– కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
– మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: ఉపాధి హామీ చట్టం పేరు మార్చి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఉరి తాడు పెడుతున్నారు. ఉపాధి హామీ చట్టంలో మీరు తెస్తున్న సంస్కరణలు గొప్పవి అయితే రాష్ట్ర ప్రభుత్వాలతో ఎందుకు చర్చించలేదు?
పార్లమెంట్ లో హడావిడిగా బిల్లులు ఎందుకు తెస్తున్నారు? తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే ఉపాధి హామీ కి కుంటిసాకులు చెప్తూ నిధుల్లో కోతలు విధిస్తున్నారు. గాంధీ పేరు మార్చి, గాంధీని అవమాన పరుస్తున్నారు.ఇప్పటికే మీకు గాడ్సే వారసులుగా పేరు ఉంది. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ఉపాధి కల్పించింది.
ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్ కాబట్టి దానిని చంపే కుట్ర జరుగుతుంది. ఒక చట్టాన్ని మార్పు చేర్పులు చేస్తున్నప్పుడు రాష్ట్రాలతో చర్చించాలి కదా? వారి అభిప్రాయాలు తీసుకోవాలి కదా? కాంగ్రెస్ పార్టీ నికిల్ దేయ్, అరుణ రాయ్ , హరగోపాల్, శాంతా సిన్హా లాంటి మేధావులతో చర్చించి ఉపాధి హామీ నీ తీసుకొచ్చింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ద్వారా ఉపాధి దొరుకుతుంది కానీ పట్టణ ప్రాంతాల్లో ఇబ్బంది అవుతుంది ఇక్కడ కూడా ఉపాధి హామీ తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా? ఇప్పుడు పట్టణ పేదరికం పోగొట్టడానికి ఉపాధి హామీ తెచ్చే బదులు ఉన్న ఉపాధి హామీ తొలగించే ప్రయతం చేస్తుంది. దాని స్ఫూర్తిని ,ఆత్మను చంపే కుట్ర చేస్తుంది.
రాష్ట్రాలకు న్యాయబద్ధంగా , చట్టబద్ధంగా రావాల్సిన నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం తన అవసరాల కోసం వాడుకుంటుంది. సెస్ ల పేరుతో దోచుకుంటుంది.. 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు మోయాలని రాష్ట్ర ప్రభుత్వ ల మీద భారం మోపుతోంది. ఇప్పటికే జీఎస్టీ సెంట్రలైజ్ మీద రాష్ట్రాలకు స్వేచ లేకుండా పోయింది.ఫెడరల్ స్ఫూర్తిని చంపే ప్రయత్నం చేస్తుంది.
దీనిని అడ్డుకుంటాం..పోరాటాలు చేస్తాం. తక్షణమే ఉపాధి హామీ బిల్లులు వెన్నక్కి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పేదల పొట్టలు గొట్టే ప్రయత్నం చేస్తుంది. పథకం పేరులో నుంచి గాంధీజీ పేరును తొలగించడం దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి గాంధీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లో సైతం మరింత విస్తరిస్తాం.