– ప్రక్షాళన కోసం తెచ్చామన్న శ్యామలరావును ఎందుకు బదిలీ చేశారు?
– భూమన, సుబ్బారెడ్డి నిజంగా తప్పు చేసి ఉంటే వారి పేర్లు చార్జిషీట్లో ఎందుకు చేర్చలేదు?
– పోలీసులు, అధికారులు, నాయకులను ఎవరినీ వదిలిపెట్టం
– అధికారం లోకి రాగానే అందరికీ చుక్కలు చూపిస్తాః
– జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్
ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా: నాగరిక సమాజం ఈ జంగిల్‌రాజ్ పాలన చూసి తల దించుకునేలా చంద్రబాబు చేశారు. అంబటి రాంబాబు ఇంట్లో 5 కార్లు «ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసులో మొత్తం పగలగొట్టారు. ఆఫీస్‌కు నిప్పుపెట్టారు.
సా.5గం. నుంచి అర్థరాత్రి వరకు విధ్వంసం కొనసాగింది. ఆ మర్నాడే ఇక్కడ జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు.
చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సీబీఐ ఛార్జ్‌షీట్ తేల్చి చెప్పింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలపలేదని సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది. అయినా చంద్రబాబు అన్యాయమైన దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు సీఎం కాక ముందు వరకు ఎవరైనా తిరుమల ప్రసాదం ఇస్తే కళ్లకు అద్దుకుని తినేవారు. కానీ, ఇప్పుడు ఆ ప్రసాదం పవిత్రతను చంద్రబాబు దిగజార్చారు..
చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలు అని సీబీఐ ఛార్జ్‌షీట్ ద్వారా స్పష్టం చేసింది. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్‌ల నివేదికలు అదే విషయాన్ని తేల్చి చెప్పాయి. ఇంకా టీటీడీ ఛైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కూడా ఏ తప్పు చేయలేదని సీబీఐ నిర్ధారించింది. అందుకే వారి పేర్లు ఛార్జ్‌షీట్‌లో పెట్టలేదు. అరెస్టు చేయలేదు. ఆ విధంగా వారికి క్లీన్చిట్ ఇచ్చారు.
ఆ సీబీఐ ఛార్జీషీట్లో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అందులో పేజీ నెం.62 లో ఒక విషయం ఉంది.. అంటూ దాన్ని చదివి వినిపించారు. 27, జూలై, 2024. అప్పుడు సీఎం చంద్రబాబు. ఆరోజు టీటీడీ నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపించిందని రాశారు. ఏఆర్ డెయిరీకి తిప్పి పంపించారు. అలాగే, పేజీ నెం.64 లో ఏమని రాశారంటే.. అంటూ అది కూడా చదివి వినిపించారు.
పేజీ నెం:44లో ఏం రాశారు అని చెబుతూ.. వెనక్కి పంపించిన ట్యాంకర్లును వైష్ణవి డెయిరీ పేరుతో వస్తే అనుమతించారని తెలిపారు. అంటే, ఇదే చంద్రబాబుగారు సీఎంగా ఉండగా, జూలై 27, 2024న నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపిస్తే.. అవే ట్యాంకర్లు దొడ్డిదారిలో తిరిగి వచ్చాయి. వాటిని టీటీడీ అంగీకరించి, లడ్డూ తయారీలో వాడారని రాసింది. మరి అసలు పాపం చేసింది ఎవరు?. దీనికి చంద్రబాబు, లోకేష్, పవన్ సమాధానం చెప్పాలి. అసలు ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఉందని ఏ ల్యాబ్ రిపోర్టులు చెప్పాయి?.
అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అలా దాడులు చేశారు. చంద్రబాబు ఇకనైనా బుద్ధి మార్చుకోవాలని జోగి రమేష్ అంటే, ఆయన ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. యాసిడ్ విసిరేశారు. దీంతో గోడలు పాడయ్యాయి. తలుపులు కాలిపోయాయి. ఆ దాడి చేసినప్పుడు రమేష్ వాళ్ల నాన్న ఇంట్లోనే ఉన్నాడు. మరి ఇది హత్యాయత్నం కాదా?. ఒక బీసీ నాయకుడి గొంతు నొక్కాలని చూడడం ఎంత దుర్మార్గం?.
ఇవన్నీ చూస్తుంటే అసలు మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? లేక జంగిల్‌రాజ్‌లో ఉన్నామా? అనిపిస్తోంది. ఎందుకంటే ఇవన్నీ అందుకు నిదర్శనాలు కావా? ఈ ఆధారాలు ఎక్కడికి పోవు. సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం.
రాష్ట్రంలో జంటిల్రాజ్ను ఎండగడతాం. న్యాయం కాస్త ఆలస్యం కావొచ్చు. కానీ, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.
మరో మూడేళ్లలో వచ్చేది మా ప్రభత్వమే. ఇప్పుడు తప్పు చేస్తున్న పోలీసులు, అధికారులు, నాయకులు, గుండాగిరి చేస్తున్న ప్రతి ఒక్కరిని బోనులో నిలబెడతాం. వారికి శిక్ష తప్పదు. చంద్రాబాబు నీకు చిప్ సరిగ్గా ఉంటే.. ఇలా ఎవరైనా చేయిస్తారా? అది సరిగ్గా లేదు కాబట్టే, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ నిందిస్తున్నారు.
ఇదే అనిల్ సింఘాల్ అనే ఈఓ ఎవరు? ఆయన నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈఓ. ఆయన్ను మేము కూడా కొనసాగించాము. ఒకవేళ నాడు ఆయన తప్పు చేసి ఉంటే, మళ్లీ సింఘాల్‌ను తిరిగి టీటీడీకి ఎలా బదిలీ చేశారు?అలాగే శ్యామలరావును టీటీడీ ప్రక్షాళన కోసం తెచ్చామన్న చంద్రబాబు, ఆయన్ను బదిలీ చేశారు? ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, శ్యామలరావు ఈఓగా ఉన్నప్పుడే ట్యాంకర్లు వెనక్కు పంపారు. అవే మళ్లీ తిరిగి రావడం మచ్చ కాదా?