– నాడు 90 శాతం మంది ముందుకొచ్చి ఇచ్చారు
– ఇప్పుడు అదే 90 శాతం మంది ఎందుకు ఇవ్వడం లేదు?
– ఇది రైతులపై ప్రశ్న కాదు..నాయకత్వం మీద వచ్చిన ప్రశ్న
– ఇది కేవలం సంఖ్యల విషయం కాదు.. నమ్మకం గురించి చెబుతున్న కథ
(సతీష్ చాగంటి )
2015లో అమరావతి రాజధాని కోసం భూసమీకరణ ప్రారంభమైనప్పుడు చంద్రబాబు నాయుడు రైతులను 35 వేల ఎకరాల భూమి ఇవ్వమని కోరారు.
ఆ సమయంలో సింగపూర్ మాస్టర్ ప్లాన్లు లేవు…
నార్మన్ ఫాస్టర్ డిజైన్లు లేవు…
యూనివర్సిటీలు లేవు…
పెద్ద రోడ్లు లేవు…
చూపించడానికి గొప్ప నిర్మాణాలు కూడా లేవు.
అయినా కూడా రైతులు ముందుకు వచ్చారు. ఎందుకంటే వారు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వెనకాల ఉన్న నిజాయితీని నమ్మారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేశారు.
దానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే — భూసమీకరణ (phase 1) ప్రారంభమైన మొదటి రెండు నెలల్లోనే, దాదాపు 90% మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. కేవలం 10% మంది మాత్రమే మొదట్లో వెనుకంజ వేశారు.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.
2026 జనవరిలో ప్రారంభమైన అమరావతి ఫేజ్-2 భూసమీకరణలో
ఇప్పటివరకు కేవలం 10% మంది రైతులే ముందుకు వచ్చారు.
90% మంది రైతులు ఇంకా భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.
ఇది కేవలం సంఖ్యల విషయం కాదు.
ఇది నమ్మకం గురించి చెబుతున్న కథ.
ఫేజ్-1లో రైతులు నాయకత్వంపై నమ్మకం పెట్టుకుని ముందుకొచ్చారు.
కానీ ఇప్పుడు చెప్పే మాటలకు – చేసే పనులకు మధ్య ఎక్కడో గ్యాప్ ఉందని రైతులు గుర్తించినట్టుగా కనిపిస్తోంది.
ఇది రైతులపై ప్రశ్న కాదు.
ఇది నాయకత్వం మీద వచ్చిన ప్రశ్న.
చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచించుకోవాలి — ఫేజ్-1లో రెండు నెలల్లో 90% భూములు ఇచ్చిన రైతులు, ఫేజ్-2లో ఎందుకు ముందుకు రావడం లేదు?