– కేంద్ర ప్రభుత్వం ఎలా కమిటీలు వేస్తుంది
– మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
హైదరాబాద్: ప్రభుత్వాలు ఏవైనా వివాదాలేవైనా రాజ్యాంగం ఒక్కటే. రాజ్యాంగ పరంగా ఏ పరిష్కారానికైనా సంస్థలను ఏర్పాటు చేశారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరంగా ఏర్పాటు అయిన సంస్థలను ,చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయి. చట్టాలకతీతంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయి.
నిన్న సుప్రీం కోర్టు లో పోలవరం నల్లమల్ల సాగర్ పై తెలంగాణ వేసిన పిటిషన్ పై ఏపీ వాదనలు విచిత్రంగా ఉన్నాయి. హైదరాబాద్ తెలంగాణ కు ఉంది కదా. ఏపీ సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోకూడదా? అని ఏపీ తరపు అడ్వొకేట్ ఎలా వాదిస్తారు? హైదరాబాద్ తెలంగాణ లో ఉంటే ఏపీ ఏమైనా చేసుకోవచ్చా ?
సాగునీటి ప్రాజెక్టుల పై ఏం చేయాలో విభజన చట్టం లో ఉంది. ఏపీ చేపడుతున్న పోలవరం నల్లమల సాగర్ విభజన చట్టం లో ఎక్కడ ఉంది ? కేంద్ర ప్రభుత్వం ఎలా కమిటీలు వేస్తుంది? పోలవరం నల్లమల సాగర్ కు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనుమతి లేనపుడు కమిటీలు ఎలా వేస్తారు ?
అసలు మీటింగ్ కే పోమని చెప్పిన వారు కమిటీకి ఎలా ఒప్పుకుంటారు? సుప్రీం కోర్టు లో కేసు వేసిన తర్వాత కమిటీ కి తెలంగాణ సభ్యుల పేర్లు ఎందుకు పంపింది ?కమిటీ వేసుకున్నారు కోర్టుకు వచ్చారు అని నిన్న సుప్రీం కోర్టు తెలంగాణ ను ప్రశ్నించింది. ప్రజలు అవకాశం ఇచ్చారు. దానిని ప్రభుత్వాలు ఉపయోగించూసుకోవాలి
రాజ్యాంగ పరమైన ఇరిగేషన్ సంస్థలు ఉన్నాయి. GRMB ,KRMB ,APEX కౌన్సిల్, CWC ఉన్నాయి. తెలంగాణ రెండు నదుల మధ్యలో ఉంది. ఓ వైపు కృష్ణా నది, మరో వైపు గోదావరి నది ఉంది. తెలంగాణ కు ఎత్తిపోతల పథకాలే శరణ్యం. సీమాంద్ర పాలనలో తెలంగాణ కు రావల్సిన నీళ్ళు రాలేవు. నీరు రాకుండా కుట్రలు చేశారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టుల పై చిల్లర రాజకీయం చేస్తోంది. ఒకవైపు నదీజలాల పంపిణీ కమిటీల ఏర్పాటు చేసుకొని.. మరో వైపు తెలంగాణ ప్రాజెక్టుల పనులు ఆపడం దౌర్భాగ్యం. కేంద్రం ఒత్తిడిలకు ఈ ప్రభుత్వం వంగుతోంది.
పాలమూరు ప్రాజెక్ట్ పై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నా. అవగాహన లేకుండా PPT అసెంబ్లీ లో పెట్టారు. కేసీఆర్ మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పారా? కేసీఆర్ రావడం లేదని చిల్లర గా మాటాడుతున్నారు. ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్యుమెంట్ల లోని పేరా గ్రాఫ్ విడిచి పెట్టి, తనకు అనుకూలం గా ఉన్న వాటినే చదవడం దారుణం ఇదే నా సీఎం సంస్కారం?
ముందు కే టీ ఆర్ హరీష్ రావు ల ప్రశ్నలకు సమాధానం చెప్పండి. కేసీఆర్ రాజకీయ జీవితం ముందు ఇపుడున్న సీఎం అనుభవం ఎంత ? కేసీఆర్ పై అవాకులు చవాకులు మాట్లాడటం సిగ్గు చేటు. ఇరిగేషన్ పై ప్రభుత్వం తీరు చాలా బాధిస్తుంది
చట్ట సభలు చట్టాలు చేయడానికి ఉన్నాయి. కానీ పంచాయతీలు పెట్టడానికి కాదు. రేవంత్ రెడ్డి రాజీనామా చేసినా ఇరిగేషన్ పై ఆయన చేసిన మోసాలను ప్రజలు క్షమించరు. అసెంబ్లీ ని అసెంబ్లీ లాగా నడపడం లేదు. ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ నేత గట్టు రాంచందర్ రావు పాల్గొన్నారు.