– సుప్రీంకోర్టు రూల్స్ అఫ్ ఎంగేజ్మెంట్స్ ని పూర్తిగా మార్చేశారు జస్టిస్ సూర్యకాంత్
– దశాబ్దాలుగా కోర్టు గది ప్రాధాన్యతలను నిశ్శబ్దంగా నిర్దేశించిన వీఐపీ సంస్కృతిపై ప్రత్యక్ష దాడి
– ఈ ఊపు కొనసాగితే, భారతదేశం ఒక కొత్త యుగం ప్రారంభాన్ని చూస్తోంది
( అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం)
నేషనల్ జ్యుడిషియల్ అప్పోయింట్మెంట్స్ కమిషన్ ( National Judicial Appointments Commission) కేసు విషయంలో పునర్విచారణ కోసం చేసిన అభ్యర్ధన ని పరిశీలించి విచారణ చేస్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచన ప్రాయంగా అంగీకరించారు!
సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నిర్ణయం ఉన్నత న్యాయ వ్యవస్థ లో పాతుకుపోయిన కొలిజియం సిస్టమ్ ని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నం కొంత వరకూ సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. 2015లో సుప్రీం కోర్టు ఎన్‌జెఏసి విషయంలో తాను ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ వేసిన రివ్యూ పిటిషన్ ని విచారించడానికి నిరాకరించింది!
ప్రస్తుత సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నోటిమాటగా అడిగినదానికి సమాధానం ఇస్తూ రివ్యూ పిటిషన్ ని విచారణ కి స్వీకరిస్తానని చెప్పారు కానీ సుప్రీం కోర్టులో ఎలాంటి రివ్యూ పిటిషన్ పెండింగ్ లో లేదు.
ఎన్‌జెఏసి విషయంలో 2015 లో సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ ఎన్‌జెఏసి ఏర్పాటు అనేది రాజ్యాంగ విరుద్ధం అన్నది. సుప్రీం తీర్పు మీద 2015 లో వేసిన రివ్యూ పిటిషన్ ని విచారణ కి స్వీకరించిన సుప్రీం కోర్టు 2018 లో రివ్యూ పిటిషన్ ని కొట్టివేసింది. అప్పటినుండి ఎన్‌జెఏసి ఏర్పాటు విషయంలో ప్రతిష్టంబన ఏర్పడింది!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సుప్రీం కోర్టులో గత 50 ఏళ్లుగా పాతుకుపోయిన దుష్ట సాంప్రదాయాలని పక్కన పెట్టేసారు!
సింపుల్ గా చెప్పాలంటే సుప్రీం కోర్టు రూల్స్ అఫ్ ఎంగేజ్మెంట్స్ ని పూర్తిగా మార్చేశారు జస్టిస్ సూర్యకాంత్!
1.సుప్రీం కోర్టులో VIP కల్చర్ ని తొలగించారు. వివరంగా చెప్పాలి అంటే సీనియర్ అడ్వకెట్లు అయిన కపిల్ సిబాల్, ప్రశాంత్ భూషణ్, అభిషేక్ మను సింగ్వి లాంటి VIP అడ్వకెట్లు నేరుగా కోర్టులోకి వచ్చి మా కేసు ముందు విచారించండి ( TAKE MY CASE FIRST) అంటూ డిమాండ్ చేసేవారు కానీ ఇప్పుడు అలా కుదరదు. వరుస క్రమంలో పిటిషన్ ని విచారణకి స్వీకరిస్తారు.
2. సీనియర్ అడ్వకేట్స్ అంటూ కోర్టులో సదరు న్యాయవాదిలకి ఇచ్చే స్పెషల్ ప్రివిలేజ్ ఇకముందు ఉండదు. నో షార్ట్ కట్స్.
3.అర్జెంట్ గా విచారించాలా? సుప్రీం కోర్టు మార్గదర్శకాలని అనుసరించి విచారణకి అనుమతి ఉంటుంది తప్పితే సీనియర్ అడ్వకెట్ అనో, పేరుగల ఆడ్వకెట్ అనో విచారణకి అనుమతి ఇవ్వరు. సీనియర్ అడ్వకెట్స్ కి సుప్రీం కోర్టులో ఉంటూవస్తున్న లోపాయికారి సంబంధాలని తెంచేశారు జస్టిస్ సూర్యకాంత్! ఎవరైనా సరే సుప్రీం కోర్ట్ ప్రొసీజర్స్ ని అనుసరించాల్సిందే తప్పితే నేరుగా బెంచ్ దగ్గరికి వచ్చి ఇది అర్జెంట్ అని పిటిషన్ ని ముందు పెట్టే సాంప్రదాయా న్ని తొలగించారు!
4. సీనియర్ అడ్వకెట్స్ కే కాదు, జూనియర్ అడ్వకెట్స్ కి కూడా ఖచ్చితమైన సూచనలు ఇచ్చారు జస్టిస్ సూర్యకాంత్ గారు. పిటిషన్ ని అర్జెంట్ గా విచారించాలా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది తప్పితే మీకు అత్యవసరం అనిపించినది కాదు అని. ఒకవేళ అర్జెంట్ అయితే అది ఎందుకు అర్జెంటో తెలియచేస్తూ వ్రాత పూర్వకంగా తెలియచేయాలి తప్పితే నోటి మాటగా చెప్తూ పిటిషన్ ని బెంచ్ మీదకి తేకూడదు!
*****
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయగానే జస్టిస్ సూర్యకాంత్ గారు రోహింగ్యా ల తరుపున వేసిన పిటిషన్ ని విచారిస్తూ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారని ప్రింట్ మీడియా వార్తలు వ్రాసినా అవి ఆసక్తికర వ్యాఖ్యలు కావు, నేరుగా సత్యా అసత్యాలని ఎండగట్టారు అని వ్రాస్తే బాగుండేది!
పోలీస్ కస్టడీ లో ఉన్న రోహింగ్యాల అదృశ్యం పై వేసిన పిటిషన్ ని జస్టిస్ సూర్యకాంత్ గారు విచారణ చేస్తున్న సందర్భంలో……
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు: రోహింగ్యా లని శరణార్థులుగా గుర్తిస్తూ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన G. O. ఎక్కడ ఉందో చూపించండి.
దేశ సరిహద్దులు దాటి వచ్చిన వారికి రెడ్ కార్పేట్ వేసి స్వాగతం పలకాలా?
అక్రమ చొరబాటు దారులకి ఉండడానికి వసతి, భోజనం, విద్య, ఆరోగ్య సౌకర్యం ఇవ్వాలా? ఇవే వసతులు మన దేశ పౌరులకి కూడా అవసరమే కదా?
మీ డిమాండ్స్ రాజ్యాంగ విరుద్ధం అంటూ అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారి మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు అని తేల్చి చెప్పారు!
సో.. ఇప్పటికే దేశ ప్రజలలో న్యాయ వ్యవస్థ పట్ల ఉన్న గూడుకట్టుకున్న అసంతృప్తిని కొంతైనా తొలగించే దిశగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రయత్నించడం హార్షణీ యం!
ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన మీద సాయంత్రం పిటిషన్ స్వీకరించి మరుసటి రోజున విచారించడం అనే దుస్ససంప్రదాయం ని తొలగించడం అనేది శుభపరిణామం!
ఇక గంటకి లక్షలలో ఫీజు వసూలు చేసే కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్, అభిషేక్ మను సింఘ్వీ లాంటి vip అడ్వకెట్స్ కి జస్టిస్ సూర్యకాంత్ చర్యలు నచ్చవు కాబట్టి, 2027 ఫిబ్రవరి 9 న జస్టిస్ సూర్యకాంత్ పదవీ విరమణ చేసేవరకూ ఓపికగా వేచిఉండాల్సిందే! శుభం!
ఎటూ సుప్రీం కోర్టులో ఉన్న జాడ్యాలని ప్రక్షాళన చేస్తున్న జస్టిస్ సూర్యకాంత్ గారికి ఒక మనవి…..
సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ.. మరో వైపు రాజ్యసభ కి ఎన్నిక అయిపోయి, రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడాన్ని నిషేదిస్తే దేశానికి మేలు చేసినవారవుతారు!
ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం చేస్తూ స్వంతంగా వ్యాపారాలు, స్వయం ఉపాధి లాంటివి చేయకూడదు అనే నిబంధన ఉన్నప్పుడు.. అదే నిబంధన రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి అనుమతి ఇవ్వడం సమానత్వం ఎలా అవుతుంది! ఇది సామాన్య ప్రభుత్వ ఉద్యోగికి, సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వ్యక్తుల మధ్య వివక్ష అవదా?
******
అది ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు కావు!
సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం!
ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టులో జితేంద్ర సహాని అనే వ్యక్తి ఒక పిటిషన్ ఫైల్ చేశాడు. దాని సారాంశం ఏమిటంటే… ఒక షెడ్యూల్ కాస్ట్ కి చెందిన తనకి SC కేటగిరి లో వర్తించే అన్ని అంశాలకి అర్హుడిని కాబట్టి తనకి SC కేటగిరి కింద వర్తించే అన్ని సౌకర్యాలు కల్పించమని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వమని కోరాడు.
జితేంద్ర సహాని మీద హిందూ దేవుళ్ళని దూషిస్తూ క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నాడని ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు పెట్టారు. తన మీద ఉత్తర ప్రదేశ్ పోలీసులు పెట్టిన కేసుని కొట్టివేయాలని, అలాగే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కింద ఇచ్చే అన్ని సదుపాయాలు తనకు కల్పించాలని తన పిటిషన్ లో కోరాడు.
జితేంద్ర సహాని మీద పోలీసులు పెట్టిన కేసులో క్రైస్తవ మత ప్రచారం చేస్తూ హిందూ మతంలో కొనసాగితే మీరు కుల వివక్ష ని ఎదుర్కుంటారని, అలాగే మీరు హిందూ మతం లో కొనసాగితే ఉద్యోగ, వ్యాపారాలలో ఎదగలేరని అంటూ అదే క్రైస్తవ మతం స్వీకరిస్తే ప్రభుత్వఉద్యోగం వస్తుందని, వ్యాపార అభివృద్ధి జరుగుతుందని, ఇతర సహాయాలు ( రైస్ బాగ్ లేదా గోధుమల బాగ్) క్రైస్తవ మిషనరీ లనుండి నెల నెలా అందుతాయని ప్రచారం చేస్తున్నట్లుగా నిరూపించే వీడియో సాక్ష్యాలు సేకరించిన తరువాతే పోలీసులు కేసు నమోదు చేశారు!
జితేంద్ర సహానీ అలహాబాద్ హై కోర్టులో తన మీద పెట్టిన కేసులని కొట్టివేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్ కి జతగా ఇచ్చిన ఆఫడవిట్ లో హిందూ SC అని పేర్కొన్నాడు.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ గిరి గారు స్పందిస్తూ: జితేంద్ర సహాని తో మీరు ఆఫడవిట్ లో హిందూ SC అని పేర్కొన్నారు కానీ మీరు క్రైస్తవ మతం లోకి మారిపోయి ఒక క్రైస్తవ పాస్టర్ గా ఉంటూ క్రైస్తవ మత ప్రచారం చేస్తూ ‘హిందూ SC కింద వర్తించే అన్ని సౌకర్యాలు ఎలా పొందుతున్నారు? మీ పిటిషన్ ని కొట్టివేస్తున్నాను. మీరు క్రైస్తవం స్వీకరించి హిందూ SC కేటగిరి కింద లభించే సౌకర్యాలని ఎలా అడగగలరు?
క్రైస్తవంలో కులాలు లేవు కదా?
‘ Fraud on Constitution’ అనే పదం వాడారు జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు.
జితేంద్ర సహానీ కేసులో తీర్పు ఇస్తూ అలహాబాద్ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ గిరి గారు ఈ క్రింది ఆదేశాలని జారీ చేశారు.
జస్టిస్ ప్రవీణ్ కుమార్ గిరి గారు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రెటరీకి, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శికి మరియు ఉత్తర ప్రదేశ్ మైనారిటీ, SC, ST వెల్ ఫెర్ కార్యదర్శికి ఆదేశాలు ఇస్తూ 2024 లో సుప్రీం కోర్టు SC, ST, మైనారిటీ ల విషయంలో ఇచ్చిన ఆదేశాలని తప్పక పాటించాలని, మతం మారిపోయిన వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరెవరు SC, ST, మైనారిటీ లకి ఇచ్చే సౌకర్యాలని అనుభవిస్తున్నారో 4 నెలల లోపు తమకి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
జస్టిస్ ప్రవీణ్ కుమార్ గిరి గారు 4 నెలల డెడ్ లైన్ పెట్టారు!
అలహాబాద్ హై కోర్ట్ ఆదేశాల మేరకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర ప్రదేశ్ లోని అన్ని జిల్లా కలెక్టర్స్ కి 4 నెలల లోపు కోర్టు ఆదేశాలని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు!
జరిగింది ఇది అయితే ఈ సంఘటన ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ గారికి ముడి పెడుతూ సోషల్ మీడియా లో ప్రచారం చేయడం ప్రమాదకరం!
ముఖ్యంగా నాలుగు లైన్ల తో పోస్ట్ పెట్టే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే యోగి ఆదిత్య నాథ్ గారు విలన్ అయిపోతారు! కోర్టు ఆదేశాలని అదీ ఒక ప్రైవేట్ పిటిషన్ వేసిన వ్యక్తి క్రైస్తవుడు కేసు విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుని అమలుచేయమని ఆదేశాలు ఇచ్చారు ప్రధాన కార్యదర్శులు.
ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు, కేంద్ర సోషల్ వెల్ ఫె్ర్ కార్యదర్శికి కూడా ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఎవరెవరు మతం మారి పోయి SC, ST, మైనారిటీ ప్రయోజనాలని పొందుతున్నారో వాళ్ళ వివరాలని కూడా కేంద్ర ప్రభ్యత్వం అలహాబాద్ హై కోర్టుకి నాలుగు నెలల లోపు ఇవ్వాల్సి ఉంటుంది!
ఈ నాలుగు లైన్ల సోషల్ మీడియా పోస్ట్‌లు చాలా ప్రమాదకరం ఇలాంటి విషయాలలో!
సుప్రీంకోర్టులో ఎన్నో ఏళ్లుగా ఎన్నడూ చూడని బలమైన మార్పులలో ఒకటి – దశాబ్దాలుగా కోర్టు గది ప్రాధాన్యతలను నిశ్శబ్దంగా నిర్దేశించిన వీఐపీ సంస్కృతిపై ప్రత్యక్ష దాడి – సీజేఐ సూర్యకాంత్ చేశారు.
చాలా మంది సీనియర్ న్యాయవాదులను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ చర్యలో, ఎంత ప్రభావవంతమైన లేదా మంచి సంబంధాలు ఉన్న న్యాయవాది అయినా, క్యూలో ఎగరడానికి అనుమతించబోమని ఆయన ప్రకటించారు.
ప్రతి అత్యవసర విషయం ఇప్పుడు లిఖితపూర్వక అభ్యర్థన ద్వారా రావాలి. ఇకపై గుసగుసల ప్రస్తావనలు ఉండవు, బ్యాక్‌డోర్ యాక్సెస్ ఉండదు, సంప్రదాయం వలె మారువేషంలో ఉండే అర్హత ఉండదు.
జూనియర్ న్యాయవాదులకు స్పష్టమైన సందేశం కూడా అందింది: మౌఖిక ప్రస్తావనలు డిఫాల్ట్ హక్కు కాదు. నిజంగా అసాధారణ పరిస్థితులు మాత్రమే కోర్టు తక్షణ దృష్టికి అర్హమైనవి. క్రమశిక్షణ, న్యాయబద్ధత మరియు పారదర్శకత ఇప్పుడు సోపానక్రమం మరియు బెంచ్‌తో పరిచయాన్ని అధిగమిస్తాయి.
ఆపై అతిపెద్ద కుదుపు వచ్చింది – సీజేఐ సూర్యకాంత్ NJACని పునఃసమీక్షించడానికి తలుపులు తెరిచారు. న్యాయ నియామకాలపై చాలా కాలంగా నిద్రాణంగా ఉన్న జాతీయ చర్చను తిరిగి తీసుకువచ్చారు. కొలీజియం వ్యవస్థ భవిష్యత్తును ప్రశ్నించడం న్యాయవ్యవస్థ రాజ్యాంగ నాడిని తాకడం తప్ప మరేమీ కాదు.
ఇవి సౌందర్య మార్పులు కాదు. ఇది ఒక నిర్మాణాత్మక పునఃనిర్మాణం – సుప్రీంకోర్టు లోపల అధికారం ఎలా ప్రవహిస్తుంది, న్యాయవాదులు దానితో ఎలా పాల్గొంటారు మరియు న్యాయం ఎలా నిర్వహించబడుతుందో పునర్నిర్వచించడం. పాత అధికారాలను తొలగించడం, విధానపరమైన స్పష్టతను అమలు చేయడం మరియు లోతైన సంస్కరణలకు సంసిద్ధతను సూచించడం ద్వారా, CJI సూర్యకాంత్ పరివర్తన చెందిన న్యాయవ్యవస్థకు వేదికను ఏర్పాటు చేశారు.
ఈ ఊపు కొనసాగితే, భారతదేశం ఒక కొత్త యుగం ప్రారంభాన్ని చూస్తోంది – న్యాయ వ్యవస్థ మరింత జవాబుదారీగా, సమానంగా మరియు ప్రజల విశ్వాసానికి అర్హమైనదిగా మారుతుంది.
జైహింద్!