– టెండర్లలో పాల్గొనాలంటే 10 నుంచి 25 కోట్ల రూపాయల సాల్వెన్సీ సర్టిఫికెట్ తేవాలని కాంట్రాక్టర్లకు నిబంధన
– నోట్ బుక్కులకు వాటర్ మార్కు నిబంధన పెట్టారు
– అదేమైనా జాతి భద్రత కు సంబంధించిన విషయమా ?
– అస్మదీయ కంపెనీలకు విద్యా రంగ కాంట్రాక్టులు ఇవ్వాలనేది కాంగ్రెస్ కుట్ర
– చేవెళ్ల డిక్లరేషన్ లో చెప్పిన సా మాజిక న్యాయం ఇదేనా ?
– బీసీ , ఎస్సీ , గిరిజన , మైనారిటీ కార్పొరేషన్ల కు ఈ టెండర్లలో ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు?
– కర్ణాటక లో ప్రొక్యూర్ మెంట్ పాలసి లో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించారు
– ఇక్కడెందుకు కల్పించరు ? అక్కడో న్యాయం ఇక్కడో న్యాయం?
– బడా కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దండుకునేందుకే నిబంధనలు మార్చారు
– ఢిల్లీ కి మూటలు పంపేందుకే ఈ జీవో 17
– బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కేసీఆర్ హయం లో విద్యా ,మైక్రో ఇండస్ట్రీస్ రంగం లో అన్ని రంగాల్లో న్యాయం జరిగింది. 12 వేల మంది చిన్న ,మధ్య తరహా కాంట్రాక్టర్లకు కేసీఆర్ న్యాయం చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ , చేవెళ్లలో ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ కాంట్రాక్టులలో బీసీ లకు 42 శాతం ,ఎస్సీలకు 18 శాతం ,గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ డిక్లరేషన్ల లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రెండేళ్ల నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ఆ వాగ్దానం నెరవేర్చ లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయలేదు సరికదా జీవో 17 తెచ్చి చిన్న కాంట్రాక్టర్ల పొట్టగొడుతోంది ఈ జీవో ప్రకారం స్కూళ్ళు , గురుకులాల్లో వస్తువుల సరఫరా కు జాతీయ సంస్థలను టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించింది.
ఇందులో 2 వేల కోట్ల కుంభకోణం జరిగింది. బూట్లు, స్కూల్ బ్యాగులు ,ట్రంక్ పెట్టెలు బెల్ట్ ల సరఫరా కు టెండర్లలో పాల్గొనాలంటే 10 నుంచి 25 కోట్ల రూపాయల సాల్వెన్సీ సర్టిఫికెట్ తేవాలని కాంట్రాక్టర్లకు నిబంధన పెట్టారు. నోట్ బుక్కులకు వాటర్ మార్కు నిబంధన పెట్టారు .అదేమైనా జాతి భద్రత కు సంబంధించిన విషయమా ? స్థానికంగా ఉన్న చిన్న కంపెనీలను దెబ్బ కొట్టి తమ అస్మదీయ కంపెనీలకు విద్యా రంగ కాంట్రాక్టులు ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర గా కనిపిస్తోంది.
హైకోర్టు జీవో 17 ను మార్చాలని చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చేవెళ్ల డిక్లరేషన్ లో చెప్పిన సా మాజిక న్యాయం ఇదేనా ? తుగ్లక్ లాగా ఈ ప్రభుత్వం దుర్నీతి తో ఆలోచిస్తున్నది. ఏవైనా అభ్యంతరాలు చెప్పాలంటే కూడా కాంట్రాక్టర్ కు వివిధ మొత్తాల్లో డీడీలు కట్టాలని విచిత్రమైన నిబంధన పెట్టారు. బీసీ ,ఎస్సీ ,గిరిజన ,మైనారిటీ కార్పొరేషన్ల కు ఈ టెండర్లలో ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? బడా కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దండుకునేందుకే నిబంధనలు మార్చారు.
ఏఐసీసీ కి బడా కాంట్రాక్టర్లను ఎటిఎం లు గా మార్చారు. ఢిల్లీ కి మూటలు పంపేందుకే ఈ జీవో 17 తెచ్చారు. తక్షణమే జాతీయ కాంపిటీటివ్ బిడ్డింగ్ అంటూ తెచ్చిన జీవో 17 రద్దు చేయాలి.
ప్రొక్యూర్ మెంట్ పాలసి లో బీసీ ,ఎస్సీ ,ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కర్ణాటక లో ప్రొక్యూర్ మెంట్ పాలసి లో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించారు .ఇక్కడెందుకు కల్పించరు ? అక్కడో న్యాయం ఇక్కడో న్యాయం. కేరళ ఎన్నికల ప్రచారం లో రేవంత్ తన పాలన గురించి గొప్పగా చెప్పారు. ఆ గొప్పతనం చిన్న తరహా పరిశ్రమలను వీధుల పాలు చేయడమా ? ఏపీ లో కూడా అక్కడి పరిశ్రమలకే ప్రొక్యూర్ మెంట్ అవకాశం ఇచ్చారు.
ఏప్రిల్ 14 న అంబెడ్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జీఓ 17 రద్దు చేసి క్షమాపణ చెప్పాలి. ప్రొక్యూర్ మెంట్ పాలసి లో సామాజిక న్యాయం విస్మరించడాన్ని నిరసిస్తూ సీఎం కు లేఖ రాస్తా. కేసీఆర్ హాయం లో చిన్న మధ్యతరహా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు కఠిన నిబంధనలను మార్చారు. ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించారు. పేదల పొట్టగొడుతున్న విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలి. ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ నేత అబ్రార్ హుస్సేన్ ఆజాద్ పాల్గొన్నారు.