– 30 శాతం భూమి బాంబులేటి అడుగుతున్నాడు
– తుమ్మల నాగేశ్వరరావు కూడా కమీషన్లు మరిగాడు
– ముగ్గురు మంత్రులు ఉన్నా యూరియా బస్తాలు దొరకడం లేదు
– రైతుల అరిగోస పడుతున్నారు
– భట్టి విక్రమార్క హామీలు ఎక్కడ పోయాయి?
– ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ సభ
– నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీద సన్మానం
అపూర్వ విజయం సాధించిన సర్పంచులకు , ఉప సర్పంచ్ లకు శుభాకాంక్షలు. కొందరు స్వల్ప తేడాతో ఓడారు. కాంగ్రెస్ తొండి చెసి గెలిచిన మా అభ్యర్థుల, రీ కౌంటింగ్ లో ఓడగొట్టింది. కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధం అయింది.. ముగ్గురు మంత్రులు ఉన్నా, యూరియా బస్తాలు దొరకడం లేదు.
రైతుల అరిగోస పడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ మీద ఖమ్మం ప్రజల్లో ఆగ్రహం, వ్యతిరేకత కనిపిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నామ మాత్రంగా సర్పంచ్ లు గెలిచింది. కానీ బీఆర్ఎస్ 40 శాతం సర్పంచ్ లు గెలిచాం. గ్యారెంటీ కార్డు భధ్రం గా పెట్టమన్నారు భట్టి విక్రమార్క, రెండేళ్లలో మీ హామీలు ఎక్కడ పోయాయి? ఇప్పుడు గ్యారెంటీ కార్డు ఎక్కడ పెట్టాలి?
ఏం పని అయినా 30 శాతం కమీషన్ భట్టి అడుగు తున్నారు. 30 శాతం భూమి బాంబులేటి అడుగుతున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు కూడా కమీషన్లు మరిగాడు. షాపుల్లో యూరియా లేదు. యాప్ లో యాడ వస్తుంది. యూరియా కార్డు తో కొత్త నాటకం ఆడుతున్నారు.ఈ దౌర్భాగ్యులు వచ్చాక రైతులు పరిస్థితి దారుణం గా ఉంది.
ముఖ్యమంత్రి కి వ్యవసాయం గురించి తెలీదు. నదీ జలాల మీద సీఎంకు అవగాహన లేదు.బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణ లో ఉందట. బేసిన్లు కూడా తెలీదు. 72 వేల కోట్లు ఉమ్మడి రాష్ట్రం నుంచి మనకు అప్పుగా వచ్చింది. కేసీఆర్ పాలన ముగిసే నాటికి, తెలంగాణ రాష్ట్ర మొత్తం అప్పు 3.50 లక్షల కోట్ల మాత్రమే.. అందులో సమైక్య అప్పు కూడా ఉంది
9 ఏళ్ళలో కేసీఆర్ చేసిన అప్పు 2.80 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. కేసీఆర్ చేసిన అప్పు తెలంగాణ మీద పెట్టుబడి. రైతుల కోసం, భావితరాల మీద పెట్టిన పెట్టుబడి.భవిష్యత్ కోసం, అబీవృధ్ది మీద కేసీఆర్ ఖర్చు చేశారు. కేసీఆర్ మీలాగా దోచుకోలేదు. తెలంగాణ ను దోచుకొని డీల్లీ కప్పం కడుతున్నారు.
రాహుల్ కు కప్పం కట్టకలేదు పోస్ట్ ఊస్టే. పదవి పోతుందని, నెల నెలా ఢిల్లీ కి కప్పం కడుతున్నారు.కేటీఆర్. రెండు దీపావళి దీపావళులు పోయాయి.. బాంబులు పేల లేదు. సిగ్గు లేకుండా అదాని, అంబానీ, మోడీ కాళ్ల మీద పడి ఈడీ కేసు మాఫీ చేయించుకుంటున్నాడు. బీజేపీ లో చేరతానని మోడీ ఎదుట మోకరిల్లి, బీజేపీ మోకరిల్లి ఈడీ కేసు మాఫీ చేయాలని తిరుగుతుండు.
ఇంకో మంత్రి కార్పోరేటర్లు ఇండ్లు తిరుగుతున్నాడు. మా ముగ్గురు కార్పోరేటల్లను చేర్చుకుంటుండు. ప్రజల అనుకుంటే మీరు ఏం చెయ్య లేరు మంత్రి తుమ్మల. గారు.మా కార్పోరేటర్ పోతే ఏం కాదు. జనం అనుకోవాలి. జనం అనుకుంటే ఏది ఆగదు. 2014 లో ఓడిపోయి ఇంట్లో ఉంటే మిత్రుడని కేసీఆర్, తుమ్మల ను మంత్రి పదవి ఇచ్చారు. జిల్లాలో అబీవృధ్ది కేసీఆర్ హయాంలో జరిగింది మాత్రమే.
ఈ కార్యక్రమంలో కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు దిండిగల రాజేందర్, ఖమర్, మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.