తానే మంచి టెక్కీ జాబ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నట్లుగా.. ఎలా తెలుసుకుంటాడో గానీ డిమాండ్ పసిగట్టేస్తాడు లోకేష్ !
రాబోయే కాలంలో ఏఐ బేస్ట్ అని అందరికీ తెలిసిందే.
శాన్ఫ్రాన్సిస్కోలో నారా లోకేష్ – ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మ కూనపునేని భేటీ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు టెక్ మ్యాప్‌లో కీలక మలుపు!
– స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లకు ఆధునిక ఐటీ మౌలిక సదుపాయాలు అవసరమని లోకేష్ స్పష్టం చేశారు.
– ఏఐ ఓప్స్ శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు, ఆర్ అండ్ డి సహకారం కోసం ఏపీ టెక్ అకాడెమీతో భాగస్వామ్యం కోరారు.
– స్కేలబుల్ సాఫ్ట్వేర్ ఆజ్ సర్వీస్ (SaaS) మోడల్స్ ద్వారా ఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు కొత్త అవకాశాలు తెరవాలని విజ్ఞప్తి చేశారు.
ఓప్స్ ర్యాంప్ స్పందన :
– ప్రపంచవ్యాప్తంగా 500+ సంస్థలు కస్టమర్లుగా ఉన్న ఓప్స్ ర్యాంప్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, రిటైల్, టెక్నాలజీ రంగాల్లో ఫార్చ్యూన్ 500 కంపెనీలకు సేవలు అందిస్తోంది.
– బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాల ద్వారా AI Ops, క్లౌడ్ నేటివ్ మానిటరింగ్‌లో ఆవిష్కరణలు ముందుకు తీసుకెళ్తున్నామని వర్మ వెల్లడించారు.
– ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మంగళగిరిలో తాను తెచ్చిన కొత్త మగ్గాలలో నేసిన శాలువా వేసి మరీ విజ్ఞప్తి చేశారు లోకేష్.
– చాకిరేవు