రోజూ లాగే స్కూల్లోని ఈ క్లాసులో పిల్లలు చిరు అల్లరితో ఉత్సాహంగా వున్నారు. అక్కడ సిఎం, మినిస్టర్ వున్నారనే భయం అస్సలు లేదు. సిఎం స్వయంగా ఒక చిన్నారి విద్యార్థిని పక్కన కూర్చుని, ఆమెతో మమేకమవుతూ, ఒక టాబ్లెట్ ద్వారా డిజిటల్ లెర్నింగ్ మెటీరియల్‌ను చూపిస్తున్నారు. ఆ చిన్నారి శ్రద్ధగా సంఖ్యలను, అక్షరాలను గుర్తించి, స్పష్టంగా జవాబులు చెబుతోంది.
ఆ చిన్నారి ప్రతిభను చూసి ప్రోత్సహిస్తున్నారు. కానీ ఆప్ తీసుకుంటున్న సమయం చూసి, మంత్రిని ఉద్దేశించి బ్యాండ్ విడ్త్ కూడా చూసుకోవాలి మీరు అని సలహా ఇచ్చారు. కేవలం పీటీఎం స్కూల్లో చదివించే తల్లిదండ్రులకు, టీచర్స్‌కు మాత్రమే కాదు సంబంధిత మంత్రికి కూడా పరీక్షే. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఓపికగా.. సునితంగా పరిశీలిస్తూ తనయుడు లోకేశ్‌కి సలహాలు ఇచ్చారు.