– ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు :మంత్రి సవిత
విజయవాడ: సత్యసాయి జిల్లాలో రహదారుల మరమ్మత్తులు బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. జిల్లాలోని , గ్రామీణ రహదారుల అభివృద్ధి, మరమ్మత్తులు మరియు విస్తరణ పనులకు మొత్తం జిల్లాకు రూ.107.94 కోట్లు మంజూరు చేయడం రాష్ట్ర అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం కు ఉన్న దృఢ సంకల్పం అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మెరుగైన రోడ్లను, రవాణా సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ నిధులతో గ్రామీణ రహదారుల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం, మరమ్మతులు పునర్నిర్మాణం, గ్రామీణ లింక్ రోడ్ల మెరుగుదలకు సంబంధించిన పనులు త్వరితగతిన ప్రారంభమవుతాయి” అని తెలిపారు.
ఈ నిధుల కేటాయింపుకు ప్రత్యేకంగా కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సవిత.. .అభివృద్ధి పనులు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా పారదర్శకతతో చేపడతామని పేర్కొన్నారు. ప్రతి గ్రామం, ప్రతి మండలం అభివృద్ధి చెందే వరకు కృషి చేస్తామని రహదారి సదుపాయాల మెరుగుదల ద్వారా జిల్లా నియోజకవర్గ ఆర్థిక, సామాజిక పురోగతికి మరింత ఊతం లభిస్తుంది” అని మంత్రి సవిత తెలిపారు.