– సరికొత్త ట్యాగ్‌లైన్‌గా ‘ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీడే’
హైదరాబాద్: దేశంలోనే అగ్రగామి ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (Olectra Greentech Limited) తన నూతన బ్రాండ్ ఐడెంటిటీని (సరికొత్త బ్రాండ్ గుర్తింపును) ఆవిష్కరించింది. సుస్థిర, విలువలతో కూడిన మొబిలిటీ దిశగా ప్రపంచవ్యాప్త మార్పుకు నాయకత్వం వహించాలనే దార్శనికతతో, సంస్థ ‘ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీడే’ (Transforming Everyday) అనే కొత్త ట్యాగ్‌లైన్‌తో ఇక నుంచి ముందుకు వెళ్లనుంది.
ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ స్థాయి నుంచి, ఏకీకృత మొబిలిటీ, ఇంధన పరిష్కారాలను అందించడంపై దృష్టి సారించే భవిష్యత్తుకు సిద్ధమైన, ఆవిష్కరణల ఆధారిత సంస్థగా ఒలెక్ట్రా సాధించిన పరిణామాన్ని ఈ నూతన బ్రాండ్ ఐడెంటిటీ ప్రతిబింబించనుంది.
సుస్థిరమైన మొబిలిటీ, ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా బాధ్యతాయుతమైన భవిష్యత్తు వైపు ప్రపంచాన్ని నడిపించాలనే ఒలెక్ట్రా దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా నూతన బ్రాండ్ నిలవనుంది. అందరికీ అందుబాటులో ఉండే ఆవిష్కరణలు, అత్యుత్తమ అమలు తీరు వినూత్నమైన కస్టమర్ అనుభవాన్ని అందించడం ద్వారా మొబిలిటీ, ఎనర్జీ సొల్యూషన్స్‌లో అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా నిలవడమే ఒలెక్ట్రా లక్ష్యం. తద్వారా సంస్థలో భాగస్వాములైన వారందరికీ అత్యుత్తమ విలువను పెంపొందించటానికి సంస్థ నిరంతరం కృషి చేస్తుంది.
ఒలెక్ట్రా కొత్త ట్యాగ్‌లైన్ ‘ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీడే’ అనేది పర్యావరణ వ్యవస్థలో అర్ధవంతమైన ప్రభావాన్ని కలిగించడంలో సంస్థ నిబద్ధతను తెలియజేస్తుంది. పౌరుల రోజువారీ ప్రయాణాలను మెరుగుపరచడం, కమ్యూనిటీలను బలోపేతం చేయడం, భాగస్వాములకు సాధికారత కల్పించడం, సంస్థలో పని పట్ల స్పష్టమైన ఉద్దేశ్యాన్ని పెంపొందించడం వంటివి ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ బ్రాండ్ పునఃస్థాపన ప్రధానంగా ‘ప్రాగ్మాటిక్ ఫ్యూచరిజం’ (ఆచరణాత్మక భవిష్యవాదం), ‘యాక్సెసిబుల్ ఇన్నోవేషన్’ (అందరికీ అందుబాటులో ఉండే ఆవిష్కరణలు), ‘ట్రస్టెడ్ గైడ్’ (విశ్వసనీయ మార్గదర్శి) అనే మూడు మూలస్తంభాలపై ఆధారపడి ఉంటుంది.
వాస్తవ పరిస్థితుల ఆధారంగా భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించడం, ఆవిష్కరణలు అందరికీ ఉపయోగపడేలా, విస్తృత పరిచేలా చేయడం, పర్యావరణ వ్యవస్థకు ఆధారపడదగిన భాగస్వామిగా సంస్థను నిలబెట్టడం అనేవి ఈ సూత్రాల ముఖ్య ఉద్దేశ్యం. ఇవే ఒలెక్ట్రా ఉత్పత్తి అభివృద్ధి, మార్కెట్ విధానాన్ని నిర్దేశిస్తాయి.
ఈ నూతన గుర్తింపు ఒలెక్ట్రా ప్రస్తుత విజువల్ ఎలిమెంట్స్‌కు కొత్త అర్ధాన్ని ఇస్తుంది. ‘ఒలెక్ట్రా ప్రిజం’గా పునర్నిర్మించబడిన మధ్యలోని త్రిభుజం, సంస్థ నిర్మాణాత్మక సమగ్రతను, లక్ష్యంతో కూడిన దిశను సూచిస్తుంది. అలాగే, దాని చుట్టూ ఉండే వృత్తం ‘ఒలెక్ట్రా యూనివర్స్’ను సూచిస్తుంది. ఇది వాటాదారులు, నగరాలు, సంస్థ సేవలు అందించే మౌలిక సదుపాయాల విస్తృత పర్యావరణ వ్యవస్థను ప్రతిబింబిస్తుంది.
ఈ ఆవిష్కరణ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ బాబు మాట్లాడుతూ.. “ఒలెక్ట్రా కొత్త బ్రాండ్ ఐడెంటిటీ కేవలం దృశ్యపరమైన మార్పు మాత్రమే కాదు, ఇది మా ఆశయాన్ని, ఆలోచనా విధానాన్ని, మేము ప్రయాణిస్తున్న దిశను సూచిస్తుంది. మా బ్రాండ్, సంస్థ , దీర్ఘకాలిక వ్యూహం ఒకే మార్గంలో సాగేలా ఇది నిర్ధారిస్తుంది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ నుండి భవిష్యత్తుకు సిద్ధమైన, ఆవిష్కరణల ఆధారిత సంస్థగా మారుతున్న తరుణంలో, మొబిలిటీ , ఎనర్జీ పర్యావరణ వ్యవస్థ అంతటా ‘ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీడే’ అనే మా నిబద్ధతను ఈ కొత్త గుర్తింపు ప్రతిబింబిస్తుంది” అని స్పష్టం చేశారు.
బలమైన ఉత్పాదక సామర్థ్యాలు, ప్రభుత్వ రంగాలలో పెరుగుతున్న ఆర్డర్లు , ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు, టిప్పర్లతో కూడిన విస్తృత పోర్ట్‌ఫోలియోతో ఒలెక్ట్రా సంస్థ తన తదుపరి దశలోకి అత్యంత పటిష్టమైన స్థితిలో ప్రవేశిస్తోంది. ఈ కొత్త బ్రాండ్ గుర్తింపు సంస్థ భవిష్యత్ దిశను , మార్కెట్లు, భాగస్వాములు మరియు విస్తృత ఈవీ (EV) పర్యావరణ వ్యవస్థతో బలమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి అవసరమైన గట్టి పునాదిని వేస్తుంది.