కరణ్ థాపర్ భారతదేశంలోని ప్రఖ్యాత డూన్ స్కూల్ లో ప్రాథమిక విద్య, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. జర్నలిజంలో కరణ్ థాపర్ దశాబ్దాల అనుభవం కలిగిన వ్యక్తి. BBC వరల్డ్ సర్వీస్, స్టార్ న్యూస్,CNN-IBN వంటి అంతర్జాతీయ, జాతీయ మీడియా సంస్థల్లో కీలక పాత్రలు నిర్వహించారు.
ప్రత్యేకంగా “Devil’s Advocate” అనే ఇంటర్వ్యూ కార్యక్రమం ద్వారా రాజకీయ నాయకులు, పాలక వర్గాలను నేరుగా ప్రశ్నించే జర్నలిస్టుగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
కరణ్ థాపర్ భారత జర్నలిజంలో కేవలం ఒక సీనియర్ జర్నలిస్ట్ మాత్రమే కాదు; ప్రజాస్వామ్యానికి కాపలాదారుడిగా నిలిచిన వ్యక్తిత్వం. అధికారానికి భయపడని ధైర్యం, ప్రశ్నించడంలో వెనుకడుగు వేయని నిబద్ధత ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
రాజకీయ నాయకులు ఎంత శక్తివంతులైనా, పదవులు ఎంత ఉన్నతమైనవైనా , ప్రజల తరఫున ప్రశ్నలు వేయడం కరణ్ థాపర్ గారి జర్నలిజం లక్షణం. ఆయన ఇంటర్వ్యూలలో కనిపించే స్పష్టత, లోతు, తార్కికత భారతీయ టెలివిజన్ జర్నలిజానికి కొత్త ప్రమాణాలను ప్రశ్నించడం అనేది శత్రుత్వం కాదని, అది ప్రజాస్వామ్యానికి ప్రాణమని తన జర్నలిజం ద్వారా నిరూపిస్తున్నారు. అనేక సందర్భాల్లో అధికార వర్గాలకు అసౌకర్యం కలిగించినా, సత్యం నుంచి మాత్రం కరణ్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు.
ప్రస్తుత కాలంలో చాలా మంది జర్నలిస్టులు అధికారానికి దగ్గరగా ఉండడానికే ప్రాధాన్యం ఇస్తున్న సమయంలో, కరణ్ థాపర్ నిష్పక్షపాతత్వం, స్వతంత్ర భావజాలంకు నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తారు. మీడియా మీద ఒత్తిళ్లు పెరిగిన వేళ, ఆయన స్వరం మరింత బలంగా మారుతుంది. అంతేకాదు, యువ జర్నలిస్టులకు ఆయన ఒక ప్రేరణ.
“ప్రశ్నించండి, కానీ నిజాయితీతో” అన్న సందేశాన్ని తన జీవితాంతం ఆచరిస్తూ చూపిస్తున్న ఒక అసాధారణ వ్యక్తి కరణ్ థాపర్. కరణ్ థాపర్ కేవలం ఒక జర్నలిస్ట్ కాదు ప్రజాస్వామ్య విలువల ప్రతినిధి, సత్యానికి నిలువెత్తు స్వరం, భారతీయ మీడియా చరిత్రలో కరణ్ థాపర్ ఒక సరికొత్త అధ్యాయం.