శుభాకాంక్షలు
సంక్రాంతి, ఉగాది, దీపావళి వంటి పండుగలప్పుడు క్రైస్తవులు, ముస్లీములు తమలో తాము ఆయా పండుగల శుభాకాంక్షలు చెప్పుకుంటారా?
ఒక హిందువు క్రైస్తవుడికి మైత్రితో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం సంస్కారం ఔతుంది; కానీ ఇవాళ కొందరు హిందువులు తమలో తాము క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు…
హిందువులకు మాత్రమే ఉండే వ్యాధి ఇది; హిందువుల మానసిక దోషం ఇది. ఈ వ్యాధిని, ఈ దోషాన్ని హిందువులు పోగొట్టుకోవాలి. తప్పులేదు ముస్లీములు, క్రైస్తవుల దగ్గర నుంచి హిందువులు నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. అది హైందవానికి, దేశానికి మేలు చేస్తుంది.
వాస్తవానికి ఇవాళ జీసస్ జన్మదినం కాదు. ఈ సత్యాన్ని అన్ని అంతర్జాతీయ ఆకర గ్రంథాలూ గట్టిగా చెబుతున్నాయి. అయినా ప్రపంచవ్యాప్తంగా ‘జీసస్ జన్మదినం అన్న అసత్యం’ క్రిస్మస్ ఉత్సవంగా పెద్ద ఎత్తున జరుగుతోంది. హైందవ ఉత్సవాలపై సంస్కార హీనంగా దాడి చేసే విద్వేషశక్తులు క్రిస్మస్ అన్న అంతర్జాతీయ అసత్యాన్ని ఆస్వాదిస్తారు.
ఈ పరిస్థితిలో ఇవాళైనా, ఇవాళ నుంచైనా హిందువులు తమ వ్యాధి ఏమిటో, దానికి వైద్యం ఏమిటో, తమ దోషం ఏమిటో, దాన్ని పోగొట్టుకోవడం ఎలాగో తెలుసుకుని స్వస్థతతను పొందాలి. ‘హిందువులు మామూలు మనుషులవాలి’. క్రైస్తవులు, ముస్లీముల నుంచి హిందువులు ‘మత చింతనకు’ మాలిమి అవడం నేర్చుకోవాలి.
– రోచిష్మాన్
9444012279