– పారిశ్రామిక భూముల్లో కాసుల వేట కోసమే హిల్ట్ పాలసీ
– హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట
– పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీసే కుట్రను బహిర్గతం చేసిన బీఆర్ఎస్ నాయకులు
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్: బహదూర్‌పూర్ చందూలాల్ బరదరి ఇండస్ట్రియల్ ఏరియాలో మాజీ మంత్రి మహమూద్ అలీ , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ , మాజీ ఎమ్మెల్సీ సలీమ్ , జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్డండా వెంకటేష్ , సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ , ముకేద్ చందా , యాకుత్పురం మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి సామా సుందర్ రెడ్డి , పుస్తే శ్రీకాంత్ , అజాం అలీ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని పరిశీలన పర్యటన నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ హిల్ట్ పాలసీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ హిల్ట్ పాలసీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్కాంను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
పారిశ్రామిక భూములను కాజేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారు. కోట్ల రూపాయలను దోచుకునేందుకు భూముల విలువను రాజకీయంగా వినియోగించుకునే ప్లాన్‌కి ఈ హిల్ట్ పాలసీ ఆధారం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం భూముల చుట్టూ తిరిగే పాలన మాత్రమే చేస్తోంది. ప్రజా సమస్యలు పక్కనపెట్టి భూముల దోపిడీకి ప్రాధాన్యం ఇచ్చింది. పారిశ్రామిక భూముల్లో కాసుల వేట కోసమే హిల్ట్ పాలసీని రూపొందించారు. ఇది పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడులకు, ఉపాధికి తీవ్ర ముప్పు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వెన్నుముకలాంటిదైన పారిశ్రామిక రంగాన్ని ప్రభుత్వం హిల్ట్ పాలసీ పేరిట చెలగాటం ఆడుతోంది. ప్రభుత్వం తక్షణమే హిల్ట్ పాలసీని ఉపసంహరించుకోవాలని, పారిశ్రామికవేత్తల భూములు, హక్కులు, భవిష్యత్తు రక్షణకు బీఆర్ఎస్ ప్రజలతో కలిసి పోరాటాన్ని కొనసాగిస్తుంద.” ని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.