– ” సీఎం ప్రజావాణి “ని సందర్శించిన మధ్య ప్రదేశ్ తహసీల్దార్లు
– సీఎం ప్రజావాణి స్ఫూర్తి దాయకం
– మధ్య ప్రదేశ్ తహసీల్దార్ల మనోగతం
హైదరాబాద్: సీఎం ప్రజావాణి పనితీరు యావత్ దేశానికే ఆదర్శం అని మధ్యప్రదేశ్ రాష్ట్ర తహసిల్దార్లు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో శుక్రవారం జరిగిన సీఎం ప్రజావాణిని మధ్యప్రదేశ్ రాష్ట్ర తహసిల్దారులు సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం ప్రజావాణి అమలు జరుగుతున్న తీరును వారు పరిశీలించారు.
వివిధ డెస్క్ అధికారులను పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ప్రజావాణి కార్యక్రమం తమలో స్ఫూర్తిని నింపిందని, ఇలాంటి బృహత్ కార్యక్రమం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని వారు తమ మనోగతాన్ని ఆవిష్కరించారు. సీఎం ప్రజావాణి పనితీరును క్షుణ్ణంగా అధ్యాయం చేసిన తాము తమ రాష్ట్రం మధ్యప్రదేశ్ లో కూడా ఇదే తరహా ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వ, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. సీఎం ప్రజావాణి తీరుతెన్నులను ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వారికి వివరించారు.
సీఎం ప్రజావాణిలో 380 దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన 213వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 380 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 143, రెవెన్యూ శాఖకు సంబంధించి 38, ఇందిరమ్మ ఇండ్ల కోసం 120, ప్రవాసి ప్రజావాణికి 05 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 74 దరఖాస్తులు అందాయి.
సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సూర్య ప్రకాష్, ఏ.సీ.పీ. ఉమేందర్, ప్రవాసి ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.