ప్రపంచమంతా యుద్ధాలు ఆపినందుకు తనకు ‘నోబెల్ శాంతి బహుమతి’ రాలేదని ట్రంప్ అలిగి, గ్రీన్ ల్యాండ్ మీద పడ్డారు. ఈ ప్లాన్ వెనుక మన జగన్ సలహా ఉందనేది వైకాపా కార్యకర్తల వాదన. యలహంగా ప్యాలేస్ వైట్ హౌస్ మధ్య ఇలా సంభాషణలు జరిగాయని, దీని క్రెడిట్ జగన్ అన్నకు కచ్చితంగా దక్కాలని, వైకాపా సోషల్మీడియా రంగంలోకి దిగబోతోందని వినికిడి.
ట్రంప్: “జగన్.. నేను ఇంతమందిని కొట్టకుండా ఆపాను, నాకు నోబెల్ ఇవ్వకుండా ఎవరో అమ్మాయికి ఇచ్చారు. నాకు ఇన్సల్ట్ గా ఉంది. అసలు ఈ వరల్డ్ పీస్ అంటేనే నాకు చిరాకు దొబ్బుతోంది!”
జగన్: “ట్రంప్ అన్నా.. మీరు ఇంకా అమాయకత్వంలోనే ఉన్నారు. మనకి కావాల్సింది ‘బహుమతి’ కాదు.. ‘హోదా’! ఇప్పుడు చూడండి, నాకు ఏపీ అసెంబ్లీలో ‘ప్రతిపక్ష హోదా’ అని బోర్డు పెట్టలేదు, మైక్ ఇవ్వలేదు. అందుకే నేను ఏం చేశాను? అసెంబ్లీని గాలికి వదిలేసి, బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చుని పబ్జీ ఆడుకుంటున్నా! మీరు కూడా అంతే.. నోబెల్ ఇవ్వలేదా? అయితే ఇకపై ప్రపంచంలో ఎక్కడా శాంతి ఉండకూడదు అని ఫిక్స్ అయిపోండి!”
ట్రంప్: “అవును జగన్! అందుకే నేను గ్రీన్ ల్యాండ్ కొనేస్తా అని గొడవ చేస్తున్నా. కానీ జనాలు ఏమంటారంటే.. ‘నువ్వు ప్రెసిడెంట్ వి కదా, శాంతి కోసం పని చేయాలి కదా’ అని అడుగుతున్నారు.”
జగన్: (పెదవి విరుస్తూ..) “అదే పప్పులో కాలేయడం అంటే! ప్రజలు ఓట్లేసింది మనం పని చేయడానికి కాదు అన్నా.. మనం అనుకున్న హోదాలో కూర్చోవడానికి! నాకు ప్రతిపక్ష హోదా లేనప్పుడు పులివెందుల ప్రజల సమస్యలు వినిపించాల్సిన అవసరం ఏముంది? అలాగే మీకు నోబెల్ లేనప్పుడు ఈ ప్రపంచ శాంతి మీకెందుకు? మనల్ని తక్కువ చేసిన చోట మనం అడుగు పెట్టకూడదు. అది వాషింగ్టన్ అయినా.. వెలగపూడి అయినా!”
ట్రంప్: “వావ్! వాట్ ఏ థాట్! అంటే ఇప్పుడు నేను వైట్ హౌస్ లో కూర్చుని గ్రీన్ ల్యాండ్ గురించి ట్వీట్లు వేస్తూ ఉంటే సరిపోతుందా?”
జగన్: “సరిపోదు.. ఇంకాస్త ఎలివేషన్ ఉండాలి! మేము ఎలాగైతే ‘రఫ్ఫా రఫ్ఫా’ అని మేకలు నరికి పోస్టర్లకు రక్తం పూస్తూ.. కత్తులు తిప్పుతున్నామో, మీరు ‘యుద్ధానికి సిద్ధం’ అని ఒక పోస్టర్ వేయండి. అసెంబ్లీని నేను ఎలాగైతే బాయ్‌కాట్ చేశానో.. మీరు కూడా ఐక్యరాజ్యసమితికి వెళ్లకండి. గ్రీన్ ల్యాండ్ మ్యాప్ చూపిస్తూ.. ‘ఇది మా నాయనమ్మ గారి ఆస్తి’ అని చెప్పండి. అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు!”
ట్రంప్: “థాంక్యూ జగన్! మీ ఐడియా బాగుంది. అసెంబ్లీకి వెళ్లకుండానే ఎమ్మెల్యే జీతం ఎలాగైతే వస్తుందో.. నేను కూడా శాంతి నెలకొల్పకుండానే ‘శాంతి కాముకుడిని’ అని పిలిపించుకుంటా. రేపు నేను గ్రీన్ ల్యాండ్ కొన్నాక, అక్కడ ఫస్ట్ మీ విగ్రహమే పెడతాను!”
జగన్: “వద్దు అన్నా.. అక్కడ విగ్రహం పెడితే మళ్ళీ చంద్రబాబు అభిమానులు అక్కడికి వెళ్లి నన్ను తిడతారు. దానికంటే మంచి ఐడియా ఏంటంటే.. గ్రీన్ ల్యాండ్ లో ఒక ‘ప్యాలెస్’ కట్టుకుందాం.. మీరు నోబెల్ రాలేదని, నేను ప్రతిపక్ష హోదా రాలేదని అక్కడ కూర్చుని బాధపడుతూ ఉందాం!”
ట్రంప్ చివరగా.. “జగన్, గ్రీన్ ల్యాండ్ కి వస్తే అన్నీ మీరే చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ వాలంటీర్లు ఉండరు కదా!” అంటే.. జగన్: “పర్లేదు అన్నా.. గ్రీన్ ల్యాండ్ మంచులో మన ‘సిద్ధం’ హ్యాండ్ ముద్రలు వేసేద్దాం!” అన్నాడట.
అక్కడ ట్రంప్ గ్రీన్ ల్యాండ్ మ్యాప్ ని, ఇక్కడ జగన్ అసెంబ్లీ గేటుని చూస్తూ.. “వస్తే హోదా రావాలి.. లేదంటే అన్నీ పోవాలి!” అని ఒకే రాగం పాడుతున్నారు. మొత్తానికి, ప్రపంచ శాంతిని మన జగన్ ‘ప్రతిపక్ష హోదా’ ప్రభావితం చేసింది అని రఫ్ఫా రఫ్ఫా సర్కిల్స్‌లో గర్వంగా చెప్పుకుంటున్నారట.
