కోకాపేట: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తదితర ప్రముఖులు కోకాపేటలో మున్నూరుకాపు ఆత్మగౌరవ భవనం నిర్మాణపు పనులను పర్యవేక్షించారు. మున్నూరుకాపు ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం హైదరాబాద్ కోకాపేట వద్ద 5 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే.
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి కమలాకర్, సంఘం రాష్ట్ర అధ్యక్షులు సర్థార్ పుటం పురుషోత్తమ రావు,జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వీరమళ్ల ప్రకాష్, సంఘం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ మీసాల చంద్రయ్య, కౌన్సిల్ సభ్యులు సుంకర బాలకిషన్, సీ.విఠల్, రౌతు కనకయ్య తదితర ప్రముఖులు శుక్రవారం కొనసాగుతున్న నిర్మాణపు పనులను పరిశీలించారు.పనులను మరింత వేగవంతం చేసేందుకు చేపట్టవలసిన కార్యాచరణ గురించి సుమారు మూడు గంటల పాటు సమావేశమై చర్చించారు.
ఇందులో భాగంగా వచ్చే నెల 11వతేదీన రాజకీయాలకు అతీతంగా మున్నూరుకాపు పెద్దలతో విస్త్రృత స్థాయి సమావేశం జరపాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో సంఘం ప్రముఖులు గాలి అనిల్ కుమార్,మంగళారపు లక్ష్మణ్,కాశెట్టి కుమార్,లవంగాల అనిల్ కుమార్,ఆవుల రామారావు, ఇసంపల్లి వెంకన్న, కే.ఏస్. ఆనందరావు, ఎర్రా నాగేంద్రబాబు, అల్పూరి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.