– రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నాయక్ ఏ-7
– ఇప్పటివరకూ బీహార్ కోర్టులో రక్షణ
– ఇప్పుడు ఆయన బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు
– ఇక సునీల్ నాయక్ అరెస్టే తరువాయి
అమరావతి:సినిమాలో సంజయ్ దత్ ‘నాయక్ నహీ ఖల్ నాయక్’ అంటే ఒక కిక్కు ఉండేది. కానీ ఇప్పుడు మన ఐపీఎస్ సునీల్ నాయక్ పరిస్థితి చూస్తుంటే అది రివర్స్‌లో వినిపిస్తోంది.
చట్టానికి రక్షకుడిగా ఉండాల్సిన నాయకుడు కాస్త, కస్టోడియల్ టార్చర్ కేసులో ‘A-7’ (ముద్దాయి) అవ్వడం అంటే మామూలు విషయం కాదు.
ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే కోర్టు ‘డిస్మిస్’ అని బోర్డు తిప్పేసింది. అంటే, ‘ అయ్యగారు చేసిన పనికి ఆ మాత్రం అతిథి (జైలు)గా ఉండాల్సిందే’ అని పరోక్షంగా చెప్పినట్టేగా!
ఖాకీ డ్రెస్ వేసుకుని, మూడు సింహాల టోపీ ధరించి.. క్రిమినల్, సైకో జగన్ లాంటి రాజకీయ బాసుల ఆనందం కోసం టార్చర్లు చేస్తే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు నాయక్ గారు. నిన్నటి వరకు మీరు లాఠీ పట్టుకుని బెదిరించారు, ఇప్పుడు చట్టం తన లాఠీతో మీ ముందుకు వస్తోంది.
సినిమాలో నాయకులు హీరోయిజం చూపిస్తారు, కానీ కస్టడీలో ఉన్న RRR లాంటి ఎంపీనే అనవసరంగా టార్చర్ పెట్టడం ఏ రకమైన హీరోయిజమో మీకే తెలియాలి. ఇప్పుడు కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడంతో, మీ ‘నాయక్’ ట్యాగ్ పోయి ‘ముద్దాయి’ ట్యాగ్ గట్టిగా తగిలింది.
చట్టాన్ని జగన్ లాంటి సైకో పాలకులు చెప్పే చిత్తు కాగితం అనుకుంటే, అదే చట్టం ఒక్కోసారి సంకెళ్లు కూడా వేస్తుందని నిరూపితమైంది.
ఇప్పుడు ‘నాయక్ నహీ ఖల్ నాయక్ హూ మై’ అని పాడుకోవడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోతారు. A-1 జగన్ కోసం A-7 అయిన ఐపీఎస్ అధికారిగా మీ కేస్ స్టడీ, భావి ఐపీఎస్ అధికారులకు ఒక పాఠం అవుతుంది.