– వైసీపీ తప్పుడు ప్రచారాలకు ఇక కచ్చితమైన కౌంటర్ తప్పనిసరి
ఏపీ రాజకీయాల్లో తాజాగా చోటుచేసుకున్న పరిణామం. ఒక సాధారణ రాజకీయ వ్యాఖ్య కాదు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పాలనపై చేసిన ప్రశంసలు, వైసీపీపై చేసిన హెచ్చరికలు ఒక స్పష్టమైన రాజకీయ దిశను సూచిస్తున్నాయి.
ప్రధాని మాటల్లో రెండు విషయాలు చాలా స్పష్టంగా కనిపించాయి.
కూటమి పాలనపై పూర్తి విశ్వాసం
ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను ప్రధాని మోడీ బహిరంగంగా ప్రశంసించడం చిన్న విషయం కాదు. “పాలన అద్భుతంగా ఉంది, దేశవ్యాప్తంగా పెట్టుబడులు ఎక్కువగా ఏపీకే వెళ్తున్నాయి” అన్న వ్యాఖ్యలు.. ఏపీ దిశ మారిందని, కేంద్ర స్థాయిలో కూడా అది గుర్తించబడుతోందని స్పష్టంగా చెబుతున్నాయి.
కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని, చంద్రబాబు నాయుడుతో పని చేయడం మంచిదని బీజేపీ ఎంపీలకు సూచించడం ద్వారా కూటమి స్థిరత్వంపై ప్రధానికి ఉన్న నమ్మకం బహిరంగమైంది.
వైసీపీపై నేరుగా ఫైర్
ఇదే సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు మరింత గమనించాల్సినవి. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని, సోషల్ మీడియాలో మరింత బలంగా పనిచేయాలని బీజేపీ ఎంపీలకు ఆదేశించడం. ఆ పార్టీ చేస్తున్న ప్రచారం హద్దులు దాటిందనే సంకేతం. జగన్ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పడం. వైసీపీ పాలనపై కేంద్రానికి ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోంది.
ఇదంతా ఎందుకు కీలకం?
సాధారణంగా ప్రధాని ఈ స్థాయిలో ఒక రాష్ట్ర ప్రతిపక్షంపై వ్యాఖ్యలు చేయరు. అలాంటిది మోడీ జి స్థాయి నాయకుడు వైసీపీ పై ఫైర్ అయ్యాడంటే, ఆ పార్టీ చేసిన రాజకీయ, పరిపాలనా అరాచకాలు ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలు..
కూటమి ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా సాగుతున్నాయి. తమ పాలనలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వేళ వాటిని కవర్ చేయడానికి లేనిపోని ఆరోపణలు చేయడం తప్ప వైసీపీకి మరో దారి లేదు.
ప్రజల తీర్పు ఇప్పటికే వచ్చింది
గతంలో తప్పుడు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు అదే వ్యూహం పనిచేస్తుందని అనుకోవడం భ్రమ మాత్రమే. ఎందుకంటే — పెట్టుబడులు పారిపోయిన కాలాన్ని ప్రజలు చూశారు. పరిపాలన ఎలా క్షీణించిందో అనుభవించారు. రాష్ట్ర ప్రతిష్ట ఎలా దెబ్బతిందో తెలుసుకున్నారు.
కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక — పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీకి బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతోంది. సంక్షేమం అన్ని వర్గాలకు సమపాళ్లలో అందుతోంది. పాలనలో స్పష్టత కనిపిస్తోంది.
ఇక ముందు….?
ప్రధాని మోడీ స్వయంగా ఆదేశించిన నేపథ్యంలో — వైసీపీ తప్పుడు ప్రచారాలకు ఇక కచ్చితమైన కౌంటర్ తప్పనిసరి. నిజాలు ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మరింత పెరిగింది. ఇది మాటల యుద్ధం కాదు… ఇది నిజాలు – అబద్ధాల మధ్య యుద్ధం.
ఇక నుంచి వైసీపీకి రాజకీయంగా కష్టకాలం మొదలైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
– తీగల రవీంద్ర