– ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
– ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఢిల్లీ ఎయిమ్స్ లో ఫీజు రూ.1350
– లక్నో కేజీఎమ్ యూ లో ఏడాది ఫీజు రూ.24 వేలు
– పూణే డీ వై పాటిల్ విద్యా పీఠ్ లో రూ.26.50 లక్షలు
– తన నివేదికలో పొందుపరిచిన స్టాండింగ్ కమిటీ
– ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల ఫీజుల్లో భారీ తేడా
– ఈ అంశాలు టీడీపీ నేతలకు కనిపించడం లేదా?
– న్యూఢిల్లీ నుంచి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, స్టాండింగ్ కమిటీ రిపోర్టుపై వీడియో విడుదల చేసిన వైయస్సార్సీపీ ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి
న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద అధికార తెలుగుదేశం పార్టీ పిడివాదం చేస్తోందని వైయస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవైటీకరణ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని… వైయస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో వెల్లువెత్తిన ప్రజాభిప్రాయమే అందుకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ నుంచి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, స్టాండింగ్ కమిటీ రిపోర్టుపై వీడియో విడుదల చేసిన ఆయన… పేదవాడి ఇంటి వరకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలన్న సదుద్దేశంతోనే… జిల్లాకో ఆసుపత్రి, మెడికల్ కాలేజీ స్థాపించాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ 17 మెడికల్ కాలేజీలు స్థాపనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఢిల్లీ ఎయిమ్స్ లో ఏడాది ఫీజు రూ.1350 ఉండే, ప్రైవేటు కాలేజీల్లో రూ. 1.50 కోట్లు వరకు వసూలు చేస్తున్నారని స్టాండింగ్ కమిటీ నివేదికలో పొందుపరిచిన విషయం టీడీపీ నేతలకు కనిపించడం లేదా? అని నిలదీశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు.
వీటన్నింటినీ తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం తిరిగి మా పై దుష్ప్రచారం చేస్తుంది. ఢిల్లీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు అనుకూలంగా వైయస్సార్సీపీ స్టాండింగ్ కమిటీలో సంతకం పెట్టి.. గల్లీలో దాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నామని మాపై అసత్యాలు ప్రచారం చేస్తోంది. స్టాండింగ్ కమిటీ రిపోర్టులో ఏమేం చెప్పారో పూర్తిగా చూడలేదు. ప్రైవేటు కాలేజీల్లో పూర్తిస్థాయి ఫ్యాకల్టీని నియమించుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుందని.. చాలా ప్రైవేటు కాలేజీల్లో ఈ ఖర్చు తగ్గించుకోవడానికి సరైన ఫ్యాకల్టీని నియమించుకోవడం లేదు.
అదే విధంగా స్టూడెంట్స్ హాజరు తక్కువగా ఉంటే దాన్ని అడ్డం పెట్టుకుని అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. దాంతో పాటు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న న్యూఢిల్లీ ఎయిమ్స్ లో ఫీజు రూ.1350 అయితే, కేజీఎమ్యూ, లక్నో స్టేట్ ఇనిస్టిట్యూట్ లో అయితే అదే ఫీజు రూ.24వేలు వసూలు చేస్తుండగా… డీ వై పాటిల్ విద్యా పీఠ్ పూణేలో రూ.26.50 లక్షలు ఏడాదికి వసూలు చేస్తున్నట్టు ఇదే స్టాండింగ్ కమిటీ రిపోర్టులో పొందుపరుస్తే.. ఇవన్నీ ఎందుకు టీడీపీ నేతలకు కనిపించడం లేదు.
దీనిలో చాలా స్పష్టంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలలో ఫీజు తక్కువగానూ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో రూ.60 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకూ వసూలు చేస్తున్నట్టు స్టాండింగ్ కమిటీ రిపోర్టులో ఉంటే అది కనిపించడం లేదా? ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించమని ఏ స్టాండింగ్ కమిటీ చెప్పలేదు. 2020-24 వరకు పార్లమెంట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో నేను సభ్యుడిగా ఉన్నాను.
స్టాండింగ్ కమిటీ దృష్టికి రకరకాల అంశాలు వస్తాయి. వాటిపై కూలంకషంగా చర్చిస్తారు. కమిటీ సభ్యులు దేనికీ అనుకూలంగా రాయరు. కేవలం వారి అభిప్రాయాలను మాత్రమే వెల్లడిస్తారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా అప్పుడు కూడా నేను నా అభిప్రాయాన్ని వెల్లడించాను. ప్రైవేటీకరణ వల్ల విద్యార్ధుల కుటుంబాల పై ఆర్ధిక భారం పడుతుంది. పేదలు అంత ఖరీదైన ఆసుపత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య,ఆరోగ్యం ఉంటే బాగుంటుందని చెప్పాను.
స్టాండింగ్ కమిటీ కేవలం సలహాలు మాత్రమే ఇస్తుంది. ఈ కమిటీ కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే సమస్యకు పరిష్కారం అని ఎక్కడా చెప్పలేదు. స్టాండింగ్ కమిటీ తన నివేదికలో ప్రజల ఆరోగ్యం, విద్య ప్రభుత్వ బాధ్యత అని చెప్పింది. నాలెడ్జ్ షేరింగ్, స్కిల్ అప్ కోసం ప్రైవేట్ సేవలు వాడుకోవాలని చెప్పిందే తప్ప… ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేసి తద్వారా కొద్దిమందికి లబ్ధి చేకూర్చమని ఎక్కడా చెప్పలేదు. వైయస్సార్సీపీ తరపున ప్రైవేటీకరణను వ్యతిరేకంగా నేను స్వయంగా పార్లమెంటులో మాట్లాడాను.ప్రైవేటీకరణ లో భాగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మి.. మీ వాళ్లకు మేలు జరిగితే అందరికీ మేలు జరిగినట్టు కాదు.
ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తన శాఖమీద దృష్టి సారించి.. అనవసర విషయాలమీద మాటలు తగ్గిస్తే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం రాజమండ్రి, ఏలూరు, నంద్యాల మెడికల్ కాలేజీలకు అసిస్టెన్స్ ఇచ్చింది.. ఇవి కాకుండా మిగిలిన 14 మెడికల్ కాలేజీలకు కూడా కేంద్ర సాయం కోసం ప్రయత్నించకుండా.. మంత్రి రాజకీయ ప్రకటనలకు పరిమితం కావడం సరికాదని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.