– ఇండిగో బలుపుని.. ఇండిగో సంస్థ తప్పిదాన్ని ఎందుకు మాట్లాడరు?
– ఒక్కడే ఎన్ని విమానాలు తిప్పాలి రా? చెప్పండి?
– గాల్లో విమానాలు తిప్పే పైలెట్ నిద్ర లేకుండా నడిపాలా?
ఎర్రన్న బిడ్డగా అని కాదు. మా రామ్మోహన్ నాయుడుని విమర్శించే అంత సబ్జెక్టు ఏపీలో ఒక్కడి కీ కూడా లేదు. రామ్మోహన్ నాయుడు ఏ తప్పు చేయలేదు. పాలసీ విధానపరమైన నిర్ణయాల ను అమలు చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులకు కారణం డీప్ గా వెళ్తే చాలా విషయాలు బయటపడతాయి.
రామ్మోహన్ నాయుడు ఏమైనా తప్పు చేశారా?
పాలసీ విధానాలు.. అవన్నీ మీకు అర్థం కావు. పెద్ద పెద్ద మాటలు మీకు అర్థమయ్యే భాషలో.. సింపుల్ గా ఒక లైన్లో చెప్తాను చదవండి.
ప్రైవేట్ వాళ్ళు పైలట్లను మీ భాషలో డ్రైవర్లు. డ్రైవర్లు తక్కువ మందిని పెట్టుకొని ఒక్కొ డ్రైవర్ చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారు..
అది భారత ప్రభుత్వం కాదు.. ఇండిగో సంస్థ.
అలా చేయటానికి లేదు. అలా చేస్తే విమాన ప్రమాదాలు జరుగుతాయి. ఒక్కో పైలట్ కి నిర్దిష్ట విశ్రాంతి అవసరం.
ఒక్కడే విమానాన్ని, బస్సు తిప్పినట్టు తిప్పకూడదు.
ఒక్కొక్క విమానానికి ఎక్కువ పైలెట్ లు ఉండాలి. ఎక్కువ సంఖ్యలో పైలెట్లు ఉండాలి. వాళ్ళకి తగినంత నిద్ర ఉండాలి. రెస్ట్ ఉండాలి అని, సంవత్సరం నుంచి చెబుతూనే ఉన్నారు.
మిగతా ఎయిర్ లైన్స్, మిగతా ప్రైవేట్ కంపెనీలుకి రాని సమస్య , ఇండిగో కే ఎందుకు వచ్చింది? ఇండిగో వాళ్ళు చేసిన తప్పు వలన రామ్మోహన్ నాయుడు నీ ట్రోల్ చేస్తున్నారు.
ఒరే… నిద్ర లేకుండా ఆర్టీసీ బస్సు నడిపితేనే, యాక్సిడెంట్లు అవుతున్న రోజులు రా ఇవి!
గాల్లో విమానాలు తిప్పే పైలెట్ నిద్ర లేకుండా నడిపాలా..? డ్రైవర్(పైలెట్)
ఒక్కడే ఎన్ని విమానాలు తిప్పాలి రా? చెప్పండి?
విమానంలో ప్రయాణం చేసే ప్రయాణికుల రక్షణ ముఖ్యం. అలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా.. అదనపు స్టాప్ ని రిక్రూట్ చేయకుండా, 2200 ఫ్లైట్లని అర్ధాంతరంగా ఆపేసిన ఇండిగో బలుపుని.. ఇండిగో సంస్థ తప్పిదాన్ని ఎందుకు మాట్లాడరు.?
ఆ విమానంలో మీ కుటుంబ సభ్యుల్ని- మిమ్మల్ని ఎక్కిస్తే.. విమానం ప్రమాదం జరిగితే.. విమాన ప్రమాదం కారణం, పైలట్ కు నిద్ర లేక అలసట కు లోనై అశ్రద్ధ అని అంటే.. అప్పుడు ఏం వాగుతారు?
– ఉదయ్