అమరావతిలో కొత్త కేటాయింపులు (మొత్తం 5.843 ఎకరాలు):
CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్): రాయపూడి గ్రామంలో ఆఫీసు మరియు COE ఏర్పాటు కోసం 0.8 ఎకరాలు 60 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించారు.
APSIRD & PR: కురగల్లు మరియు నవులూరు గ్రామాలలో స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ రీజినల్ క్యాంపస్ ఏర్పాటు కోసం 5.043 ఎకరాలు లీజు ప్రాతిపదికన కేటాయించారు.
గత కేటాయింపుల సవరణ (25 ఎకరాలు):
KIMS హాస్పిటల్: కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణం కోసం నిడమర్రు గ్రామంలో 2 ఎకరాలు కేటాయించబడ్డాయి.
ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ: మెడికల్ కాలేజీతో కూడిన BISER నిర్మాణం కోసం నిడమర్రు గ్రామంలో 23 ఎకరాలు కేటాయించబడ్డాయి. ఈ రెండింటికీ ఎకరాకు ₹50 లక్షల చొప్పున 60 ఏళ్ల లీజుకు నిర్ణయించారు.
పరిహార భూమి కేటాయింపు (Compensatory Allotment):
తుళ్ళూరు ఎడ్యుకేషనల్ సొసైటీ: తుళ్ళూరు గ్రామంలో రోడ్డు (N-14) నిర్మాణం వల్ల భూమి కోల్పోయినందుకు పరిహారంగా, రాయపూడి గ్రామంలో 3.0 ఎకరాల భూమిని కాలేజీ నిర్మాణం కోసం ఉచితంగా (Freehold basis) కేటాయించారు.
– వల్లభనేని సురేష్
9010099208