– నీ బిడ్డను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఎందుకు ఇచ్చావు?
– సర్వం ఆంధ్ర అల్లుడికి కట్టబెట్టావు కదా.
– కేటీఆర్ ఆంధ్రలో చదువుకున్నాడు, తప్పు ఏముంది?
– అమెరికాలో ఉండే రేవంత్ రెడ్డి తమ్ముడు బాత్రూంలు కడుగుతున్నాడా?
– రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే వైన్స్ లు బంద్ చేయాలి
– మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి మాటలు చూసి చిన్న పిల్లలు భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూసి తెలంగాణ ప్రజలు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యం.
కేసీఆర్ హయంలో పల్లె, పల్లె పరిశుభ్రతతో కనిపించేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పల్లెలు దివాళా తీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. గెలిచిన స్థానాలన్నీ మావే అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు.
కొత్తగా గెలిచిన సర్పంచ్ ల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి రండ భాష మాట్లాడాడు. పాన్ షాప్ దగ్గర గుట్కా తినేవాడి కంటే వల్గర్ గా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో గెలిచిందో చెప్పు రేవంత్ రెడ్డి.
మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేపో, మాపో కర్ణాటక రాష్ట్రంలో అధికారం కోల్పోయేలా ఉంది. కేసీఆర్ లాంటి పెద్దమనిషి గురించి నీచమైన భాష మాట్లాడాడు. మస్తాన్ మటన్ షాప్ దగ్గర కేసీఆర్ కు ఉద్యోగం ఇస్తా అని అహంకారంతో మాట్లాడుతవ. అసలు నీ బ్రతుకెంత రేవంత్ రెడ్డి.
కేసీఆర్ కాలి గోటికి సరిపోవు రేవంత్ రెడ్డి. నువ్వా రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన మాట్లాడేది. పేగులు మెడలో వేసే ఎక్స్ పర్ట్ రేవంత్ రెడ్డి. ఉద్యమకారుడు హరీష్ రావు గురించి మాట్లాడే స్థాయినా నీది రేవంత్ రెడ్డి? నీకంటే ముందు హరీష్ రావు మంత్రి అయ్యాడు. తెలంగాణ ఉద్యమ బుల్లెట్ హరీష్ అన్న. హరీష్ అన్న గురించా నువ్వు మాట్లాడేది రేవంత్ రెడ్డి. హరీష్ రావు వ్యక్తిత్వం గురించి చూడాలంటే తల పైకి ఎత్తి చూడాలి.
కేటీఆర్ తెలంగాణ హీరో. నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకో రేవంత్ రెడ్డి. అమెరికాలో ఉండే రేవంత్ రెడ్డి తమ్ముడు బాత్రూంలు కడుగుతున్నాడా? అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐ లను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు.కేటీఆర్ ఆంధ్రలో చదువుకున్నాడు, తప్పు ఏముంది? నీ బిడ్డను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఎందుకు ఇచ్చావు , మరి. సర్వం ఆంధ్ర అల్లుడికి కట్టబెట్టావు కదా? తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికి తెలంగాణ తల్లి శోభమ్మ. అలాంటి తల్లిని పట్టుకొని నీఅవ్వా అని అంటవ రేవంత్ రెడ్డి? నీలాంటి కుసంస్కారం గురించి ప్రజలు గమనిస్తున్నారు.
రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి. బూతుల పురాణం మాట్లాడడమే సరిపోతుంది. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టగానే రేవంత్ రెడ్డికి లాగు తడిచి పోయింది.అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే వైన్స్ లు బంద్ చేయాలి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉండే బంధువులు మందు తాగడం లేదు.
రాహుల్ గాంధీ ఉన్నంత కాలం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అవడం ఖాయం. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతం అవడం ఖాయం. కేటీఆర్ కంటే అందగాడివ నువ్వు రేవంత్ రెడ్డి? మేకపోతులా ఉండే నువ్వు కేటీఆర్ అందం గురించా నువ్వు మాట్లాడేది? హరీష్ రావు ఆరడుగుల బుల్లెట్, హరీష్ రావు గురించా నువ్వు మాట్లాడేది?
తెలంగాణ బాపు కేసీఆర్ ను పట్టుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నావు. కేటీఆర్ పట్టుకొని నీ అవ్వా అని మాట్లాడతవ? బూతులు తిట్టే వాడు మా ఊర్లో ఒకడు ఉన్నడు, వాడికి నీకు పోటీ పెడతాం. రేవంత్ రెడ్డి భాష చూస్తుంటే సొంత మనవడే భయ పడేలా ఉన్నాడు. పిట్టలదొర కంటే హీనంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.
ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ చావే కోరుకుంటారు. కేసీఆర్ మాకు సంస్కారం నేర్పించాడు. రియల్ ఎస్టేట్ రంగంలో మొత్తం బ్రోకర్ దందా జరుగుతుంది. కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించుకొని పోతుంటే, జరుగుతున్న అన్యాయం పైన కేసీఆర్ మాట్లాడాడు.
కృష్ణార్జుల అయిన కేటీఆర్, హరీష్ రావు లకే కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేక పోతున్నారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసి పెట్టుకోండి.