January 9, 2026

సీసీ టీవీ కెమెరా ‘సాక్షి’గా.. తిరుమలలో వైకాపా అసలు రంగు

జగన్ రెడ్డికి తిరుమలలో వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌ భూమన అనుచరుడిగా చెలామణి తిరుగుతున్న వ్యక్తే..

వైకాపా కుట్రలో పావయ్యి అడ్డంగా దొరికిపోయాడు. ఇలాంటి హీనమైన కుట్రకు తెరలేపడం చూస్తుంటే భక్తుల రక్తం మరుగుతోంది!

సీసీ టీవీ కెమెరా సాక్షిగా.. అసలు రంగు బయటపడింది!

తిరుమల కొండపై భక్తులు వైకుంఠం ఏకాదశి దర్శనాల భక్తిపారవశ్యంలో మునిగిపోతుంటే, వీరు మాత్రం రాజకీయ విషం చిమ్మారు. కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిళ్లు వేసింది ఎవరో కాదు.. సాక్షాత్తు జగన్ రెడ్డి ఫోటోగ్రాఫర్ మరియు సాక్షి ప్రతినిధి మోహన్ కృష్ణ, వైసీపీ కార్యకర్త కోటి!

ఇది పక్కా “స్క్రిప్ట్” ప్రకారం జరిగిన డ్రామా:

అపచారం: తామే మద్యం బాటిళ్లను తెచ్చి అక్కడ పెట్టడం.

ప్రచారం: దాన్ని వీడియో తీసి ప్రభుత్వంపై బురద జల్లడం.

ఆక్రందన: వెంటనే మీడియా ముందుకొచ్చి “అపవిత్రం అయిపోయింది” అంటూ భూమన మొసలి కన్నీరు కార్చడం.

డిక్లరేషన్ సంతకం పెట్టమని చెప్పినప్పటి నుండి జగన్ రెడ్డి తిరుమలకు రావడం మానేశాడు. ఇదేమీ హిందూ ధర్మం, ఇదేమీ లౌకిక దేశం అని ధర్మం మీద దేశం మీద దుమ్మెత్తిపోశాడు. ఆ దుర్మార్గుడి పర్సనల్ ఫోటోగ్రాఫర్ కి ఈ మధ్య ఏమీ తోచనట్లు ఉంది. తన కెమరా పనితనం కౌస్తుభం వద్ద సీసీ టీవీలో క్లిక్ అవుతుంది అని తెలియక పట్టుబడ్డాడు.

వీరి పాపాలను ఆ శ్రీవారికి కనిపించదు అనుకున్నారు.
ఈ దుర్మార్గులకు ఏడుకొండల వాడే శిక్ష వేస్తాడు!
ఆ లోపు న్యాయస్థానాల తీరు, వాటి ధర్మం ఎలా ఉంటుందో దేవుడు పరీక్ష పెడుతున్నాడు అనుకుంటా.

Total Visitors: 2,555,262