– బీఆర్ఎస్ ఉన్నపుడు క్రాప్ హాలీడే పెట్టకుండా నీళ్ళు ఎట్లా ఇచ్చినం?
– రెండేళ్ల నుండి ప్రాజెక్టు పనులు పడావు పెట్టారు
– జూరాల మీద పాలమూరు రంగారెడ్డి పెట్టాలన్న ఆలోచన మూర్ఖమైనది
– కొడంగల్ కి పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొని పోతాం అంటే ఊరుకునేది లేదు.
– కాంగ్రెస్ మంత్రుల బుద్ధి లేని మాటలు
– మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజం
– వనపర్తి జిల్లా ఆత్మకూరు లో జూరాల ప్రాజెక్ట్ యాసంగి నీటి విడుదల అంశం పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి ల ప్రెస్ మీట్
ఆత్మకూరు: కృష్ణ నది ప్రవహించేదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. సరైన సమయంలో ప్రాజెక్ట్ లు కట్టకపోవడం వల్లే పాలమూరు జిల్లా కు ఈ దుస్థితి. నిజాం కాలంలో ఉన్నటువంటి ప్రాజెక్టు లను ఉమ్మడి ఏపీ లో రద్దు చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా జూరాల కు నీటి కేటాయింపు జరిగింది.
ఆరున్నర టీఎంసి లు మాత్రమే జూరాలలో ఉంటాయి. లక్ష పదివేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ముప్పై మూడు ఏళ్ళు పట్టింది. పూర్తిస్థాయి నీళ్లు నింపకుండా గేట్ లు తెరిచి పెట్టేవాళ్ళు. కర్ణాటక రాష్ట్రంలో పరిహారం ఇవ్వకుండా నాలుగేళ్లు ఆపారు. తొమ్మిది టీ ఏం సి లు వాడుకోలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉంది. యాసంగికి క్రాప్ హాలీడే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూరాల కింద సొంత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.
ఇంత భారీ వర్షాలు కురిసిన సాగునీళ్లు వాడుకోవడం లో అవగాహన లేదు. కాంగ్రెస్ మంత్రుల బుద్ధి లేని మాటలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు రోజుకి అవసరమైన నీళ్ళు రెండు టీ ఏం సి లు. జూరాలను భారీ ఎత్తిపోతల కు రిసోర్స్ గా వాడలేము. ఇది చాలాసార్లు చెప్పినం. అయినా అర్థం కావట్లేదు. శ్రీశైలం లో అట్టడుగున నీళ్ళు వాడుకునే విధంగా ఏపీ ప్రాజెక్టు లు నిర్మాణం చేపట్టింది. మనం అక్కడి నుండి నీళ్ళు తీసుకుంటాం అంటే వద్దు అంటారు.
పాలమూరు ప్రాజెక్టు కోసం 27,100 ఎకరాలు భూసేకరణ చేశాం. రెండేళ్ల నుండి ప్రాజెక్టు పనులు పడావు పెట్టారు.145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంప్ లను ఏర్పాటు చేశాం.కొడంగల్ నారాయణ పేట కు పాలమూరు రంగారెడ్డి నుండే నీళ్లు పోతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు కి నీళ్లు పోతాయి. అంతకంటే ఎక్కువ ఖర్చుతో కొడంగల్ నారాయణ పేట కు నీళ్ళు తీసుకెళ్తా అంటాడు. బీఆర్ఎస్ ఉన్నపుడు క్రాప్ హాలీడే పెట్టకుండా నీళ్ళు ఎట్లా ఇచ్చినం?
కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందిగా…నీళ్ళు అడగొచ్చు కదా? రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పాలనకు హాలీడే తీసుకోండి. మీది పనికిమాలిన పాలన. షాప్ లో ఇవ్వడానికి చేతకాదు.. కానీ యాప్ లో యూరియా ఇస్తాడట. నది పై ప్రాంతాలు ఎండిపోయిన….కింద ప్రాంతాలు బాగుండాలని చెప్పిన ఆంధ్రా పాలకులు…అదే నిజం అన్నట్లు పాలించిన మహా పురుషులు ఆంధ్రా పాలకులు. కల్వకుర్తి పంపులు రెండు వందల ఇరవై రోజులు నడిచాయి. జూరాల మీద పాలమూరు రంగారెడ్డి పెట్టాలన్న ఆలోచన మూర్ఖమైనది.
ఎవరన్న అది మాట్లాడితే బుద్ధి లేని మాటలు. ఆధారరహితంగా,పూర్తి భిన్నంగా మాట్లాడిన వారిని ఏమనాలి? ఏపీ కి 512 టి ఎం సి ,తెలంగాణ కు 299 టీ ఏం సి తాత్కాలిక ఏర్పాటు. ఏడాది కాలం కోసం ఇచ్చిన వెసులుబాటు.ఇవి ఉనికిలో ఉన్నాయి. ఎవరు ఒప్పుకున్నది కాదు. ఆదిత్యనాథ్ దాస్ ఏపీ నుండి నీటి వాటా పై సంతకం చేశారు. ఎస్ కే జోషి తెలంగాణ నుండి సంతకం చేశారు. కేసీఆర్ మరణ శాసనం చేశారని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ కి సలహాదారుగా పెట్టుకున్న అధిత్యనాథ్ దాస్ పెట్టిన సంతకం. ఆయనను అడగండి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పించండి. ఎందుకు సంతకం చేశారో ఆయన్ను అడిగితే చెప్తాడు.
రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు…ఇరిగేషన్ మంత్రికి సబ్జెక్ట్ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస అవగాహన లేదు. మంత్రులు హెలికాప్టర్ వేసుకొని వస్తే కూడా జూరాల లో నాలుగు వందల మెజారిటీతో బీ ఆర్ ఎస్ గెలిచినం. కొడంగల్ కి పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొని పోతాం అంటే ఊరుకునేది లేదు.మా నీళ్ళు తీసుకుపోతే నర్వ, ఆత్మకూరు,అమరచింత ఎడారి గా మారుతుంది. పరిహారం విషయంలో కూడా మా ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తుంది..