– భౌతికంగా గాంధీని ఉండనివ్వలేరు
– ఆయన పేరు మీద ఉన్న పథకాన్ని వారు ఉంచడం లేదు
– లబ్ధిదారులకు 500 కే గ్యాస్ ఇవ్వొద్దా?
ప్రభుత్వానికి పేరు రావద్దా ?
– బిజెపి నేతలకు ఇదేం ఆలోచన?
– అక్కసు ఉంటే ఇంట్లో కూర్చోండి
– బీఆర్ఎస్ స్నేహితులు కూర్చోకుండా బయటికి పోతే ఎలా.?
– – బడ్జెట్‌పై శానససభలో బీజేపీ, బీఆర్ఎస్పై ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క ఎదురుదాడి
హైదరాబాద్: బడ్జెట్ రిప్లై ఇచ్చే సమయంలో అవమానిస్తూ టిఆర్ఎస్ నేతలు వాకౌట్ చేసి సభను, ప్రజాస్వామ్యాన్ని, గౌరవ సభ్యులను, రాష్ట్ర ప్రజలను అవమానించకండి. అక్కసు ఉంటే ఇంట్లో కూర్చోండి. అంతేతప్ప బడ్జెట్ కాపీలు చింపి చెవిలో పెట్టుకుని వెళ్ళే విధానానికి టీఆర్ఎస్ నేతలు స్వస్తి పలకాలి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పైసా పైసా కూడబెట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను అందరూ అభినందించాలి
బీఆర్ఎస్ పాలకులు మూడు డీఎలు పెండింగ్‌లో పెట్టి పోయారు.. వారికి మైకు దొరికితే చాలు ఎండమావులు సృష్టించాలి. ప్రజలను ఎక్కడో విహరింప చేయాలి అన్నట్టు చూస్తున్నారు. అయిపోయింది టిఆర్ఎస్ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోను వారిని రాష్ట్ర ప్రజలు ఓడించారు. మా భవిష్యత్తును నిర్మాణం చేయండి అని ప్రజలు మమ్ములను ఇక్కడ కూర్చోబెట్టారు. బీఆర్ఎస్ స్నేహితులు కూర్చోకుండా బయటికి పోతే ఎలా.?
రెగ్యులర్ రోడ్లతోపాటు 10,372 హమ్ రోడ్లు చేపడుతున్నాం. ఆర్ అండ్ బి లో 13,500 కోట్ల పైబడి పెట్టుబడితో రోడ్లు చేపడుతున్నాం రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు రీజినల్ రింగ్ రోడ్డు మధ్య 39 రేడియల్ రోడ్లు నిర్మిస్తూ పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్యూర్ ప్యూర్ రేర్ ప్రణాళికతో ముందుకు పోతున్నాం వారికి హైదరాబాదు నగరం బాగుపడడం ఇష్టం లేదా? టిఆర్ఎస్ నేతలు గ్లోబల్ సమ్మెట్టు ఎలాగూ చేయలేకపోయారు. అభినందించకపోగా ఎంఓఏలు జరిగితే అవమానిస్తున్నారు.
బడ్జెట్ పుస్తకాన్ని చింపి చెవిలో పెట్టుకుని పోయిన.. మేం అనుకున్న ప్యూర్ క్యూర్ రేర్ ఆగదు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. బిజెపి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నాకు మంచి మిత్రుడు సుదీర్ఘ కాల స్నేహం ఒకే భావజాలంతో పనిచేసిన వాళ్ళం. ఆయన తెలంగాణ రాష్ట్రం వాడిని అని మర్చిపోయి, పక్క రాష్ట్రం వాడిని అన్నట్లుగా మాట్లాడుతున్నారు
రాష్ట్రంలో విద్యుత్ యూనిట్ ధరను పది రూపాయలకు పెంచామని బిజెపి నేతలు ఆరోపించారు.. అది వాస్తవం కాదు. మేం అధికారంలోకి వచ్చాక కరెంటు చార్జీలు పెంచలేదు. మాకు ప్రజల పట్ల అంకితభావం చిత్తశుద్ధి ఉంది విద్యుత్ సబ్సిడీలు ఎత్తివేయాలి. విద్యుత్తు ఉత్పత్తికి ఎంత ఖర్చు అయితే అంత వసూలు చేయాలి. విద్యుత్ రేట్లు పెంచకపోతే కేంద్రం నుంచి కావాల్సిన ప్రయోజనాలు ఇవ్వం అని, పది సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రానికి ప్రయోజనాలు ఇవ్వడం లేదు.
ఏ సబ్సిడీలు ఎత్తివేయం. 200 యూనిట్ల విచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తాం.
మహేశ్వర్ రెడ్డి చీటింగ్ బడ్జెట్ అంటున్నారు. మేము ఎవరిని చీట్ చేసాం ఆయన చెప్పాలి. 1.15 లక్షల కుటుంబాలకు 5 లక్షల ప్రమాద జీవిత బీమా కల్పించడం చీటింగ్ అవుతుందా? ప్రభుత్వ ఉద్యోగులకు 1.20 కోట్ల ప్రమాద బీమా కల్పించడం, విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వడం, ప్రస్తుత పథకాలతో పాటు కొత్తవి అమలు చేయడం చీటింగ్ అవుతుందా మహేశ్వర్ రెడ్డి సమాధానం చెప్పాలి
500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించాం. లబ్ధిదారుల పక్షాన ముందుగానే 500 జమ చేస్తాం. మిగిలిన 500 లబ్ధిదారులు చెల్లిస్తారు. అనుమతి ఇవ్వండని కేంద్రాల్లోని పెట్రోలియం మాత్రమే కలిసి రాతవపూర్వకంగా అడిగాం అయినా వారు ఒప్పుకోలేదు. బిజెపి ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళండి. వ్యవస్థ కేంద్రం చేతిలో ఉంది. రాష్ట్రంలోని లబ్ధిదారులకు 500 కే గ్యాస్ ఇవ్వొద్దా? ప్రభుత్వానికి పేరు రావద్దా ? బిజెపి నేతలకు ఇదేం ఆలోచన?
ఒకాయన బడ్జెట్ పుస్తకాలను చించి చెవిలో పెట్టుకుని పోతే, మరొకాయన చీటింగ్ బడ్జెట్ అంటారు. ఇది ఎక్కడి న్యాయం? కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయని బిజెపి ఎమ్మెల్యేలు అంటున్నారు. కేంద్రం నుంచి ఎలా వస్తున్నాయి? అవి మా డబ్బులే కదా? రాష్ట్రాలు కడితేనే కేంద్రానికి చేరుతాయి. కట్టిన డబ్బులు రాష్ట్రానికి సమానంగా రావాలి కదా? రాష్ట్ర అభివృద్ధికి బిజెపి నేతలు మాతో కలిసి పోరాడడానికి ముందుకు రావాలి.
కేంద్రానికి రూపాయి పంపితే 30 పైసలు తిరిగి ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రూపాయి కడితే 62 పైసలు, తమిళనాడుకు 26 పైసలు, కేరళకు 60 పైసలు ఇస్తున్నారు, అదే బీహార్ కు రూపాయి కడితే 6.69 రూపాయలు ఉత్తరప్రదేశ్ కు 1.96, మధ్యప్రదేశ్ కు 1.87 రూపాయలు చెల్లిస్తున్నారు. తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణ రాష్ట్రం దేశంలో భాగం కాదా? మేం డబ్బులు కడితే తీసుకుపోయి, ఎక్కడో ఖర్చు పెడుతున్నారు.బిజెపి నేతలు తెలంగాణ పై స్వారీ చేయాలని చూస్తున్నారు.
త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని బిజెపి నేతలు గాలి మేడలు అన్నారు. మేము చెప్పడం లేదు. ప్రధానమంత్రి 20 47 కల్లా 30 త్రిలియన్ డాలర్ల ఎకానమీ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి. అన్నారు అందులో భాగంగా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధాని మోడీ చెప్పింది కరెక్ట్ కాదు అని బిజెపి నేతలు చెప్పదలుచుకున్నారా?
మేం కోఆపరేటివ్ నిజాన్ని నమ్ముతున్నాం. డ్రీమింగ్ బిగ్ మాతో కలిసి రండి. 1950 నుంచి 2014 వరకు ఈ దేశాన్ని 13 మంది ప్రధాని మంత్రులు వాజ్‌పేయి తో సహా పరిపాలించారు. ఇన్ని సంవత్సరాల్లో వారు చేసిన అప్పు 56.66 లక్షల కోట్లు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 140 లక్షల కోట్లు. ప్రస్తుతం దేశం అప్పు 197 లక్షల కోట్లు.
2047 ఇండియన్ డాలర్ అకాడమీ సాధనలో కొత్త మార్గాలు వెతుకుతాం లక్ష్యాన్ని సాధిస్తాం. 6 గ్యారంటీల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ రైతు భరోసా రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు 200 యూనిట్ల విద్యుత్తు, అన్ని అమలు చేశా ఆత్మీయ భరోసా 1 మాత్రం కొన్ని ఆర్థిక కారణాలతో చేయలేకపోయాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ సంవత్సరం అమలు చేస్తాం. రాజీవ్ యువ వికాసం ఈ సంవత్సరం అమలు చేస్తాం
సిపిఐ నేత సాంబశివరావు మా మిత్రపక్షం. వారిని మా ప్రభుత్వంలో భాగస్వామిగా భావించి సంక్షేమ విధానం నిర్ణయాల్లో భాగస్వాంగా చేసుకుంటూ పోతున్న. భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకుపోతాం. షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఒక్కటి కూడా పెండింగ్‌లో లేవు. 75 శాతం పూర్తయిన రెసిడెన్షియల్ భవనాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతి 15 రోజులకు ఒకసారి వాటి బిల్లులు మంజూరు చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ సంక్షేమంతో పాటు విద్యా వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించింది.
గత పది సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 22% బడ్జెట్ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అందుకే అనేక పథకాలు అమలు చేయలేకపోయారు. కానీ మేం వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెట్టాం. అందుకే ఆరు శాతం మాత్రమే పెరుగుదల చూపించాం. రాబోయే రెండేళ్లలో ఆదాయం వ్యయం సమానంగా ఉండేలా బడ్జెట్‌ని రూపొందిస్తాం. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ స్థాపించడం సాధ్యం కాదు అని అంటున్నారు. కానీ స్టీల్ కు సంబంధించిన ఏదో ఒక ఫ్యాక్టరీని అక్కడ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది.
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదవాళ్ల కోసం కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చి కేవలం 60 శాతం ఇస్తుంది 40 శాతం రాష్ట్రం పెట్టుకోవాలి అంది. చీటింగ్ అంటే ఇది. భౌతికంగా గాంధీని ఉండనివ్వలేరు, ఆయన పేరు మీద ఉన్న పథకాన్ని వారు ఉంచడం లేదు.