( అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం)
అక్రమ వలసలు..భారతదేశంలో అనదికార వలస దారుల సంఖ్య ప్రభుత్వ మరియు మీడియా అంచనాల ప్రకారం రెండు కోట్ల వరకూ ఉన్నారు . భారత దేశంలో సుమారు 40000 నుండి 75000 వరకూ రోహింగ్యా ముస్లింలు వున్నారు.వీరిలో 22 వేలమంది శరణార్థులుగా నమోదు చేసుకున్న వారు.
ఇతరులు:బర్మాలోని చిన్ ప్రాంతం నుండి 50,000-100,000మంది, అలాగే ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ నుండి కూడా కొంతమంది అనధికార వలసదారులు ఉన్నారు. భారత ప్రభుత్వం వీరిని ‘చట్టవిరుద్ద వలసదారులుగా ‘పరిగణిస్తోంది. అక్రమ వలసదారుల సంఖ్య ను లెక్కించడానికి సరియైన అధికారిక యంత్రాంగం లేదు.
కానీ అక్రమ వలసదారుల సంఖ్య ఇంకా ఎక్కువ గానే వుంటుంది. ఇంతమంది అక్రమంగా ప్రభుత్వ పథకాలు,రేషన్ అనుభ విస్తుంటే-మన సెక్యులర్ బ్యాచ్ మాత్రం *డాలర్ రేట్ పెరిగిందని, *ఇండిగో ఫ్లైట్ లు ఆగిపోతే దేశం ఏమైపోతుంది అని గుండెలు బాదేసుకుంటున్నారు.
ఓట్ చోరీ చర్చ:పార్లమెంటి లో చర్చ కి పట్టుబట్టి సాధించిన పిదప ముందు రాగా బాబా చర్చ మొదలెట్టు పాత పల్లవి నే పాడాడు. అమిత్ షా చర్చ మొదలెడుతూ పటేల్ నెహ్రూ కాలం సంగతి నుంచి మొదలెట్టాడు. ప్రధానిపదవి ఎవరు చేపట్టాలి అని ఎన్నిక జరిగితే పటేల్ గారికి 28ఓట్లు
వచ్చాయి. నెహ్రూగారికి రెండంటే రెండు ఓట్లు వచ్చాయి.సహజంగా మెజార్టీ ఉన్న వాళ్ళు ప్రధాని అవుతారు.కానీ రెండు ఓట్లు వచ్చిన నెహ్రూ ప్రధాని
ఎలా అయ్యాడు.
దీనిని ఓట్చోరీ అనరేమో:
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న ప్పుడు ఆమె లోకసభ ఎన్నిక చెల్లదని లోక్ సభ సభ్యత్వ రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇస్తే, చట్టవ్యతిరేకంగా రక్షణ కల్పించుకున్నారు. ఇది కూడా రెండవ ఓట్ చోరీ కాదు.
సోనియా గాంధీ ఈ దేశపౌరురాలు కాకుండానే ఓటుహక్కు తెచ్చుకుని ఓటు వేశారు. ఇదెలా సాధ్యం.ఇది కూడా మూడవ ఓట్ చోరీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి.పత్రికా సమావేశంలో విలేకరులు ఈ ఓటమికి మీ నాయకత్వ లోపమే కారణమా?అని అడిగితే ఆ నాయకులకు కోపం వచ్చి,ఆ విలేఖరులను బీజేపీ ఏజంట్లు అని ముద్ర వేస్తున్నారు.
అసలు మీడీయానే వీళ్ళనీ శతవిధాల లేపడానికి ప్రయత్నిస్తోంది. పాపం ఉల్టా వాళ్ళకు చీవాట్లు. కేసుల్లో విపక్ష పార్టీలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే, తీర్పు ఇచ్చిన జడ్జీలనే తిడుతున్నారు.
90 నిమిషాలు కాంగ్రెస్ పార్టీ స్కామ్స్ గురించి మొత్తం సభలో చెప్పేసరికి రాగాబాబా, ఆయన గారి అనుయాయులు సభ నుంచి పారిపోయారు.
సంఘటనలు-చేదు నిజాలు.
కొన్ని సందర్భాలు మనసును నొప్పిస్తాయి. కొన్ని నిజాలు మన గుండెను భారంగా చేస్తాయి. దేశం పండుగ చేసుకునే రోజులు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం కోసం ప్రాణాలు అర్పించిన యోధుల జ్ఞాపకాలు ,దేశ రాజ్యాంగాన్ని కాపాడే సంస్థలు దేశ గౌరవాన్ని ప్రపంచం మందుంచే అంతర్జాతీయ వేదికలు. అలాంటి పవిత్రమైన సంధర్బాలలో ప్రతిపక్ష నాయకుడు హాజరు కాలేదు.
ఓటు వేసిన ప్రజలకు ప్రజాస్వామ్యనికి జాతీయ గౌరవానికి అది నిరాశ కలిగించే విషయం కాదా? రామమందిర ప్రణప్రతిష్ట లో పాల్గొన్న లేదు. సాక్షాత్తు ఆయన పార్టీలో 40ఏళ్ళు పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ కీ భారత రత్న ఇచ్చిన కార్యక్రమానికి హాజరు కాకపోవడం.
కొత్త పార్లమెంట్ ప్రారంభానికి గైర్ హాజర్. ;భారత సమాచర కమీషనర్, ఉపరాష్ట్రపతి,సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ల ప్రమాణ స్వీకారాలకు దూరంగా ఉండటం. ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో.. దేశం కోసం ఉన్న బాధ్యత భావం అక్కడ కనిపించలేదు. అది రాజకీయ వ్యూహం కాదు- దేశం గుండెను తాకే ప్రశ్న.
ప్రపంచ రాజకీయాలు పిల్లల ఆటలు కావు. దేశాలు ఒకరిని ఒకరు పరీక్షించుకునే స్థలం. ఎవరు ఆతుథ్యం ఇచ్చినా -అతిథులు ఎవరు ఎవరిని కలుస్తారు అనే గెస్ట్ లిస్ట్ అతిధి (పుతిన్ )టీమ్ ఎప్రూవ్ చేయాలి.
చైనా అద్యక్షుడు అతిధిగా వస్తే దలైలామా పేరు పెట్టి కలిపిస్తా అంటే దలైలామాను కలుస్తాడా? అస్సలు కలవడు. అది basic international protocol.
పుతిన్ ప్రతి అడుగు జాగ్రత్త గా వేస్తాడు. అతను ఒకప్పుడు తన దేశ ఇంటిలిజెన్స్/ఆర్మీలో ఏజెంట్.ప్రతి వ్యక్తి గురించి సమాచారం. Past statements,reliability- అన్నీ చదివి నిర్ణయిస్తాడు. అలాంటి సమయంలో భారత్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో neutral stand తీసుకుని
Mediation చేస్తున్నప్పుడు, అదే భారత నాయకుడు అమెరికా వెళ్ళి పుతిన్ ను “ఆక్రమణ దారుడు- హంతకుడు “అన్నాడు.
అతను ఎవరిని ఎక్కడ కలుస్తున్నాడో తెలియని అమాయక దేశ మా రష్యా?వారి ఇంటీలిజెన్స్ మన కంటే ఎక్కువగా తెలుసుకుంటుంది
అందుకే కొన్ని meetings lists లో ఈయన లేరు. అందులో ఆశ్చర్యం లేదు.
ఫ్రాన్స్ అద్యక్షుడి తో మాట్లాడి బయటకు వచ్చి లోపల చెప్పని మాటలను బయట ప్రెస్ కుచెప్పడం.తరువాత ఫ్రాన్స్ అధ్యక్షుడి ఆఫీస్ ‘అలాంటి విషయం మా చర్చల్లో లేదు’ అని స్పష్టీకరణ ఇవ్వాల్సిన అగత్యం రావడం..మన దేశ గౌరవం ఎంత దెబ్బ తిందో ఊహించగలమా?
దేశ ప్రతిష్ట-ఎవరి స్వంతం కాదు. మన అందరి హృదయాల్లో ఉన్న జాతీయ గౌరవం.-ఇప్పుడు బాధను పెంచేది ఏంటంటే విదేశీ వ్యవహారాలపై అనుభవం, అవగహన ఉన్న శశిథరూర్ లాంటి వ్యక్తులపై ఇప్పుడు అవసరం లేని విమర్శలు.
ఆయన రాష్ట్రపతి భవన్ ముందు మాట్లాడిన పద్దతి-అది భారతీయ సంస్కృతి, దౌత్యము, అది దేశ గౌరవం. -ఈ దేశం మనందరిది. పార్టీలు మారవచ్చు.కానీ దేశ గౌరవం, జాతీయ గౌరవం, అంతర్జాతీయ ప్రతిష్ట-అవి పవిత్రం,అవి అజేయం, అవి మన హృదయం.
– జైహింద్