– ఇది శబ్దం చేసే యుద్ధం కాదు
– ఇది నిశ్శబ్దంగా ఊపిరి ఆపే యుద్ధం
– ట్రంప్ తగ్గాడు.. మోడీ నెగ్గాడు
The Art of Economic War
ఇది యుద్ధం కాదు.
బాంబులు పడలేదు.
సైనికులు చనిపోలేదు.
కానీ…
ఒక సూపర్‌పవర్ నెమ్మదిగా మోకాళ్ల మీదికి వచ్చింది.
ఆయుధం? టారిఫ్.
పాశం? ఎఫ్‌టీఏ.
టార్గెట్? డోనాల్డ్ ట్రంప్ కాదు… అతని ఆర్థిక అహంకారం.
ఇది శబ్దం చేసే యుద్ధం కాదు.
ఇది నిశ్శబ్దంగా ఊపిరి ఆపే యుద్ధం.
—
ట్రంప్ పై ఒత్తిడి ఎక్కడ మొదలైంది?
ట్రంప్‌కు అసలు భయం ఇండియా ఏం చెప్పిందన్నది కాదు. ఇండియా ఏమీ చెప్పకుండానే ఏం చేసిందన్నదే. ఇండియా ఒక్కసారి కూడా “మాపై టారిఫ్ తగ్గించండి లేకపోతే మా స్టాక్ మార్కెట్ కూలిపోతుంది” అని అడగలేదు. అది బలహీనుల భాష. అది బెగ్గింగ్.
ఇండియా వాడింది Institutional Counterweight Strategy.ఒక ప్లాన్ చేసిన, చట్టబద్ధమైన, కానీ క్రూరమైన ఎకనామిక్ అటాక్. ఎక్కడా బెదిరింపు లేదు. కానీ ప్రతి అడుగు తర్వాత ప్రత్యర్థికి శ్వాస ఆడలేదు.
—
ఫస్ట్ మూవ్ – యూరోప్ (27 దేశాలు)
The Trojan Horse
ఇండియా ముందుగా చేతులు కలిపింది యూరోపియన్ యూనియన్ లోని 27 దేశాలతో.
దీనికి పేరు పెట్టారు — “Mother of All Deals.”
అసలు నేరం అక్కడే జరిగింది.
ఇండియన్ మార్కెట్లో యూరోప్ కార్లు, వైన్స్, విస్కీలు, మెడిసిన్స్… అన్నీ అమెరికన్ ప్రొడక్ట్స్ కంటే చీప్ అయ్యే పరిస్థితి.
First Mover Advantage – EU కి.
అమెరికా?
మార్కెట్ బయట నిలబడి లోపల జరుగుతున్న దోపిడీని చూస్తూ.
అక్కడే ట్రంప్‌కు అర్థమైంది — ఇది టారిఫ్ వార్ కాదుఇది మార్కెట్ ఆక్యుపేషన్.
—
సెకండ్ మూవ్ – కెనడా
The Licensed Smuggling Route
తర్వాతి ప్లాన్ — కెనడా తో FTA. బిజినెస్ భాషలో ఇది “Smuggling with a License.”
సింపుల్ మ్యాథ్:
1 kg భారత బియ్యం = ₹100
USA కి నేరుగా వెళ్తే → 50% టారిఫ్ → ₹150
కానీ…
కెనడాతో FTA → ₹100కే కెనడాకు
కెనడా రీబ్రాండ్
₹20 మార్జిన్
USA కి అమ్మకం → ₹120
ఎందుకంటే USA–Canada మధ్య USMCA ఉంది.
అంటే — కర్ర విరగకుండా పాము చచ్చినట్టు. అమెరికా చట్టాల మధ్యలోంచి ఇండియన్ సరుకులు నడుచుకుంటూ లోపలికి.
ఈ గేమ్ ట్రంప్‌కు అర్థమైంది. అహంకారం కాదు… ఆర్థిక ప్రయోజనాలే చివరికి నిర్ణయం తీసుకున్నాయి.
—
టారిఫ్ 18% కి ఎందుకు దిగింది?
The Forced Concession
బయటికి చెప్పింది వేరు:
“మోడీ నా డియర్ ఫ్రెండ్.”
అసలు నంబర్స్:
ఇండియా పై రియల్ టారిఫ్ → 25%
రష్యా ఆయిల్ కారణంగా సెకండరీ టారిఫ్ → మరో 25%
టోటల్ = 50%
ఇండియా రష్యా ఆయిల్ తగ్గించింది. మానలేదు. అందుకే ఒక 25% పూర్తిగా తీసేశారు. మిగిలిన 25% లో 18% కి దిగారు. ఇది ఫ్రెండ్షిప్ కాదు. ఇది ప్రత్యామ్నాయం లేని పరిస్థితిలో చేసిన ఆర్థిక సబ్మిషన్. చైనాకు ఆల్టర్నేటివ్గా ఇండియాను వదులుకోవడం అమెరికాకు సాధ్యం కాలేదు.
—
రష్యా ఆయిల్ – The Grand Deception
అంకెలు అబద్ధం చెప్పవు. కానీ రాజకీయ కథలు చెప్తాయి.
2022: 50,000 బ్యారెల్స్/day
2024: 18 లక్షలు/day
ఇప్పుడు: 12 లక్షలు/day
2024 తో పోలిస్తే తగ్గింది. 2022 తో పోలిస్తే ఇంకా భారీగానే ఉంది.
ఈ ఆయిల్‌ని రిఫైన్ చేసి డీజిల్, జెట్ ఫ్యూయల్‌గా యూరోప్‌కే అమ్ముతోంది ఇండియా.
డబుల్ గేమ్ కాదు. ఇది మల్టీ-లేయర్ సర్వైవల్.
—
మార్కెట్ ఎందుకు డాన్స్ చేసింది?
The Blood Flow Effect
స్టాక్ మార్కెట్ దేశభక్తితో నడవదు. సెంటిమెంట్‌తో నడవదు. Cash Flow తో నడుస్తుంది.
USA అంటే డాలర్. FII మనీ. హెడ్జ్ ఫండ్స్.
డీల్ సిగ్నల్ వచ్చిందంటే చాలు —
Nifty +600.
IT → Jobs → Loans → Real Estate → Cement, Steel.
ఇది గ్రోత్ కాదు. ఇది కంట్రోల్డ్ ఎకనామిక్ చైన్ రియాక్షన్.
—
రష్యా – The Economic Dead End
రష్యా ఫ్రెండ్. కానీ మార్కెట్ కాదు.
ట్రేడ్: $70B
ఇండియా కొనేది: $65B
రష్యా కొనేది: $5B
డబ్బు తిరగదు. స్పెండింగ్ పవర్ లేదు.
స్టాక్ మార్కెట్‌కు స్నేహం అవసరం లేదు. లిక్విడిటీ అవసరం.
—
ఈ గేమ్‌లో పావు
Pakistan – The Disposable Asset
పాకిస్తాన్ పై ఇంకా ~30% టారిఫ్. ఇండియా పై 18%.
ఇన్ని రోజులు “పాకిస్తాన్ నా ఫ్రెండ్” అన్న వాడే ఇప్పుడు ఇండియాకే డీల్ ఇచ్చాడు.
రాజకీయాల్లో నమ్మకం కరెన్సీ కాదు. ఉపయోగపడే లివరేజ్ మాత్రమే కరెన్సీ. పాకిస్తాన్ దగ్గర అది లేదు.
—
ఫైనల్ షాట్
The House Always Wins
ఇండియా గొడవ పడలేదు. వేడుకోలేదు. వినయంగా కూడా లేదు.
యూరోప్‌తో ఎంగేజ్ అయింది. కెనడాతో మార్గాలు వేసింది. ఎకనామిక్ లివరేజ్‌ను ఆయుధంగా మార్చింది.
ట్రంప్ తగ్గాడు. మోడీ నెగ్గాడు.
కానీ ఇది ముగింపు కాదు.
ఇది గ్లోబల్ ట్రేడ్ వార్‌లో మొదటి రక్తపు మరక మాత్రమే.
The house always wins.
This time… the house is India