– టెక్ ఆంధ్రాగా మన ఉత్తరాంధ్రా ఉద్వేగ జైత్యయాత్ర
మొదటి చిత్రంలో ప్రతి ఒక్కరి మొహంలో ఆనందం కనిపిస్తోంది. మన అందమైన ఆంధ్రా విశాఖపట్నంలోనే.. ఐటీ ఉద్యోగం అనే ఉద్వేగం. అదీ వరల్డ్ టాప్ 10 ఐటీ కంపెనీలలో ఒకటైన అమెరికా కంపెనీ కాగ్నిజెంట్‌లో ఉద్యోగిగా మన ఊర్లోనే అనే సంతోషం అది.
రెండవ చిత్రంలో.. ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్‌ను కలిసిన లోకేశ్. ఆ ఏముందిలే పేరును చూసి మన తెలుగు వారేమో కలిసి వుంటారులే అనుకుని వుంటారు మనలో చాలా మంది.
మూడో చిత్రంలో.. ఏడాది కాక ముందే.. వేదమంత్రోచ్ఛారణల మధ్య, జ్యోతి ప్రజ్వలన చేస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించి, కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను రిబ్బన్ కట్ చేసి లోకేశ్ ప్రారంభించారు. మధురవాడ హిల్ నెం-2లోని మహతి ఫిన్ టెక్ భవనంలో వెయ్యి మంది సీటింగ్ కేపాసిటీతో ఈ తాత్కాలిక క్యాంపస్ ను ఏర్పాటుచేశారు. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ మొదటి దశ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా ఫిన్ టెక్ భవనంలో కార్యకలాపాలను కొనసాగించనున్నారు.
ఒకే ఒక్క పెద్ద ఐటీ కంపెనీ అయినా వస్తుందా అనే ఆశలతో ఎదురుచూస్తున్నాం దశాబ్దం పైగా.. మొదలైంది వైజాగ్ టెక్ ప్రయాణం. గూగుల్ పెట్టుబడుల విలువతో ప్రపంచమే ఆశ్చర్యపోయింది. టెక్ ఆంధ్రాగా మన ఉత్తరాంధ్రా ఉద్వేగ జైత్యయాత్ర మొదలైంది.