డెడ్‌బాడీకి కుట్లు వేయడంలో ‘గోల్డ్ మెడలిస్ట్’.. గొడ్డలి బ్రోకి విన్నపం!
సున్నాలు మాత్రం వెయ్యగల సున్నాగన్ నవ్వాపుకోలేని కథలు బావున్నాయ్!
అవినాష్ రెడ్డి గారి తాజా ‘ఆణిముత్యాలు’:
జగన్ మార్క్ ‘మావిగన్’ (MAVIGAN) వస్తేనే రాష్ట్రానికి మోక్షం! అమరావతికి 2 లక్షల కోట్లు ఎక్కడివి? మా ‘లో-బడ్జెట్’ ప్లాన్ కి 20 వేల కోట్లు చాలు. ఏదో చిన్న గెజిట్ నోటిఫికేషన్ వస్తే కూటమి వాళ్ళు పండగ చేసుకుంటున్నారు!
మా సూటి ప్రశ్నలు:
పండగ చేసుకుంటే మీకెందుకు మండుతోంది?
చిన్న విషయాలకే మేం పండగ చేసుకుంటే మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? పాపం.. బాబాయి కోసం కదిరిలో స్పెషల్ గా గొడ్డలి ఆర్డర్ ఇచ్చి కొన్నంత మాత్రాన, ఆ ఊరి పేరులో ఒక అక్షరం మన పులివెందుల పేరులో ఒక అక్షరంతో –గొడ్డలి అని కూడా మనం పెట్టుకోలేం బ్రో! జగన్ గారి ఐడియాలజీ రాష్ట్రానికి అస్సలు అవసరం లేదని తేల్చి చెప్పి.. జనం కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పంపించేశారు. ఆయనకి మిగిలింది పులివెందుల మాత్రమే!
లోక్‌సభలో మీరే కదా ఏకాకి?
నువ్వు కడప ఎంపీవి కదా.. లోక్‌సభలో మీ ‘అమావాస్య’ పార్టీ తప్ప, దేశంలోని మరే పార్టీ అయినా అమరావతికి అడ్డు చెప్పిందా? అందరూ ఆహ్వానిస్తుంటే, ఒక్క మీరే ఎందుకు ఏడుస్తున్నారు?
కండక్టర్‌కే టికెట్ కొట్టేంత సీను మీకు ఉందా?
అమరావతికి 2 లక్షల కోట్లు అవుతాయని మీకు కలలో వినిపించిందా? చంద్రబాబు గారు తలుచుకుంటే నిధులు ఎలా తేవాలి, ప్రపంచస్థాయి నగరం ఎలా కట్టాలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన అనుభవం ముందు నీ 20 వేల కోట్ల లెక్కలు ‘కామెడీ సర్కస్’ లా ఉన్నాయి. మీ పెద్దయ్య, మీ అన్న కలిసి కడప స్టీల్ ప్లాంట్ కి మూడు సార్లు కొబ్బరికాయలు కొట్టారు కదా.. ఆ గొడ్డలితో కనీసం అక్కడ ముళ్ళ చెట్లనైనా కొట్టారా?
ఒకవైపు ఉక్కు సంకల్పం.. మరోవైపు ఉత్తుత్తి శంకుస్థాపనలు!
అదే ‘ఉక్కు మనిషి’ నాయుడు గారు ప్రపంచ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ను తీసుకువచ్చి ఉత్తరాంధ్ర తలరాతను మారుస్తున్నారు. రాయలసీమ (ఓర్వకల్లు)లో జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్‌కు 2018లో శంకుస్థాపన చేసి, మొన్న అక్టోబర్ 2024లో దానిని సాకారం చేశారు. ఆంధ్రుల హక్కు – విశాఖ ఉక్కును నిలబెట్టడం కోసం అర్ధరాత్రి 2.30 గంటలకు కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి, విన్నవించి ప్లాంట్‌ను లాభాల బాట పట్టించిన చరిత్ర ఆయనది.
కడప స్టీల్ ప్లాంట్ – మాటలు మీవి.. చేతలు ఆయనవి!
విభజన హామీగా కాంగ్రెస్ చెప్పిన కడప స్టీల్ ప్లాంట్ కుదరదని కేంద్రం చేతులెత్తేసినా, చంద్రబాబు గారు 2018లోనే రాయలసీమ స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేశారు. జగన్ గారు వచ్చి పేరు మార్చి, స్థలం మార్చి రెండు సార్లు శంకుస్థాపన చేసి సర్కస్ వినోదం పంచారు తప్ప ఒక్క అడుగు ముందుకు వేయలేదు. కానీ అదే కడపలో నాలుగో స్టీల్ ప్లాంట్ కోసం ఈ వారమే APIIC ద్వారా జిందాల్ స్టీల్ కోసం 1100 ఎకరాలు బదలాయించి, ₹55 కోట్లు కట్టి సేల్ డీడ్ పూర్తి చేయించింది కూటమి ప్రభుత్వం! ఏప్రిల్ 2029 కల్లా మొదటి దశ పూర్తి చేయడమే మా లక్ష్యం.
మొన్నటికి మొన్న మీ వదిన గారి సిమెంట్ కంపెనీ ఉన్న ఊరి వాళ్లే మీ పార్టీని ఛీ కొట్టారు. పులివెందుల జెడ్పీటీసీలో కనీసం ‘డిపాజిట్’ కూడా రాలేదు. మీ ‘సంధింటి’ వారు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కాపాడుకుంటే అదే పదివేలు. అవి కూడా గాలిలో దీపాల్లా ఉన్నాయి. రాష్ట్రానికి గొడ్డలి ఐడియాలు, గన్ ప్లాన్ లు ఇవ్వడం మానేసి.. ఆ రోజు డెడ్‌బాడీకి కుట్లు ఎందుకు వేయించారో కోర్టులో నిజం చెప్పండి. సున్నాలు మాత్రం వేయగల ‘సున్నాగన్’ కథలు ఆపి, ముందు సొంత చెల్లెళ్ళకు ‘మంచి అన్నయ్యలు’ అనిపించుకోండి.. అది చాలు!
-చాకిరేవు