– ఎప్పటికైనా హరీశ్ రావు గుండెల్లో ఉండేది కేసీఆరే
– హరీశ్ రావు చేతిలో ఉండేది గులాబీ జెండానే
– సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరింది. రోజురోజుకు పరిస్థితులు చేజారి పోతున్నాయనే సత్యం జీర్ణం కాక అవాకులు చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కిండు. త్వరలోనే తనకు పతనం తప్పదనే సంగతి అర్థమై ఆగమాగం అవుతున్నడు. త్వరలోనే తన కుర్చీ ఊడుతుందని, తన దోపిడీ ఆగిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డి ఇవాళ్టి ప్రెస్ మీట్ లో అడ్డగోలుగా వాగిండు.
నాకు, కేటీఆర్ కు మధ్య మిత్ర బేధం సృష్టించాలని, తద్వారా బీఆర్ఎస్ ను బలహీన పరచాలని ఒక చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నడు రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి… నీ చీప్ ట్రిక్కులకు, చిల్లర రాజకీయాలకు ఎవడు పడిపోడు. నీ కుట్రలు, కుత్సితాలు ఫలించవు గాక ఫలించవు. అనేక సార్లు చెప్పినా, మళ్లీ చెబుతున్నా.. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి.. ఎప్పటికైనా హరీశ్ రావు గుండెల్లో ఉండేది కేసీఆరే. హరీశ్ రావు చేతిలో ఉండేది గులాబీ జెండానే.
నీ దాష్టీకాలు, దుర్మార్గులకు వ్యతిరేకంగా నేనూ, కేటీఆర్ మరింత సమన్వయంగా, మరింత సమర్థవంతంగా రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతం. నీ అవినీతిని ఎండగడుతం. అసమర్థతను నిలదీస్తం. ఉద్యమ కాలం నుంచి నేటి దాకా తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న నిన్ను, నీ కాంగ్రెస్ ను గద్దె దించుతం. నా లక్ష్యమైనా, కేటీఆర్ లక్ష్యమైనా, లక్షలాది గులాబీ సైనికుల లక్ష్యమైనా ఇదే.
బీఆర్ఎస్ విజయపథంలో పురోగమించడం ఖాయం. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడం ఖాయం. నీ చిల్లర వేషాలు, చెత్త రాజకీయాలను చూసి ప్రజలు ఛీ కొడుతున్నరు. బుద్ధి తెచ్చుకో. మిగిలిన కొద్ది కాలమైనా సరిగ్గా వినియోగించుకో. కమీషన్లు, రియల్ ఎస్టేట్ దందాలే కాదు..ప్రజలకు అక్కరకు వచ్చే పనులు చేయి. లేకుంటే ఉద్యమ ద్రోహి గానే కాదూ, చేవలేని, చేతగాని ముఖ్యమంత్రిగా కూడా చరిత్రలో నిలిచిపోతవు.