– మురుగు కాలువకన్నా ఘోరం నీ నోరు
– ప్రజలు కూడా ప్రభుత్వం తోలు ఒలుస్తారు.
– మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట: రేవంత్. నీది కెసిఆర్ స్థాయి కాదు. నువ్వు గల్లీ స్థాయి నాయకుడే అని మళ్లీ రుజువైంది. ముఖ్యమంత్రి హోదాను మరింత దిగజార్చుతున్నావ్. కెసిఆర్ అడిగినదానికి సమాధానం చెప్పలేకనే విషం కక్కుతున్నడు. మురుగు కాలువకన్నా అద్వానం నీ నోరు. రండలు మాట్లేడే భాష రేవంత్ మాట్లాడుతున్నాడు. నువ్వెంత దిగజారినా ఆ స్థాయికి మేము దిగజారం.
రెండేళ్లలో ఒక్కసారైనా కేసీఆర్ నీ పేరు ఎత్తిండా? పోలీసులు, అధికారులు, మీ గూండాలు, మీ పార్టీ నాయకులు అందరూ కలిసి సర్పంచ్ ఎన్నికల్లో పనిచేసిండ్రు. అయినా ప్రజలు బిఆర్ఎస్ పక్షాన నిలబడి అద్భుతమైన ఫలితాలు అందించిండ్రు. బిఆర్ఎస్ సైనికులు విరోచితంగా పోరాడి బ్రహ్మాండమైన ఫలితాలు సాధించిండ్రు.
మంచి పనులు చేసి,మంచి మాటలతో ప్రజా హృదయాలను గెలవాలి. కానీ నీ మాటలు విని మీ సర్పంచులే నవ్వుకుంటున్నారు. రండలు మాట్లేడే బాష కేసీఆర్ సభలు పెడితే ,మీ దొంగతనం బయటపడుతుందనే భయపడుతున్నారు. సాధారణ ఎన్నికలు ఎప్పుడొచ్చిన నిన్ను రాజకీయంగా ప్రజలే బండరాళ్ళు కట్టి మూసీల పడేస్తారు.
కేసీఆర్ ఏం మాట్లాడిండో కోట్లాదిమంది ప్రజలు చూశారు. ప్రభుత్వం తోలు తీస్తా అన్నాడు తప్ప.. స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడలేదు. కృష్ణా గోదావరి జలాలు దోపిడీకి గురైతున్నాయని చెప్పునా పట్టించుకోలేదు. నదులపై హక్కులను కేంద్రం గుంచుకుంటుందంటే వినలేదు. ఒకవైపు చంద్రబాబు మరోవైపు మోడీ ద్రోహం చేస్తున్నారన్నా చెవిన పెట్టలేదు.
మీ పదవుల కొరకు మా గొంతులో ఎండబెడతామంటే ఊరుకుంటామా? తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే మేము మౌనంగా కూర్చోలేము కదా? ప్రజల పక్షాన కొట్లాడే బాధ్యత కేసిఆర్ పైన ఉంది. తెలంగాణ తెచ్చిన వాళ్ళముగా. ప్రధాన ప్రతిపక్షంగా అది మా బాధ్యత.
తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పిన మా పైనే ఎదురుదాడికి దిగిండ్రు. ఇట్లనే ఉంటే నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రజలు తీవ్ర నీటి సమస్యలు తేలేత్తుతాయి. వీటిపై కాంగ్రేస్ పార్టీ మంత్రులకు కూడా సరైన అవగాహనా లేదు. ఒకవేళ పొరపాటు జరిగితే తప్పు ఒప్పుకొని చంపలేసుకోవాలి.
ఇరిగేషన్ మంత్రి 45 టీఎంసీలకు ఒప్పుకున్నట్లు ఉత్తరం అవగాహన లేకుండానే.. మీకు తెలియకుండానే రాశాడా? ఈ విషయంలో కెసిఆరే కాదు ప్రజలు కూడా ప్రభుత్వం తోలు ఒలుస్తారు. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొంద పెడతారు..ఈ ప్రభుత్వం ఇంకా కళ్ళు తెరవకపోతే మేము ప్రజా ఉద్యమం తప్పక మొదలు పెడతం.