సాధారణంగా ఒక అంతర్జాతీయ స్థాయి రహదారిని నిర్మించడానికి పట్టే సమయాన్ని, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నిమిషాల్లో, గంటల్లో లెక్కకడుతోంది. ఈ వేగం ప్రపంచ రోడ్ల నిర్మాణ చరిత్రలోనే ఒక విప్లవం!
ప్రపంచం నివ్వెరపోయే “గ్లోబల్ స్పీడ్” గణాంకాలు:
24 గంటల రికార్డులు: కేవలం ఒకే రోజులో (24 గంటల్లో) 28.95 లేన్ కిలోమీటర్ల రోడ్డును నిర్మించి, ప్రపంచంలో మరే దేశానికీ సాధ్యం కాని వేగాన్ని మనం చూపించాం.
మెటీరియల్ మ్యాజిక్: ఒక్క రోజులో 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీటును వాడటం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇది ప్రపంచంలోనే అత్యధికం!
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ: 70 అత్యాధునిక టిప్పర్లు, ప్రపంచస్థాయి మిక్సింగ్ ప్లాంట్లతో జరిగిన ఈ పనులు, గ్లోబల్ క్వాలిటీ ప్రమాణాలను (NHAI Standards) ఏమాత్రం తగ్గకుండా పూర్తి చేశారు.
ఇది “నవ్యాంధ్ర” బ్రాండ్ ఇమేజ్!
ఒకప్పుడు గిన్నిస్ రికార్డులు అంటే అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు:
“India builds, Andhra Pradesh delivers!” అనే నినాదంతో ప్రపంచ వేదికపై మన జెండా రెపరెపలాడుతోంది.
12 గంటల ప్రయాణాన్ని కేవలం 6 గంటలకు తగ్గించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్, రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పూర్తయిన ఎక్స్‌ప్రెస్‌వేగా నిలవబోతోంది.
హ్యాట్రిక్ కాదు… గ్లోబల్ ఫోర్!
రాజ్ పథ్ ఇన్ఫ్రాకాన్ ఇప్పటికే మహారాష్ట్రలో రికార్డులు సృష్టించింది. కానీ ఆంధ్రప్రదేశ్ గడ్డపై ఏకంగా నాలుగు గిన్నిస్ రికార్డుల లక్ష్యంతో దూసుకుపోతుండటం మన అభివృద్ధి కాంక్షకు నిదర్శనం.
ఇది మన పట్టుదల… ఇది మన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ స్పీడ్!
ఈ ఎక్స్ ప్రెస్ రహదారికి అనుకూరార్పణ చేసి, జగన్ పాలనలో డిజైన్ మార్చి పడకేసినా.. పట్టుదలతో.. రాజనీతిజ్ఞుడు చంద్రబాబు ఆయన డిజైన్లకు పర్యావరణ అనుమతులు తెచ్చి ఈ స్పీడ్ కు సకలం సిద్ధం చేశారు. సీఎం చంద్రబాబు తన ఎక్స్ వేదిక ద్వారా అభినందనలు తెలియజేశారు.