– మాచన ప్రార్ధన
(మార్చి 11 నో స్మోకింగ్ డే)
ఒరేయ్ రఘు ..చూడరా నేనెలా.. అయ్యానో..ఎముకల గూడు లా”
నేను వెళ్ళిపోతున్నానురా..
నువ్వు ఎన్ని సార్లు చెప్పినా..నేను వినలేదు చూడు..నన్ను ఎలా చేసిందో స్మోకింగ్ హాబిట్.
రఘు నాకు ఒక్క ప్రామిస్ ఇవ్వరా..
స్మోకింగ్ మానేయరా అని నాకు ఎన్నో సార్లు చెప్పావు కదా..
ఇదే మాట ను..
ఎవ్వరు ఎక్కడ సిగరెట్ తాగుతూ కనపడినా చెప్పు.
ఈ ఒక్క మాట ఇవ్వు చాలు
హాయిగా కన్ను మూస్తాను”..
అంటూ..
చివరి సారిగా నా ఆప్త మిత్రుడు కాన్సర్ తో పోరాడి..పోరాడి.ఇక నేను గెలువను ఓడి “పోతున్నాను” అని అన్న మాటలు ఇప్పటికీ నా చెవిలో ఆలా..అలా ..వినిపిస్తూనే ఉంటాయి.
రఘు ముందుకు వెళ్ళు..అని నాకు పధ నిర్దేశం చేస్తూనే ఉంటాయీ..
అని తన మిత్రుడి మరణం తలుచుకుని ఇప్పటికీ కన్నీటి పర్యంతమౌతారు
టుబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత మాచన రఘునందన్.
22 ఏళ్లుగా పొగాకు నియంత్రణ కు కృషి చేస్తూ..
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లో అవార్డు లు సాధించిన మాచన.
నేషనల్ నో స్మోకింగ్ డే డే (మార్చి 11) సందర్భంగా..
పొగాకు నియంత్రణ కోసం ఆయన చేస్తున్న కృషి అనిర్వచనీయం.ఒకటి కాదు రెండు కాదు ఇరవై రెండు ఏళ్లుగా.. టుబాకో కంట్రోల్ కోసం రఘునందన్ చేస్తున్న కృషి ని ఓ తపస్సు గా నే భావించవచ్చు. ఎందుకంటే..పొగాకు నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యల ను వివరిస్తూ..రాష్ట్రపతి కి సైతం దాదాపు ఓ 60 లేఖలు రాశారు.
అంతే కాదు సుప్రీం కోర్టు కు చేసిన “మాచన” ప్రార్థన కు ఫిదా ఐన దేశ సర్వోన్నత న్యాయస్థానం రఘునందన్ పిటీషన్ ను ప్రజా ప్రయోజన వ్యాజ్యం గా స్వీకరిస్తున్నట్టు తెలిపింది.
మీ..హృదయం పై కాస్త దయ చూపండి సార్.
ఊపిరితిత్తులపై , హృదయం పై దయచేసి దయ చూపండి.
అంటూ..
వినమ్రంగా ప్రార్థిస్తూ.. వేడుకుంటారు రఘునందన్.
ఓ సమాజ హితుడిగా
ప్రతి ఒక్కరి ప్రాణ స్నేహితుడయ్యారు.
ధూమపానం,పొగాకు అలవాట్లకు దూరం గా ఉంటే కాన్సర్ ను మన దరిదాపుల్లో కి కూడా రాదని,చికిత్స కంటే నివారణే ఉత్తమమని పోగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టీ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.
సరదాగా చేసుకునే స్మోకింగ్ అలవాటు వల్ల ఆరోగ్యం క్షీణించడం తో పాటు,గుండె జబ్బు లు వచ్చే అవకాశం లేక పొలేదని హితవు చెప్పారు.
మేడ్చల్ జిల్లా కేశవరం కు చెందిన రఘునందన్ రెండు దశాబ్దాల కు పైగా పొగాకు నియంత్రణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.
పలు జాతీయ అంతర్జాతీయ అవార్డు లు అందుకున్నారు.ఎక్కడ ఎవరు సిగరెట్ తాగుతూ..తన కు తారస పడితే..మన కెందుకు లే అని ఊరుకోకుండా..దమ్ము కొట్టడం మానడం మంచిది సార్ అంటూ వినమ్రంగా ప్రార్దిస్తారు.
విధి నిర్వహణలో భాగంగా వందల గ్రామాలు, వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎంతో మంది ని ధూమపానం మానేలా శక్తి వంచన లేకుండా మాచన రఘునందన్ కృషి చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్రపతి భవన్ అధికార వర్గాలు అభినందించారు.
22 ఏళ్లుగా పొగాకు నియంత్రణ కు కృషి చేయడం అంత ఆశామాషి కాదని సాక్షాత్ రాష్ట్రపతి భవన్ వర్గాలు కొనియాడటం ఆషా మాషీ కాదు.
జెనీవా వేదిక గా జరిగిన ప్రపంచ పొగాకు వ్యతిరేక సదస్సు లో తెలంగాణ నుంచి పాల్గొన్నది “మాచన” ఒక్కరే.
తన ఇద్దరు ఆప్త మిత్రుల ను పొగాకు,ధూమపానం బలి తీసుకోవడం వల్ల తీవ్రంగా కలత చెంది పొగాకు ఉత్పత్తుల వల్ల ముఖ్యంగా విద్యార్థులు, యువత తెలిసో తెలియకో కూడా స్మోకింగ్ అలవాటుకు గురి కావద్దని రఘునందన్ సమాజ హితుడు గా .. ప్రతి ఒక్కరికీ ఓ “ప్రాణ” స్నేహితుడు గా మారారు