– బీ ఆర్ ఎస్ నేత జి .దేవి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల ఫలితాల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే అభద్రత భవానికి లోనై మాట్లాడినట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. అన్ని పార్టీలు ఏకమైన బీఆర్ఎస్ పార్టీ అనేక చోట్ల విజయం సాధించింది.
బీఆర్ఎస్ గెలుపును మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా నిన్న రేవంత్ రెడ్డి మీడియా సమావేశం పెట్టుకున్నాడు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ అనేక చోట్ల విజయం సాధించింది. అక్కడక్కడ తక్కువ ఓట్లతో బీఆర్ఎస్ ఓడిపోయింది. అయిన నైతిక విజయం బీఆర్ఎస్ దే. కేటీఆర్, హరీష్ రావు శక్తి వంచన లేకుండా ప్రజల పక్షాన మాట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టులాంటిది. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనితక్కువ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం పైన 40 శాతం భారం మోపుతున్నారు. ఇంత జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటుంది. బిజెపి- కాంగ్రెస్ ఒక్కటే అని ప్రజలకు అర్థమైంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. మర్పల్లి లో ఒక్క ఓటు తేడాతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం
జరిగింది. బీఆర్ఎస్ గెలిచిన దగ్గర రీకౌంటింగ్ చేసి కాంగ్రెస్ గెలిచిందని చెప్పారు. మొహింకళాన్ గ్రామంలో బీఆర్ఎస్ గెలిస్తే, రీ కౌంటింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన దగ్గర దాడులకు పాల్పడుతున్నారు.
పిర్యాదులు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు. పోలీసులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యహరించొద్దు .