టేయొచ్చా? దొంగ ఆస్తులు మీ పార్టీ వాళ్లు కొట్టేసి స్వామివారికి గిఫ్ట్‌గా ఇప్పించారు. చంద్రబాబు గారు అలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నించారు.
పరకామణి చోరీ కేసు దర్యాప్తు వేగవంతం కావడంతో వైఎస్ఆర్సీపీ నాయకత్వం ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కలవరపడుతున్నారని ప్రశ్నించారు.ఈ కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్లు, వైసీపీ సీనియర్ నేతలైన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడీ విచారిస్తున్న నేపథ్యంలో జగన్ గారు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పరకామణి కేసు లోతుగా దర్యాప్తు జరిగితే తమ పార్టీ నాయకులకు ఇబ్బందులు తప్పవనే భయంతోనే జగన్ ఈ విధంగా కంగారు పడుతూ దర్యాప్తును రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దర్యాప్తు హైకోర్టు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేశారు.తిరుపతి కల్తీ లడ్డు కేసులో ఐఏఎస్ అధికారి కృష్ణయ్యపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
కల్తీ లడ్డు కేసు సుప్రీంకోర్టు వేసింది. గోపినాథ్ జెట్టిని చంద్రబాబు నాయుడు గానీ, కృష్ణయ్య గానీ నియమించలేదు, ఆయన కేవలం సిట్ లో ఒక సభ్యుడు మాత్రమే. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్‌గా ఐఏఎస్ అధికారి కృష్ణయ్య నియామకం చట్టబద్ధంగా, పారదర్శకంగా జరిగిందని దీనిపై వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం కృష్ణయ్యని అవమానించడమే అవుతుందని తీవ్రంగా ఖండించారు. బలహీన వర్గానికి చెందిన కృష్ణయ్యను కించపరచవద్దని అన్నారు. ఆయనకు పర్యావరణ అంశాలపై అపారమైన జ్ఞానం ఉందని తెలిపారు.
కృష్ణయ్య గురించి కూడా అవమానకరంగా మాట్లాడిన జగన్ ఆయనకు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు గంటల ఈ ప్రెస్ మీట్లో జగన్ గారు చెప్పినవన్నీ అబద్దాలు అని ఈ దర్యాప్తు ఇంతటితో ఆగిపోదని, రేపు కోర్టులో వాస్తవాలు బయటపడతాయని తేల్చిచెప్పారు