సాధారణ ప్లానిటోరియాల్లో రికార్డ్ చేసిన వీడియోలు చూపిస్తారు. కానీ అమరావతిలో రాబోయే ఈ కాస్మోస్-2 ప్రత్యేకత వేరు. ఇది కేవలం చూసేది కాదు.. నేరుగా అంతరిక్షంతో కనెక్ట్ అయ్యే వేదిక!
హన్లే లేదా కొడైకెనాల్లోని భారీ టెలిస్కోప్‌లు ఆకాశంలో ఏది చూస్తున్నాయో, దాన్ని లైవ్‌లో అమరావతి ప్లానిటోరియం తెరపై మనం చూడవచ్చు. అంటే నక్షత్ర మండలాలు, గ్రహాల గమనాన్ని లైవ్‌లో చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
పాత ప్రొజెక్టర్ల స్థానంలో అత్యాధునిక LED డోమ్ టెక్నాలజీ రాబోతోంది. ఇది భారతదేశంలోనే రెండోది (మొదటిది మైసూర్). దీని రిజల్యూషన్ మరియు బ్రైట్నెస్ మనల్ని నిజంగానే అంతరిక్షంలో విహరిస్తున్నామనే సంభ్రమంలో ముంచెత్తుతాయి.
2026-27 బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రం భారీ ఊతమిచ్చింది. దీని బాధ్యతను ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) తీసుకుంది.
కేవలం 18 నెలల కాలపరిమితితో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 2027 నాటికల్లా అమరావతి గగనతలం నుంచి తారలను తాకే అవకాశం రాబోతోంది.
ఇది కేవలం టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, భవిష్యత్ శాస్త్రవేత్తలను తయారు చేసే రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్.
“టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని చూడటం ఒక ఎత్తైతే.. ప్రపంచస్థాయి టెక్నాలజీతో నక్షత్రాల మధ్య విహరించేలా అనుభూతిని పొందడం మరో ఎత్తు.” అమరావతి కాస్మోస్-2 ఆ అనుభవాన్నే మనకు అందించబోతోంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దక్షిణ భారతదేశంలో అమరావతి ఆస్ట్రో-టూరిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది.
