– హిందూ విద్వేష శక్తుల నుంచి ఈ నేలను రక్షించుకునేందుకు ‘హిందూ & బ్రాహ్మణ్ అట్రాసిటీ యాక్ట్’ ఒక్కటే మేలైన విధానం
దేశంలో మోదీ – బీ.జె.పీ. – ఎన్.డీ.ఎ. మునుపెన్నడు లేనంత బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత లోక్ సభ ఎన్నికల తరువాత దేశంలోని పెద్ద శాతం ప్రజలు తప్పు తెలుసుకున్నట్టూ, బీ.జే.పీ. కూడా తన తప్పుల్ని తెలుసుకుని దిద్దుకుంటున్నట్టూ తెలుస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన హిందూ – ఓటు ఏకీకృతం దేశ వ్యాప్తం అవుతూండడం అత్యంత శుభ పరిణామం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్.డీ.ఎ.కు 350 స్థానాలకు పైగా వస్తాయని ఒక సర్వే తెలియజేస్తోంది. ఆ సర్వే విషయాన్ని పక్కన పెట్టి ఆలోచన చేసినా బీ.జె.పీ. – ఎన్.డీ.ఎ. బాగా పుంజుకుని బలపడుతూన్నట్టు తెలుస్తోంది. ‘మోదీ ఫాక్టర్’ స్థిరంగా కాదు బాగా పుంజుకుని మరింత బలంగా ఉంది!
ఈ సమయంలో మోదీ – బీ.జే.పీ. – ఎన్. డీ. ఎ. కేంద్ర ప్రజా ప్రభుత్వం హిందూ అట్రాసిటీ యాక్ట్, బ్రాహ్మణ్ అట్రాసిటీ యాక్ట్ ఈ రెండిటినీ తీసుకొస్తే బీ.జే.పీ. – ఎన్.డీ.ఎ. ఎంతో ఎంతో బలపడతాయి!దేశానికి, దేశంలోని పెద్ద శాతం ప్రజకు, భయంతో బతుకుతున్న హిందువులకు, హిందూ ఓటు ఏకీకృతం అవడానికి ‘హిందూ & బ్రాహ్మణ్ అట్రాసిటీ యాక్ట్’ ఒక మంత్రదండం ఔతుంది.
కేంద్ర ప్రజా ప్రభుత్వం ‘హిందూ & బ్రాహ్మణ్ అట్రాసిటీ యాక్ట్’ విషయంగా ఆలోచన త్వరిత గతిన ఆచరణ చెయ్యాల్సిన అవసరం, సమయం వచ్చేసింది.
భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఆఖండత్వాన్ని రక్షించుకునేందుకు-
కమ్యూనిస్ట్ కుట్రల్ని, కుల దుష్ట శక్తుల నుంచి దేశ సమాజాన్ని రక్షించుకునేందుకు-
విదేశీ మత మాఫియాల నుంచి దేశంలోని పెద్ద శాతం ప్రజల్ని రక్షించుకునేందుకు-
హిందూ విద్వేష శక్తుల నుంచి ఈ నేలను రక్షించుకునేందుకు ‘హిందూ & బ్రాహ్మణ్ అట్రాసిటీ యాక్ట్’ ఒక్కటే మేలైన విధానం.
***
దేశానికి వెనువెంటనే కావాల్సిన వాటిల్లో ప్రధానమైనది ‘హిందూ & బ్రాహ్మణ్ అట్రాసిటీ యాక్ట్’.
కేంద్ర ప్రజా ప్రభుత్వం ‘హిందూ & బ్రాహ్మణ్ అట్రాసిటీ యాక్ట్’ను వెనువెంటనే తీసుకురావాలి. దేశంలోని పెద్ద శాతం ప్రజ అయిన హిందూ వ్యతిరేక ‘కమ్యూనల్ వయలెన్స్ బిల్’ తో
2011లో హిందువుల్ని విదేశీ మతాలతో ధ్వంసం చెయ్యాలన్న అతి భయంకరమైన కుట్రను భగ్నం చేసి దేశాన్ని, దేశ హిందువుల్ని దక్కించుకున్న బీ.జే.పీ. – ఎన్.డీ.ఎ. ఈ ‘హిందూ & బ్రాహ్మణ్ అట్రాసిటీ యాక్ట్’ ను తీసుకొచ్చి దేశాన్ని పటిష్టతనూ, హిందువులకు భద్రతనూ ఇవ్వాలి.
‘హిందూ & బ్రాహ్మణ్ అట్రాసిటీ యాక్ట్’ మోదీ – బీ.జే.పీ. మాస్టర్ స్ట్రోక్ అవుతుంది. దేశానికి అపూర్వమైన బలాన్ని, మేలును కలిగిస్తుంది. విదేశీ మత మాఫియా పన్నాగాలకు, కుల కుట్రలకు చావు దెబ్బ అవుతుంది. ‘ రానున్న ఎన్నికల్లో మోదీ – బీ.జే.పీ. కి చారిత్రిక విజయాన్ని తెచ్చి పెడుతుంది.
– రోచిష్మాన్
9444012279