– ఆందోల్ మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్
హైదరాబాద్: ఈశ్వర చారి మరణం తీవ్రంగా కలచివేసింది. మా ఆందోల్ నియోజకవర్గంలోని పుల్కల్ మండలం పోచారం గ్రామానికి చెందిన ఈశ్వర చారి బతుకుదెరువుకోసం హైదరాబాదు వలసవేళ్లారు. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించకపోవడం వల్ల అన్యాయం జరుగుతుందని భావించి నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. బి సి లకు ఆశ చూపెట్టి చివరకు మొండి చేయి చూపడం వల్లనే అసహనానికి లోనై బీసీ యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అర్థమవుతున్నది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాను. మృతుడు ఈశ్వర చారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పకుండా హైదరాబాద్ లోనే ఖననం చేసేందుకు ప్రయత్నిస్తు0డటం దుర్మార్గం. కుటుంబసభ్యుల కోరిక మేరకే స్వగ్రామం లో ఈశ్వరచారి అంత్యక్రియలు జరపాలని డిమాండ్ చేస్తున్నాను.