ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను “”PPP”” (Public–Private Partnership)
మోడల్లో నడపాలన్న ప్రభుత్వ ఆలోచనపై, ఒక విశ్లేషణ
PPP మెడికల్ కాలేజీ మోడల్.
PPP అంటే
భూమి + అనుమతులు + కొంత మౌలిక వసతులు.. = “ప్రభుత్వం”
నిర్మాణం + నిర్వహణ + పెట్టుబడి = ప్రైవేట్ సంస్థ
లక్ష్యం:
తక్కువ సమయంలో ఎక్కువ మెడికల్ సీట్లు..
ప్రభుత్వంపై పూర్తి ఆర్థిక భారం లేకుండా అభివృద్ధి
100% పర్ఫెక్ట్ ఆలోచన.
జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరాలు ఏమిటి?
మెడికల్ విద్య ప్రైవేటీకరణ అవుతుంది..
పేద విద్యార్థులకు సీట్లు దూరమవుతాయి..
ఫీజులు పెరుగుతాయి..
ఇదంతా అయన ఈర్ష్య.. కడుపు మంట..
ప్రభుత్వం చెబుతున్నది మరియు నిజాలు:
పూర్తి ప్రభుత్వ కాలేజీలు నిర్మించడానికి ఏళ్ల తరబడి సమయం + వేల కోట్ల ఖర్చు
PPP వల్ల త్వరగా కాలేజీలు నిర్మించబడి, సీట్లు కూడా పెరుగుతాయి. ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది.
మరి సమస్య ఎక్కడ ఉంది?
అసలు PPP సమస్య కాదు. దాన్ని అమలు చేసే విధానం లో కూటమి ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కీలక విషయాలు
ఫీజుల పై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి ప్రభుత్వ కోటా సీట్లు శాతం ఎక్కువ ఉండాలి 20–25 ఏళ్ల తర్వాత కాలేజీ ప్రభుత్వానికి చెందాలి. చంద్రబాబు ఇవన్నీ స్పష్టంగా చేయబోతున్నారు అనుకుంటున్నాను.
నా అభిప్రాయం
PPP పూర్తిగా మంచిది. అమలు చేయడంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. జగన్ చేస్తున్న చెత్త “అలారం” పనికి రానిది. ఈర్ష్య తో కూడినది.
సరైన మార్గం:
PPP లో కూడా, కనీసం 50–60% ప్రభుత్వ కోటా సీట్లు బీద విద్యార్థులకు కేటాయించాలి.
ఫీజులపై కఠిన నియంత్రణ,
ఒప్పందాల పూర్తి పారదర్శకత..,
నిర్దిష్ట కాలం తర్వాత ప్రభుత్వానికి కాలేజీ రిటర్న్.
అప్పుడు ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుంది. పేద విద్యార్థులకు నష్టం ఉండదు
నా చివరి మాట..
ప్రజారోగ్యం & మెడికల్ విద్య, వంటి విషయాలలో రాజకీయాలు చేయకూడదు. జగన్ గారు ఎప్పుడు కళ్ళు తెరుచుకుంటారో..
విద్య & ఆరోగ్యం
“ప్రభుత్వం & ప్రతిపక్షం” కలిసి బాధ్యతగా నిర్ణయం తీసుకోవాల్సిన రంగం.
“”జై ఆంధ్రప్రదేశ్””
– రవీంద్ర
9849551248.