– అందుకోసం బీజేపీ నేతలు, చంద్రబాబు నాయుడు సహకరించాలి
-గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా యూనివర్సిటీ అని చెప్పి రూపాయి ఇవ్వకుండా మోసం చేసింది
– రేవంత్ రెడ్డి దేవుడి విషయంలోనూ మాట తప్పారు
– జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కొత్తగూడెం: ఐదు గ్రామాల సమస్య బీజేపీ నేతలతోనే పరిష్కారమవుతుంది. వాళ్లే వెంటాపడి చేయించాలి. చంద్రబాబు నాయుడి ని కూడా ఈ సమస్య పరిష్కరానికి కృషి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. భద్రాచలం ముంపుతో సంబంధం లేకుండా ఉన్న ఐదు గ్రామాలను ఏపీ లో కలిపారు. ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయాలని చంద్రబాబు నాయుడు ని కోరుతున్నా.
అశ్వారావు పెద్ద వాగు ప్రాజెక్ట్ కు ఇవ్వాళ వెళ్తాం. ఈ పెద్ద వాగు ద్వారా తెలంగాణలో 3 వేల ఎకరాలు, ఆంధ్రాలో 13 వేల ఎకరాలు సాగు అవుతోంది. కానీ రిపేర్ కు మాత్రం ఏపీ గవర్నమెంట్ పంతానికి పోయి ముందుకు రావటం లేదు. దీంతో తెలంగాణలోని రైతులు ఇబ్బంది పడుతున్నారు. కేవలం రూ. రెండు కోట్లతో సమస్య పరిష్కారమవుతుంది.
గిరిజనులు, ఆదివాసీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. వారిని మభ్య పెట్టి సీతక్క, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేశారో సీఎం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. గిరిజన కార్పొరేషన్ లో 30 ఏళ్లుగా రిక్రూట్ మెంట్లు లేవు. గుత్తి కోయ గూడెంలో 72 ఆదివాసీ కుటుంబాలను రోడ్డున పడేశారు. వాళ్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. లేదంటే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం.
ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలి. అందుకోసం బీజేపీ నేతలు, చంద్రబాబు నాయుడు సహకరించాలి. ఓసీ-2 మైన్ ను ప్రైవేట్ పరం చేసే కుట్రను అడ్డుకుంటాం. భద్రాద్రి రామాలయానికి రేవంత్ ఇస్తానన్న నిధులు వెంటనే విడుదల చేయాలి. ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేకంగా బీఈడీ కాలేజీ ఉంది. కానీ వాళ్ల కోసం ఒక్క ట్రైబల్ డీఎస్సీ కూడా వేయలేదు. గిరిజనులంటే ఈ ప్రభుత్వాలకు ఎంత నిర్లక్ష్యమో గుత్తి కోయ తాండా వాసులను చూస్తే తెలుస్తుంది.
సింగరేణి గనుల విస్తరణ కోసం గుత్తి కోయ తాండా మొత్తాన్ని తీసేశారు. దాదాపు 70 కుటుంబాలకు లక్ష రూపాయలు చేతిలో పెట్టి వాళ్లను పంపించేశారు. మణుగూరు థర్మల్ పవర్ స్టేషన్ కారణంగా భూమి కోల్పోయిన వారికి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? గుత్తి కోయ తాండా ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సిందే. లేదంటే హైదరాబాద్ లోనే ఉన్న రాష్ట్రపతి గారిని కలిసి వారి సమస్యను వివరిస్తాం. కొత్తగూడెంలో ఉన్న ఐటీడీఏ కు నిధులు రావటం లేదు. ముఖ్యమంత్రి మాట్లాడితే శ్వేత పత్రం అంటారు. గిరిజనుల అభివృద్దిపై శ్వేత పత్రం విడుదల చేయాలి.
భద్రాచలం చుట్టు ఉన్న ఐదు గ్రామాలను ఏపీ లో కలిపారు. అసలు ముంపుతో సంబంధం లేని గ్రామాలను ఏపీ లో కలపటం అన్యాయం. ఆ ఐదు గ్రామాల ప్రజలు ఏమి కావాలన్న భద్రాచలం వచ్చే పరిస్థితి ఉంది. కానీ వారికి భద్రాచలం ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు. కనీసం తక్షణ రిలీఫ్ గా ఆరోగ్యశ్రీ వర్తించేలా చేయాలి. రాముల వారి మన్యాలు కాపాడుకోవాలంటే పురుష్తోతమం పట్నం లో రిటైన్ వాల్ కట్టాల్సిందే. దీని కోసం బీజేపీ ఎంపీలు, పెద్ద నేతలు ప్రయత్నం చేయాలని కోరుతున్నా.
అయోధ్య కన్నా కూడా భద్రాచల రాముల వారి చరిత్రే గొప్పది. స్వయంగా రాముల వారే దర్శనం ఇచ్చిన భద్రాచలం టెంపుల్ ను అభివృద్ధి చేసే మనసు బీజేపీకి రావటం లేదు. భద్రాచలం టెంపుల్ కు రూ. 350 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఆరు గ్యారంటీలు, పెన్షన్లు ఇవ్వకుండా ఎలా మాట తప్పాడో…దేవుడి విషయంలోనూ అలాగే మాట తప్పారు. కొత్తగూడెం లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరిగింది. అందులో భాగంగా గతంలో ఉన్న మైన్స్ స్కూల్ నే ఎర్త్, సైన్స్ యూనివర్సిటీ చేస్తున్నామని చెప్పారు. కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. సిబ్బంది లేరు. కోర్సులు లేవు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే మైన్స్ స్కూల్ ను కాకతీయ ఇంజనీరింగ్ యూనివర్సిటీ అని చెప్పి రూపాయి ఇవ్వకుండా మోసం చేసింది. కిన్నెర స్టీల్ ఏరియాను ఇండస్ట్రీయల్ ఏరియా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రామిస్ చేశారు. కానీ చేయలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి తన ఫుట్ బాల్ సరదా కోసం కార్మికుల సొమ్ము పదికోట్లు ఖర్చు చేశారు.